లుంగీ ఎన్‌గిడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లుంగీ ఎన్‌గిడి
2022 డిసెంబరులో దక్షిణాఫ్రిక తరఫున బౌలింగు చేస్తున్న ఎంగిడి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లుంగిసానీ ట్రూ-మ్యాన్ ఎంగిడి
పుట్టిన తేదీ (1996-03-29) 1996 మార్చి 29 (వయసు 28)
డర్బన్, క్వాజులు-నేటల్, దక్షిణాఫ్రికా
ఎత్తు6 ft 4 in (193 cm)[1]
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 334)2018 జనవరి 13 - ఇండియా తో
చివరి టెస్టు2022 డిసెంబరు 26 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 126)2018 ఫిబ్రవరి 7 - ఇండియా తో
చివరి వన్‌డే2023 ఏప్రిల్ 2 - నెదర్లాండ్స్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.22
తొలి T20I (క్యాప్ 67)2017 జనవరి 20 - శ్రీలంక తో
చివరి T20I2023 సెప్టెంబరు 1 - ఆస్ట్రేలియా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.22
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2015–ప్రస్తుత<నార్దర్స్న్ క్రికెట్ జట్టు|
2016–2021టైటన్స్ క్రికెట్ జట్టు
2018–2021చెన్నై సూపర్ కింగ్స్
2022–ప్రస్తుతంఢిల్లీ క్యాపిటల్స్
2023పార్ల్ రాయల్స్
2023-presentశాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I FC
మ్యాచ్‌లు 17 44 36 31
చేసిన పరుగులు 89 79 16 142
బ్యాటింగు సగటు 4.94 15.80 3.20 5.68
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 19 19* 4* 19
వేసిన బంతులు 2,315 2,082 714 4,062
వికెట్లు 51 72 58 90
బౌలింగు సగటు 23.37 27.83 18.29 24.08
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 3 1 1 6
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 6/39 6/58 5/39 6/37
క్యాచ్‌లు/స్టంపింగులు 7/– 11/– 8/– 12/–
మూలం: ESPNcricinfo, 1 May 2023

లుంగిసానీ ట్రూ-మ్యాన్ ఎన్‌గిడి (జననం 1996 మార్చి 29) దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టు కోసం ఆడుతున్న ప్రొఫెషనల్ క్రికెటరు. [2] 2018 దక్షిణాఫ్రికా క్రికెట్ వార్షిక అవార్డులలో, అతను ఐదుగురు క్రికెటర్లలో ఒకరిగా ఎంపికయ్యాడు. [3] [4] 2020 జూలైలో, క్రికెట్ దక్షిణాఫ్రికా వార్షిక అవార్డుల వేడుకలో ఎన్‌గిడి వన్‌డేలకు, T20I లకూ కూడా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. [5]

జీవితం తొలి దశలో[మార్చు]

ఎన్‌గిడి డర్బన్‌లోని క్లోఫ్‌లో పెరిగాడు. హైబరీ ప్రిపరేటరీ స్కూల్‌లో చేరేందుకు స్కాలర్‌షిప్ పొందారు. ఎన్‌గిడి తల్లి ఇంట్లో పనిమనిషిగా, తండ్రి స్థానిక పాఠశాలలో మెయింటెనెన్స్ వర్కరుగా పనిచేసేవారు. హిల్టన్ కాలేజీ స్కూల్‌లో చేరేందుకు ఎన్‌గిడి స్కాలర్‌షిప్ పొందాడు. హిల్టన్‌లో అతని మొదటి మూడు సంవత్సరాలలో, ఎన్‌గిడి క్రికెట్‌పై దృష్టి పెట్టడానికి ముందు హిల్టన్‌ రగ్బీ జట్టులో ఆడాడు. హిల్టన్‌లో ఉన్నప్పుడు, జింబాబ్వే మాజీ ఆల్-రౌండర్ నీల్ జాన్సన్ వద్ద ఎన్‌గిడి శిక్షణ పొందాడు. [6] [7]

హిల్టన్ నుండి పట్టభద్రుడయ్యాక ఎన్‌గిడి, ప్రిటోరియా విశ్వవిద్యాలయంలో ఇండస్ట్రియల్ సోషియాలజీలో బ్యాచిలర్ ఆఫ్ సోషల్ సైన్సెస్ డిగ్రీలో చేరాడు. [8]

దేశీయ, T20 ఫ్రాంచైజీ కెరీర్[మార్చు]

ఎన్‌గిడి 2015 ఆఫ్రికా T20 కప్ కోసం నార్తర్న్స్ క్రికెట్ జట్టులో చేరాడు.[9] 2016 జూలైలో క్రికెట్ సౌత్ ఆఫ్రికా అతన్ని ఆఫ్రికా T20 కప్ ప్లేయర్ ఆఫ్ ఇయర్‌గా పేర్కొంది. [10] 2017 ఆగస్టులో, అతను T20 గ్లోబల్ లీగ్‌ మొదటి సీజన్ కోసం బెనోని జల్మీ జట్టులో ఎంపికయ్యాడు. [11] అయితే, 2017 అక్టోబరులో క్రికెట్ దక్షిణాఫ్రికా, మొదట్లో టోర్నమెంట్‌ను 2018 నవంబరుకు వాయిదా వేసి, ఆ తర్వాత వెంటనే రద్దు చేసింది. [12]

2018 జనవరిలో, 2018 IPL వేలంలో ఎన్‌గిడిని చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. [13] 2018 అక్టోబరులో, అతను ఎంజాన్సీ సూపర్ లీగ్ T20 టోర్నమెంటు మొదటి ఎడిషన్ కోసం ష్వానే స్పార్టాన్స్ జట్టులో ఎంపికయ్యాడు. [14] [15] 2019 మార్చిలో, 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌కు ముందు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) వారి గమనించాల్సిన ఎనిమిది మంది ఆటగాళ్ళలో ఒకరిగా అతన్ని పేర్కొంది.[16]


2019 సెప్టెంబరులో, 2019 మజాన్సీ సూపర్ లీగ్ టోర్నమెంటు కోసం ష్వానే స్పార్టాన్స్ జట్టులో ఎన్‌గిడి ఎంపికయ్యాడు. [17] 2021 ఏప్రిల్లో, అతను దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు నార్తర్న్స్ స్క్వాడ్‌లో ఎంపికయ్యాడు.[18]

2022 ఫిబ్రవరిలో, 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు వేలంలో ఎన్‌గిడిని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. [19]

2023 మేలో, మేజర్ లీగ్ క్రికెట్ (MLC) టీమ్ శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ ప్రారంభ సీజన్ కోసం ఎన్‌గిడి సంతకం చేస్తున్నట్లు ప్రకటించింది. [20]

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

2017 జనవరిలో శ్రీలంకతో జరిగిన సిరీస్ కోసం దక్షిణాఫ్రికా ట్వంటీ20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో ఎన్‌గిడిని తీసుకున్నారు. [21] అతను 2017 జనవరి 20 [22] న శ్రీలంకపై దక్షిణాఫ్రికా తరపున తన తొలి T20I ఆడి, అందులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. [23] T20I సిరీస్ సమయంలో, శ్రీలంకతో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) మ్యాచ్‌ల కోసం దక్షిణాఫ్రికా జట్టుకు ఎన్‌గిడి ఎంపికయ్యాడు. [24] అయితే, పొత్తికడుపు గాయం కారణంగా అతను వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. [25]

2018 జనవరిలో, భారత్‌తో రెండో టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో ఎన్‌గిడిని చేర్చారు. [26] అతను 2018 జనవరి 13న భారత్‌పై దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో అడుగుపెట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో 6/39తో సహా మ్యాచ్‌లో 7/87 సాధించాడు. దక్షిణాఫ్రికా 135 పరుగుల తేడాతో గెలిచింది. [27] అదే నెలలో, అతను భారత్‌తో జరిగే సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) జట్టులో ఎంపికయ్యాడు.[28] అతను 2018 ఫిబ్రవరి 7న భారతదేశంపై తన వన్‌డే రంగ ప్రవేశం చేసాడు.[29]

2018 మార్చిలో, క్రికెట్ దక్షిణాఫ్రికా 2018–19 సీజన్‌కు ముందు ఎన్‌గిడికి జాతీయ కాంట్రాక్టు ఇచ్చింది.[30] 2019 ఏప్రిల్లో, అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టుకు ఎంపికయ్యాడు. [31] [32] 2020 మార్చి 4న, ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ వన్‌డేలో, ఎన్‌గిడి వన్‌డే క్రికెట్‌లో తన మొదటి ఐదు వికెట్ల ప్రదర్శనను సాధించాడు. [33] అదే మ్యాచ్‌లో, తన 26వ గేమ్‌లో వన్డేల్లో 50 వికెట్లు తీసి మ్యాచ్‌ల పరంగా దక్షిణాఫ్రికా తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బౌలరయ్యాడు. [34]

2021 సెప్టెంబరులో, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టులోకి ఎన్‌గిడి ఎంపికయ్యాడు. [35] 2022 జూలైలో, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో, ఎన్‌గిడి T20I క్రికెట్‌లో తన మొదటి ఐదు వికెట్ల ప్రదర్శనను సాధించాడు. [36]

క్రియాశీలత[మార్చు]

2020 జూలైలో ఎన్‌గిడి, దక్షిణాఫ్రికా క్రికెట్‌లో బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమం గురించి చర్చించాలని, ఈ ఉద్యమానికి జట్టు మద్దతు ఇవ్వాలనీ జాతీయ జట్టుకు పిలుపునిచ్చాడు. క్రికెట్‌లో సంస్థాగతమైన జాత్యహంకారాన్ని కూడా అతను ప్రస్తావించాడు. ఈ విషయమై జట్టు చేసే ప్రయత్నాలకు నాయకత్వం వహించడానికి తనకు అభ్యంతరమేమీ లేదని చెబుతూ, ఎన్‌గిడి ఇలా అన్నాడు: "మనమంతా మళ్లీ వ్యక్తిగతంగా కలిసాం. మనం దాని గురించి మాట్లాడాం, ఏం జరుగుతోందో అందరికీ తెలుసు. కానీ మనం ఐకమత్యంగా లేనందున ఇది ప్రస్తుతం చాలా కష్టం (సమస్య) కూడా. అందరం కలిసి రానప్పుడు చర్చించడం చాలా కష్టమైన విషయమని నేను భావిస్తున్నాను. కానీ మనం మళ్లీ ఆడటానికి కలిసిన తర్వాత, మనం దానిని పరిశీలిద్దాం" [37]

ఎన్‌గిడి వ్యాఖ్యలపై మాజీ ప్రొటీస్ రూడి స్టెయిన్, పాట్ సింకాక్స్, బోయెటా డిప్పెనార్‌ల నుండి వ్యతిరేక అభిప్రాయాలు విమర్శలూ వచ్చాయి. కనీసం 30 మంది మాజీ ప్రోటీస్, - అందరూ నల్లజాతి ఆటగాళ్ళే - ఐదుగురు కోచ్‌లు ఎన్‌గిడికీ, BLM ఉద్యమానికీ మద్దతునిస్తూ ఒక సామూహిక ప్రకటనను విడుదల చేశారు. అదే సమయంలో క్రికెట్ సౌత్ ఆఫ్రికా "తన అభిప్రాయాల పట్ల నిస్సందేహంగా ఉండాలనీ, సమస్యను ఎదుర్కొనేలా చూడాలని" కూడా వారు కోరారు.[38]

మూలాలు[మార్చు]

  1. Dwivedi, Sandeep (19 January 2018). "South Africa speeding star Lungi Ngidi's come a long way — From panic attack on Indian bus". The Indian Express. The feel-good story about the 6'4" young black pacer, son of domestic helps from Durban, who first went to school because of an anonymous benefactor, has got South Africa smiling.
  2. "Lungi Ngidi". ESPN Cricinfo. Retrieved 13 June 2016.
  3. "Markram, Ngidi named among SA Cricket Annual's Top Five". Cricket South Africa. Archived from the original on 27 March 2019. Retrieved 29 November 2018.
  4. "Markram, Ngidi among SA Cricket Annual's Cricketers of the Year". ESPN Cricinfo. Retrieved 29 November 2018.
  5. "Quinton de Kock, Laura Wolvaardt scoop up major CSA awards". ESPN Cricinfo. Retrieved 4 July 2020.
  6. Burnard, Lloyd (18 January 2018). "School coach: Ngidi a 'special' human being". Sport (in ఇంగ్లీష్). Retrieved 19 June 2019.
  7. Said, Nick. "The story of Lungi Ngidi, from high school scholarship to South Africa's Test star". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 19 June 2019.
  8. admin (25 January 2018). "Manthorp column: Gibson's faith in South Africa's bowling reserves delivers after discovery of Ngidi". The Cricket Paper (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 19 June 2019.
  9. Northerns Squad / Players – ESPNcricinfo.
  10. "Rabada dominates CSA awards". ESPN Cricinfo. Retrieved 27 July 2016.
  11. "T20 Global League announces final team squads". T20 Global League. Archived from the original on 5 September 2017. Retrieved 28 August 2017.
  12. "Cricket South Africa postpones Global T20 league". ESPN Cricinfo. Retrieved 10 October 2017.
  13. "List of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 27 January 2018.
  14. "Mzansi Super League - full squad lists". Sport24. Retrieved 17 October 2018.
  15. "Mzansi Super League Player Draft: The story so far". Independent Online. Retrieved 17 October 2018.
  16. "Indian Premier League 2019: Players to watch". International Cricket Council. Retrieved 19 March 2019.
  17. "MSL 2.0 announces its T20 squads". Cricket South Africa. Archived from the original on 4 September 2019. Retrieved 4 September 2019.
  18. "CSA reveals Division One squads for 2021/22". Cricket South Africa. Archived from the original on 20 April 2021. Retrieved 20 April 2021.
  19. "IPL 2022 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 13 February 2022.
  20. @SFOUnicorns (May 26, 2023). "#SparkleArmy meet your newest Unicorn, Lungi Ngidi is heading to the Golden City. A feared South African fast bowler with a knack for taking wickets in clusters #SFOUnicorns #MLC2023 #MajorLeagueCricket" (Tweet). Retrieved June 15, 2023 – via Twitter.
  21. "Behardien to lead in T20 as SA ring changes". ESPN Cricinfo. Retrieved 9 January 2017.
  22. "Sri Lanka tour of South Africa, 1st T20I: South Africa v Sri Lanka at Centurion, Jan 20, 2017". ESPN Cricinfo. Retrieved 20 January 2017.
  23. "Miller powers SA to victory in 10-over thrash". ESPN Cricinfo. Retrieved 20 January 2017.
  24. "De Villiers, Ngidi included in SA one-day squad". ESPN Cricinfo. Retrieved 23 January 2017.
  25. "Lungi Ngidi to miss ODIs against Sri Lanka with abdomen injury". ESPN Cricinfo. Retrieved 27 January 2017.
  26. "Olivier, Ngidi added to South Africa squad for second Test". ESPN Cricinfo. Retrieved 8 January 2018.
  27. "2nd Test, India tour of South Africa at Centurion, Jan 13-17 2018". ESPN Cricinfo. Retrieved 13 January 2018.
  28. "South Africa pick Ngidi and Zondo for India ODIs". ESPN Cricinfo. Retrieved 25 January 2018.
  29. "3rd ODI (D/N), India tour of South Africa at Cape Town, Feb 7 2018". ESPN Cricinfo. Retrieved 7 February 2018.
  30. "Markram, Ngidi awarded CSA central contracts". ESPN Cricinfo. Retrieved 8 March 2018.
  31. "Hashim Amla in World Cup squad; Reeza Hendricks, Chris Morris miss out". ESPN Cricinfo. Retrieved 18 April 2019.
  32. "Amla edges out Hendricks to make South Africa's World Cup squad". International Cricket Council. Retrieved 18 April 2019.
  33. "Ngidi rips through Aussie batters". SA Cricket Mag. 4 March 2020. Retrieved 4 March 2020.
  34. "Six of the best for Ngidi as Proteas restrict Aussies". The Citizen. 4 March 2020. Retrieved 4 March 2020.
  35. "T20 World Cup: South Africa leave out Faf du Plessis, Imran Tahir and Chris Morris". ESPN Cricinfo. Retrieved 9 September 2021.
  36. "England beat South Africa in first T20 as Jonny Barstow hits 90 and Moeen Ali slams record 16-ball fifty". Sky Sports. Retrieved 27 July 2022.
  37. Schenk, Heinz (July 6, 2020). "Lungi Ngidi won't mind taking lead in Proteas' Black Lives Matter efforts". Sport24. Retrieved July 17, 2020.
  38. Burnard, Lloyd (14 July 2020). "30 former Proteas express united support for Lungi Ngidi, Black Lives Matter". Sport24. Retrieved 17 July 2020.