లీయాన్ ఫోకాల్ట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లీయాన్ ఫూకోవ్
లీయాన్ ఫూకోవ్ (1819-1868)
జననంసెప్టెంబరు 18, 1819
పారిస్, ఫ్రాన్స్
మరణం1868 ఫిబ్రవరి 11(1868-02-11) (వయసు 48)
పారిస్, ఫ్రాన్స్
నివాసంఫ్రాన్స్
జాతీయతఫ్రెంచి
రంగములుభౌతికశాస్త్రం
వృత్తిసంస్థలుపారిస్ అబ్జర్వేటరీ
ప్రసిద్ధిఫోకాల్ట్ లోలకం

జీన్ బెర్నార్డ్ లీయాన్ ఫూకోవ్ (ఆంగ్లం :Jean Bernard Léంn Foucault) (సెప్టెంబరు 18 1819ఫిబ్రవరి 11 1868) ప్రాన్స్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఈయన ఫూకోవ్ లోలకం తయరుచేసి ప్రసిద్ధుడైనాడు. ఈ పరికరంలో భూభ్రమణం యొక్క ఫలితాలను వివరించవచ్చు. ఈయన కాంతి వేగాన్ని గణించి సరైన విలువను కనుగొన్నాడు. ఈయన ఎడ్డీ కరంటు, గైరోస్కోప్ ఆవిష్కర్త.

ప్రారంభ సంవత్సరాలు[మార్చు]

ఫూకోవ్ పారిస్ కు చెందిన ఒక ప్రచురణకర్త కుమారుడు. ఈయన సెప్టెంబరు 18, 1819న పారిస్‌లో జన్మించాడు. ఈయన ప్రాథమిక విద్యభ్యాసమంతా ఇంట్లోనే సాగింది. ఆ తరువాత వైద్యశాస్త్రం చదవటం ప్రారంభించాడు కానీ రక్తంపై ఉన్న భయం (రక్తభీతి) తో మధ్యలోనే మానేసి భౌతికశాస్త్రం అభ్యసించాడు.[1] ఈయన తొలుత తన దృష్టిని లూయీ డగర్రే యొక్క ఛాయాచిత్రగ్రహణ పద్ధతిని అభివృద్ధి చేసేందుకు దృష్టి సారించాడు. మూడేళ్ళు ఆల్ఫ్రెడ్ డొనే (1801–1878) కు పరిశోధనా సహాయకుడిగా పనిచేశాడు. ఆ కాలంలో డొనే సూక్షదర్శక స్వరూపశాస్త్రం పై ఉపన్యాసాలు ఇచ్చాడు.

హిప్పోలైట్ ఫీజోతో కలిసి కొన్ని పరిశోధనలు చేశాడు. ఈ పరిశోధనల్లో భాగంగా సూర్యకాంతి యొక్క తీవ్రతను కార్బన్ ఆర్క్‌లాంప్ లో కార్బన్ కాంతి యొక్క తీవ్రత, ఆక్సీ-హైడ్రోజన్ బ్లోపైపులో కాల్సియం ఆక్సైడ్ కాంతి యొక్క తీవ్రతతో పోల్చి చూశాడు; పరారుణ వికిరణం యొక్క వ్యతికిరణంపైన, వివిధ కాంతిరేఖల యొక్క కాంతిపథాలలో చాలా వైవిధ్యం ఉండటంపైన, వర్ణ కాంతి ధృవనం పైన వీటి ప్రభావాన్ని పోల్చిచూశాడు.

మధ్యకాలము[మార్చు]

1850లో, ఫూకోవ్ ఫీజో–ఫూకోవ్ పరికరంను ఉపయోగించి కాంతి వేగాన్ని కొలిచేందుకు ఒక ప్రయోగం చేశాడు. ఇది తర్వాత కాలంలో ఫూకోవ్-ఫీజో ప్రయోగంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రయోగం కాంతి నీటిలో, గాలిలోకన్నా మెల్లగా ప్రయాణిస్తుందని నిరూపించి న్యూటన్ యొక్క కాంతి కణ సిద్ధాంతాన్ని పూర్తిగా సమాధిచేసేందుకు దోహదపడిందని భావిస్తారు[2]

1851లో, భూమి తన అక్షంపై తనచుట్టూ తాను తిరిగే పరిభ్రమణాన్ని ప్రయోగాత్మకంగా ప్రదర్శించాడు. ఈ ప్రయోగపు పద్ధతిని 1661లోనే విన్సెంజో వివియానీ ఉపయోగించాడు, కానీ ఇది ఫోకాల్ట్ పరిశోధనల ద్వారానే ప్రాచ్యుర్యం పొందింది. ఫోకాల్ట్ ఈ ప్రయోగ ప్రదర్శనకోసం పారిస్లోని పాంథియాన్ యొక్క పైకప్పు నుండి ఒక బరువైన లోలకాన్ని పొడవైన తాడు వేలాడదీసి, దాని డోలావర్తన సమతలం చుట్టూ తిరగటం ద్వారా భూమి యొక్క పరిభ్రమణాన్ని నిరూపించాడు. ఈ ప్రయోగం పండితలోకంలోనూ, సాధారణ ప్రజల్లోనూ కలకలం రేపింది. తత్ఫలితంగా ఐరోపా, అమెరికాలోని ప్రముఖ నగరాలన్నింటిలోనూ ఫోకాల్ట్ లోలకాలని వేలాడదీసి ప్రదర్శించారు. ఈ ప్రదర్శలకు పెద్ద ఎత్తున జనం వచ్చారు. ఆ తరువాత సంవత్సం ఇదే విషయాన్ని మరింత సులువుగా నిరూపించడానికి గైరోస్కోప్ అనే పరికరాన్ని తయారుచేశాడు. 1855లో, అత్యద్భుతమైన ప్రయోగ పరిశోధనలకుగాను రాయల్ సొసైటీ యొక్క కోప్లీ మెడల్ అందుకున్నాడు. అదే సంవత్సంలో దీనికి కొంతకాలం ముందు పారిస్ యొక్క ఇంపీరియల్ అబ్సర్వేటరీలో భౌతికశాస్త్రజ్ఞునిగా నియమించబడ్డాడు.

ఫూకోవ్ 1855 సెప్టెంబరులో, రాగి డిస్కును దాని రిమ్‌ను రెండు అయస్కాంత ధృవాల మధ్యన ఉంచి గుండ్రగా త్రిప్పితే, దాన్ని త్రిప్పటానికి కావలసిన బలం హెచ్చుతుందని, అదే సమయంలో లోహంలో జనించిన ఎడ్డీ కరెంటు లేదా ఫోకాల్ట్ కరెంటు వల్ల డిస్కు వేడెక్కుతుందని కనుగొన్నాడు.

ఫూకోవ్ కాంతి వేగాన్ని నిరూపించటానికి చేసిన ప్రయోగం యొక్క మరో రూపక చిత్రము, ఇక్కడ కాంతి మూలాలుగా ఆధునిక లేసర్లను ఉపయోగించారు.

1857 లో, తనపేరుతో ప్రసిద్ధిచెందిన కాంతి తలీకరణ యంత్రాన్ని (పోలరైజర్) ను కనుగొన్నాడు.[3] ఆ మరు సంవత్సరం పరావర్తన దూరదర్శని యొక్క దర్పణపు ఆకారాన్ని నిర్ధారించేందుకు ఒక పద్ధతిని రూపొందించాడు.[4][5] "ఫోకాల్ట్ కత్తి అంచు పరీక్ష" అనబడే ఈ పరీక్ష, దర్పణపు ఆకృతి (ఫిగరింగ్) తీర్చిదిద్దే పనివారికి దర్పణం పరిపూర్ణంగా గోళాకారంలో ఉందా లేక గోళాకారంలో ఏవైనా విచలనాలు ఉన్నాయా అన్న విషయాన్ని పరీక్షించుటకు ఉపయోగపడుతుంది. ఫోకాల్ట్ తన పరిశోధనలు ప్రచురించే ముందు పరావర్తన దూరదర్శిని యొక్క దర్పణాలను పరీక్షించే పద్ధతి "గుడ్డివేటు గువ్వను తగిలిన" చందంగా ఉండేది.

ఫూకోవ్ కత్తి అంచు పరీక్ష దర్పణ నాభ్యాంతరాలు వాటి వైశాల్యముల ద్వారా కనుగొని దర్పణ ఆకారాన్ని నిర్థారిస్తుంది. ఇది సాధారణంగా దర్పణ కేంద్రకం నుండి ప్రాంతం యొక్క కొలతగా పిలువబడుతుంది. ఈ పరీక్ష దర్పణం యొక్క వక్రతలం యొక్క కేంద్రం (వక్రతా కేంద్రం) వద్ద కాంతి బిందు జనకాన్ని కేంద్రీకరుస్తుంది, కత్తి అంచు నుండి పరావర్తనం చెందిస్తుంది. ఈ పరీక్ష దర్పణం యొక్క శాంఖవ భాగాన్ని కొలుచుటను సాధ్యం చేస్తుంది. ఈ పరీక్ష దర్పణ వాస్తవ ఆకృతిని ధృవీకరించుటలో ఉపయోగపడుతుంది. దర్పణం యొక్క ఆకృతి, ఆ దర్పణం పొందుపరచబడిన టెలిస్కోపు, మైక్రోస్కోపు వంటి దృశ వ్యవస్థలు సరిగా పనిచేసేందుకు చాలా ముఖ్యమైన అంశం. ఈ ఫోకాల్ట్ పరీక్ష చాలా సులభమైనది, చవకగా దొరికే, సులభంగా తయారుచేయగలిగే పరికరాలని ఉపయోగిస్తుంది కాబట్టి, నేటికీ ఈ పరీక్షను దూరదర్శినులు తయారు చేసే చిన్న వ్యాపారులు, ఔత్సాహికులు ఉపయోగిస్తున్నారు.

చార్లెస్ వీట్‌స్టోన్ యొక్క భ్రమణ దర్పణాన్ని ఉపయోగించి ఫోకాల్ట్ 1862లో కాంతి యొక్క వేగాన్ని 298,000 కి.మీ.లు/సెకండుగా నిర్ధారించాడు (దాదాపు 185,000 మైళ్ళు/సెకను) — ఈ అంచనా అంతకుమునుపు జరిపిన పరిశోధనల ద్వారా అంచనా వేసిన వేగం కంటే 10,000 కి.మీ/సె తక్కువ, ప్రస్తుతం విరివిగా అంగీకరించబడిన కాంతివేగం కంటే ఈ నిర్ధారణలో కేవలం 0.6% వ్యత్యాసం మాత్రమే ఉంది.

ఆఖరి సంవత్సరాలు[మార్చు]

1862లోఫూకోవ్బ్యూరో దెస్ లాంగిట్యూడెస్ యొక్క సభ్యునిగా నియమించబడ్డాడు. అదే సంవత్సరం లీజన్ ఆఫ్ హానర్ అధికారి అయ్యాడు. 1864లో రాయల్ సొసైటీ అఫ్ లండన్ యొక్క సభ్యుడయ్యాడు. సంవత్సరం తర్వాత ఆ సంస్థ యొక్క యాంత్రిక విభాగంలో సభ్యుడయ్యాడు. 1865లో జేమ్స్ వాట్ట్ యొక్క గవర్నరు (వేగ నియంత్రణా యంత్రం) పై జరిపిన మార్పులుపై తన శాస్త్రీయవ్యాసాలు ప్రచురించాడు. తను అప్పటికి కొంతకాలంగా దాని పరిభ్రమణ కాలాన్ని స్థిరబద్ధీకరించేందుకు, విద్యుత్ కాంతిని నియంత్రించేందుందుకు ఒక నూతన పరికరాన్ని అభివృద్ధిపరచేందుకు పరిశోధనలను చేస్తున్నాడు. ఫోకాల్ట్ దూరదర్శిని యొక్క ఆబ్జెక్టివ్ దర్పణం యొక్క బయటి తలంపై పారదర్శకమైన సన్నని వెండిపూత పూయటం వలన కళ్ళకు హాని కలుగకుండా నేరుగా సూర్యున్ని వీక్షించవచ్చని ప్రదర్శించి చూపాడు. ఈయన ప్రధాన శాస్త్రీయ పరిశోధనాపత్రాలన్నీ 1847 నుండి 1869 వరకు కాంప్టెస్ రెండస్ ( Comptes Rendus) లో ప్రచురితమయ్యాయి. మరణించే కొంతకాలానికి ముందు, ఇదివరకు తృణీకరించిన రోమన్ కాథలిక్ మతాన్ని తిరిగి అవలంబించాడు.[6]

మరణం, తర్వాత కాలం[మార్చు]

మాంట్‌మార్తే శ్మశానవాటికలో జాన్ బెర్నార్డ్ లియాన్ ఫోకాల్ట్ యొక్క సమాధి

ఫూకోవ్ బహుశా త్వరితగతిన వ్యాపించిన మల్టిపుల్ స్క్లీరోసిస్ వళ్ల, ఫిబ్రవరి 11, 1868లో పారిస్లో మరణించాడు.[7] ఈయన్ను మాంట్‌మార్తే శ్మశానవాటికలో సమాధిచేశారు.

గ్రహశకలం 5668 ఫూకోవ్కు ఈయన పేరుపెట్టారు.[8] ఐఫిల్ టవరుపై చెక్కబడిన 72 వ్యక్తుల పేర్లలో ఫూకోవ్ పేరు కూడా ఒకటి.

2013, సెప్టెంబరు 18వ తేదీన గూగుల్ ముఖపత్రంపై ఫూకోవ్ యొక్క 194వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ స్మృత్యర్ధం ఒక డూడుల్ ను ఆవిష్కరించింది.[9]

గ్రంథములు[మార్చు]

Collected Works:

మూలాలు[మార్చు]

  1. Public Domain Herbermann, Charles, ed. (1913). "Jean-Bertrand-Léon Foucault". Catholic Encyclopedia. New York: Robert Appleton Company.
  2. David Cassidy; Gerald Holton; James Rutherford (2002). Understanding Physics. Birkhäuser. ISBN 0-387-98756-8.
  3. Léon Foucault (August 17, 1857) "Nouveau polariseur en spath d'Island. Expérience de fluorescence" (New polarizer made of Icelandic spar. Fluorescence experiment.), Comptes rendus, vol. 45, pages 238-241. English translation: Léon Foucault (1857) "On a new polarizer of Iceland spar. Experiment on fluorescence.," The London, Edinburgh and Dublin Philosophical Magazine and Journal of Science, series 4, vol. 14, pages 552 - 555.
  4. L. Foucault (1858) "Description des procedes employes pour reconnaitre la configuration des surfaces optiques" (Description of the methods used to recognize the configuration of optical surfaces), Comptes rendus ... , vol. 47, pages 958-959.
  5. L. Foucault (1859) "Mémoire sur la construction des télescopes en verre argenté" (Memoir on the construction of reflecting telescopes), Annales de l'Observatoire impériale de Paris, vol. 5, pages 197-237.
  6. William Tobin (2003). The Life and Science of Léon Foucault: The Man Who Proved the Earth Rotates. Cambridge University Press. p. 272. ISBN 9780521808552.
  7. W. Tobin, The Life and Science of Léon Foucault, Cambridge University Press (2003).
  8. Schmadel, Lutz D.; International Astronomical Union (2003). Dictionary of minor planet names. Berlin; New York: Springer-Verlag. p. 480. ISBN 978-3-540-00238-3. Retrieved 9 September 2011.
  9. "Léon Foucault's 194th Birthday". Google.com. Retrieved 2013-09-18.

తర్వాత చదవవలసినవి[మార్చు]

  • Amir D. Aczel, Pendulum: Léon Foucault and the Triumph of Science, Washington Square Press, 2003, ISBN 0-7434-6478-8
  • Umberto Eco, Foucault's Pendulum (trans. William Weaver). Secker & Warburg, 1989.
  • William Tobin, Perfecting the Modern Reflector. Sky & Telescope, October 1987.
  • William Tobin, Léon Foucault. Scientific American, July 1998.
  • William Tobin, The Life and Science of Léon Foucault: The Man who Proved the Earth Rotates. Cambridge University Press, 2003. ISBN 0-521-80855-3

యితర లింకులు[మార్చు]