లాహిరు తిరిమన్నె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లాహిరు తిరిమన్నె
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హెట్టిగే డాన్ రుమేష్ లాహిరు తిరిమన్నె
పుట్టిన తేదీ (1989-08-09) 1989 ఆగస్టు 9 (వయసు 34)
మొరటువా, శ్రీలంక
మారుపేరుతిరి, ఆప్టిమస్
ఎత్తు5 ft 10 in (1.78 m)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
పాత్రTop-order batter
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 116)2011 జూన్ 16 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు2022 మార్చి 12 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 143)2010 జనవరి 5 - ఇండియా తో
చివరి వన్‌డే2019 అక్టోబరు 2 - పాకిస్తాన్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.66
తొలి T20I (క్యాప్ 44)2012 జూన్ 1 - పాకిస్తాన్ తో
చివరి T20I2016 మార్చి 28 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2008–presentRagama
2008–2009Basnahira South
2015Dhaka Dynamites
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 43 127 135 223
చేసిన పరుగులు 2,080 3,194 8,539 6,007
బ్యాటింగు సగటు 27.01 34.71 41.05 35.33
100లు/50లు 3/10 4/21 22/42 7/43
అత్యుత్తమ స్కోరు 155* 139* 187* 139*
వేసిన బంతులు 84 104 270 120
వికెట్లు 0 3 1 4
బౌలింగు సగటు 31.33 166.00 29.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/36 1/13 2/36
క్యాచ్‌లు/స్టంపింగులు 38/– 38/– 143/– 69/–
మూలం: ESPNcricinfo, 12 March 2022

హెట్టిగే డాన్ రుమేష్ లాహిరు తిరిమన్నె, లాహిరు తిరిమన్నె (జననం 1989, ఆగస్టు 9) శ్రీలంక మాజీ క్రికెట్ ఆటగాడు, మాజీ వన్డే కెప్టెన్. ఇతను ఎడమ చేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మన్, కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు. శ్రీలంక వన్ డే ఇంటర్నేషనల్ టీమ్‌కి వైస్-కెప్టెన్‌గా కూడా పనిచేశాడు, పేలవమైన ప్రదర్శనల తర్వాత జట్టు నుండి తొలగించబడ్డాడు.[1] 2018లో జాతీయ జట్టుకు రీకాల్ చేయబడ్డాడు.[2] తిరిమన్నె 2014 ఐసీసీ వరల్డ్ ట్వంటీ20, 2014 ఆసియా కప్ గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడిగా, అతను ఆసియా టోర్నమెంట్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

2023 జూలై 22న తిరిమన్నె అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఆస్ట్రేలియాకు వలస వెళ్ళాడు.[3]

స్కూల్ కెరీర్[మార్చు]

బండారవేలలోని ఎస్. థామస్ కళాశాలలో తన క్రికెట్ జీవితాన్ని ప్రారంభించాడు. అండర్ 11 క్రికెట్ ఆడాడు. ఇతని మొదటి కోచ్ సుజీవ గుణరత్నే. సర్వే డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న తండ్రికి బదిలీ కావడంతో మొదట్లో ఎస్.థామస్ కాలేజ్ బండరావెల్లో చదివాడు. గ్రేడ్ 5 స్కాలర్‌షిప్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత లాహిరు, మొరటువాలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కళాశాలలో చేరాడు. అండర్ 13, 15, 17, 19 జట్టులో ఆడాడు.

దేశీయ క్రికెట్[మార్చు]

2018 మార్చిలో 2017–18 సూపర్ ఫోర్ ప్రావిన్షియల్ టోర్నమెంట్ కోసం కొలంబో జట్టులో ఎంపికయ్యాడు.[4][5] మూడు మ్యాచ్‌లలో 198 పరుగులతో టోర్నమెంట్ సమయంలో కొలంబో తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.[6]

తరువాతి నెలలో 2018 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్ కోసం కొలంబో జట్టులో కూడా ఎంపికయ్యాడు.[7] 2018 ఆగస్టులో 2018 ఎస్ఎల్సీ టీ20 లీగ్‌లో కాండీ జట్టులో ఎంపికయ్యాడు.[8] 2019 మార్చిలో 2019 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్ కోసం గాల్లె జట్టులో ఎంపికయ్యాడు.[9] 2021 ఆగస్టులో 2021/22 సీజన్‌కు ముందు ఆస్ట్రేలియా యొక్క మల్గ్రేవ్ క్రికెట్ క్లబ్ ద్వారా సైన్ అప్ చేసాడు.[10]

అంతర్జాతీయ క్రికెట్[మార్చు]

2010 ప్రారంభంలో తన వన్డే ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసాడు.[11] 2011 జూన్ లో రోజ్ బౌల్‌లో ఇంగ్లాండ్‌తో తన అరంగేట్రం చేసాడు,[12] గాయపడిన తిలకరత్నే దిల్షాన్ జట్టులోకి వచ్చాడు. [13] ఇతని మొదటి టెస్ట్ ఇన్నింగ్స్‌లో, 10 పరుగుల వద్ద జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో క్యాచ్‌తో ఔటయ్యాడు.[14]

2019 ఏప్రిల్ లో 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం శ్రీలంక జట్టులో ఎంపికయ్యాడు.[15][16] 2019 జూన్ 4న, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన శ్రీలంక మ్యాచ్‌లో, తిరిమన్నె వన్డే క్రికెట్‌లో తన 3,000వ పరుగును సాధించాడు.[17]

కెప్టెన్సీ[మార్చు]

ఇంచియాన్‌లో జరిగిన 2014 ఆసియా క్రీడల క్రికెట్ జట్టుకు తిరిమన్నె కెప్టెన్‌గా ఉన్నాడు, ఇక్కడ శ్రీలంక ఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది.

2015 జనవరి 23న న్యూజిలాండ్‌తో జరిగిన ఐదవ వన్డే సమయంలో, కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ స్వల్పంగా గాయపడటంతో ఇతను శ్రీలంకకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 108 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో 2 వికెట్లు కూడా తీసి, ఓపెనర్‌గా 45 పరుగులు కూడా చేశాడు.[18] సిరీస్‌లోని 6వ, 7వ వన్డేలకు కూడా నాయకత్వం వహించాడు. 6వ వన్డే భారీ ఓటమితో ముగిసింది, 7వ వన్డే ఇతని కెప్టెన్సీలో సునాయాసంగా గెలిచింది. అయితే, చివరకు శ్రీలంక 4-2తో సిరీస్‌ను కోల్పోయింది.

2019లో వన్డే, టీ20 కెప్టెన్‌తోసహా పదిమంది శ్రీలంక ఆటగాళ్ళు భద్రతాపరమైన ఆందోళనలను పేర్కొంటూ పాకిస్తాన్ పర్యటన నుండి వైదొలిగారు. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌కు తిరిమన్నెను వన్డే కెప్టెన్‌గా ప్రకటించారు.[19] సిరీస్‌లో భాగంగా తొలి వన్డే భారీ వర్షం కారణంగా రద్దైంది. శ్రీలంక తర్వాతి రెండు మ్యాచ్ లను కోల్పోయింది. వన్డే సిరీస్‌ను 2-0తో కోల్పోయింది.[20]

మూలాలు[మార్చు]

 1. "Lahiru Thirimanne's Wedding – Gossip Lanka News". Archived from the original on 7 August 2016. Retrieved 2023-08-26.
 2. Balasuriya, Madushka (30 November 2018). "Hope to give confidence to Thirimanne, Samarawickrama - SLC selector". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-26.
 3. "Lahiru Thirimanne has announced his retirement from international cricket". NewsWire. 2023-07-22. Retrieved 2023-08-26.
 4. "Cricket: Mixed opinions on Provincial tournament". Sunday Times (Sri Lanka). 26 March 2018. Retrieved 2023-08-26.
 5. "All you need to know about the SL Super Provincial Tournament". Daily Sports. 26 March 2018. Archived from the original on 27 March 2018. Retrieved 2023-08-26.
 6. "Sri Lanka Super Four Provincial Tournament, 2017/18, Colombo: Batting and bowling averages". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-26.
 7. Weerasinghe, Damith (27 April 2018). "SLC Super Provincial 50 over tournament squads and fixtures". The Papare. Retrieved 2023-08-26.
 8. Weerasinghe, Damith (16 August 2018). "SLC T20 League 2018 squads finalized". The Papare. Retrieved 2023-08-26.
 9. Weerasinghe, Damith. "Squads, Fixtures announced for SLC Provincial 50 Overs Tournament". The Papare. Retrieved 2023-08-26.
 10. "Lahiru Thirimanne joins Sri Lankan legends in Australia". NewsWire. 18 August 2021. Retrieved 2023-08-26.
 11. "Lahiru Thirimanne to debut today against India". ColomboPage. 5 January 2010. Archived from the original on 9 January 2010. Retrieved 2023-08-26.
 12. Sheringham, Sam (16 June 2011). "England put Sri Lanka under pressure at the Rose Bowl". BBC Sport. BBC. Retrieved 2023-08-26.
 13. McGlashan, Andrew (15 June 2011). "Hosts aim to expose Sri Lanka's problems". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-26.
 14. "Anderson removes Thirimanne before lunch". The Hindu. Rose Bowl, Southampton. Associated Press. 16 June 2011. Retrieved 2023-08-26.
 15. Fernando, Andrew Fidel (18 April 2019). "Thirimanne, Siriwardana, Vandersay picked in World Cup squad". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-26.
 16. "Jeevan Mendis, Siriwardana, Vandersay make comebacks in Sri Lanka World Cup squad". International Cricket Council. 18 April 2019. Retrieved 2023-08-26.
 17. "Lahiru Thirimanne achieves special feat during Afghanistan vs Sri Lanka World Cup fixture". DNA India news. 20 June 2019. Retrieved 2023-08-26.
 18. "5th ODI: New Zealand v Sri Lanka at Dunedin, Jan 23, 2015 – Cricket Scorecard". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-26.
 19. "Thirimanne, Shanaka to lead Sri Lanka in Pakistan". ESPNcricinfo. ESPN Inc. 11 September 2019. Retrieved 2023-08-26.
 20. Fernando, Andrew Fidel (2 October 2019). "Abid Ali, Fakhar Zaman, Haris Sohail star as Pakistan seal series". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-26.

బాహ్య లింకులు[మార్చు]