లిలియేసి
స్వరూపం
లిలియేసి | |
---|---|
Lilium martagon | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | లిలియేసి
|
ప్రజాతులు | |
Calochortus |
లిలియేసి (లాటిన్ Liliaceae) కుటుంబంలో 254 ప్రజాతులు, 4075 జాతుల మొక్కలు ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నప్పటికీ ఎక్కువగా ఉష్ణమండలలో పెరుగుతాయి.
సామాన్య లక్షణాలు
[మార్చు]- ఎక్కువగా బహువార్షిక గుల్మాలు, కొన్ని పొదలు, వృక్షాలు, ఎగబ్రాకే మొక్కలు.
- అబ్బురపు వేళ్ళుంటాయి. ఆస్పరాగస్ లో దుంపవేళ్ళు గుత్తులుగా ఉంటాయి.
- కాండం అనేక జాతులలో బహువార్షిక భూగర్భ కాండం. అది లశునంగాగాని, కొమ్ముగాగాని లేదా కందంగాగాని ఉండవచ్చు. కొన్నిటిలో లశునం కంచుకయుతంగాను (ఉల్లి), కొన్నిటిలో కంచుకరహితంగాను (లిల్లీ) ఉంటుంది. గ్లోరియోసాలో నులితీగెలతో ఎగబాకే బలహీన కాండం ఉంటుంది. ఆస్పరాగస్ లో కాండం శాఖలు క్లాడోఫిల్ లుగా రూపాంతరం చెందుతాయి. లిలియమ్ బల్బిఫెరమ్ పత్రగ్రీవాల నుంచి ఏర్పడే లఘులశునాల ద్వారాగాని, అలోలో ఏర్పడే పిలకమొక్కలద్వారాగాని శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది.
- పత్రం మూలసంబంధంగఅని (ఉల్లి), ప్రకాండసంబంధంగాగాని (గ్లోరియోసా) ఉంటాయి. పత్రవిన్యాసం సాధారణంగా ఏకాంతరంగాను, ట్రిల్లియమ్ లో చక్రీయంగాను ఉంటుంది. పత్రాలు వృంతయుతం, సరళపత్రాలు, సమాంతర ఈనెలవ్యాపనం.
ముఖ్యమైన మొక్కలు
[మార్చు]- లిల్లీ (లిలియమ్ కాండిడమ్)
- తులిప్ (తులిపా)
- నాగార్జున ఉల్లిగడ్డ (అర్జీనియా నాగార్జునే / Urginea Nagarjune).
ఆర్ధిక ప్రాముఖ్యం
[మార్చు]- ఉల్లి లశునాలను వంటల్లో వాడతారు.
- వెల్లుల్లి వంటలలో సుగంధ ద్రవ్యంగా వాడతారు.
- గ్లోరియోసా, సిల్లా నుంచి విలువైన మందులు లభిస్తాయి.
- గ్లోరియోసా, లిలియమ్, డ్రసీరా జాతులను అలంకరణ మొక్కలుగా పెంచుతారు.
- తులిపా పువ్వులను విస్తారంగా పండిస్తారు.
మూలాలు
[మార్చు]- బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.