Jump to content

లీనా తివారీ

వికీపీడియా నుండి

లీనా గాంధీ తివారీ భారతీయ వ్యాపారవేత్త, రచయిత్రి. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న బహుళజాతి ఔషధ, జీవసాంకేతిక విజ్ఞానం సంస్థ యుఎస్వి ప్రైవేట్ లిమిటెడ్ (USV Private Limited) చైర్‌పర్సన్గా ఉన్నారు. [1] 1961లో యుఎస్విని ఆమె తాత విఠల్ బాలకృష్ణ గాంధీగారు స్థాపించారు. [2] ₹ 30,000 కోట్ల (US$ 3.2 billion) పైగా నికర సంపదతో అత్యంత ధనవంతులైన భారతీయుల్లో ఒకరైన ఆమె ఫోర్బ్స్ మ్యాగజైన్ జాబితాలో తరచూ చోటు దక్కించుకున్నారు. [3] [4] ఈ సంస్థ మధుమేహం, రక్త ప్రసరణ వ్యవస్థ సంబదిత ఔషధాలతో పాటు బయోసిమిలర్ మందులు, ఇంజెక్షన్లు, క్రియాశీల ఔషధ పదార్ధాలలో ప్రత్యేకత కలిగి ఉన్నది. [5]

ముంబయి విశ్వవిద్యాలయం నుండి బి. కామ్., బోస్టన్ విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ పూర్తి చేశింది. [4] యుఎస్వి సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అయిన ప్రశాంత్ తివారీను వివాహం చేసుకుంది. ఆమె మానవీయ పనులలో కూడా పాల్గొంటుంది. ఆమె డాక్టర్ సుశీలా గాంధీ సెంటర్ ఫర్ సోషల్ డెవలప్ మెంట్ (Dr Sushila Gandhi Centre for Social Development) స్థాపకురాలు. [1] ఇది మహారాష్ట్రలోని వాకోలా మహిళలకు, బాలికలకు విద్యా బోధన, నృత్యం, కంప్యూటరులు ద్వారా మార్గనిర్దేశం వహిస్తుంది. [6] ఆమె తాత విఠల్ గాంధీపై బియాండ్ పైప్స్ అండ్ డ్రీమ్స్ (Beyond Pipes and Dreams) అనే జీవితచరిత్ర పుస్తకం రచించింది. [7]

2022 ఎడెల్గివ్ హురున్ ఇండియా ఫిలంట్రి జాబితాలో (EdelGive Hurun India Philanthropy List) ₹ 21 కోట్ల విరాళంతో ఆమె భారతదేశంలోని అత్యంత ఉదార మహిళలలో # 2 స్థానంలో, పూర్తి జాబితాలో # 40 స్థానంలో నిలిచింది. [8] [9]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Meet India's most generous women". Business Insider (in ఇంగ్లీష్). Retrieved 2024-02-10.
  2. "Forbes 2015: Only 4 women among India's 100 richest". India Today (in ఇంగ్లీష్). Retrieved 2024-02-10.
  3. "Only four women in Forbes 100 richest Indians list". Hindustan Times (in ఇంగ్లీష్). 2015-09-24. Retrieved 2024-02-10.
  4. 4.0 4.1 "Meet Leena Tewari, 5th richest woman in India with Rs 30,000 crore net worth, know her business". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2024-02-10.
  5. "USV partners with Biogenomics to launch biosimilar insulin aspart for diabetes in India". Financialexpress (in ఇంగ్లీష్). 2023-11-09. Retrieved 2024-02-10.
  6. "A tale of good tidings". Tribuneindia News Service (in ఇంగ్లీష్). 2021-12-31. Retrieved 2024-02-10.
  7. "Meet India's most generous women in 2022". mint (in ఇంగ్లీష్). 2022-10-20. Retrieved 2024-02-10.
  8. "Shiv Nadar tops the EdelGive Hurun India Philanthropy List, donated Rs 3 crore per day". Business Today (in ఇంగ్లీష్). 2022-10-20. Retrieved 2024-02-11.
  9. "Hurun India Philanthropy List 2022". Hurun Report (in ఇంగ్లీష్). 2022-10-20. Retrieved 2024-02-11.