లేడీస్ డాక్టర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లేడీస్ డాక్టర్
దర్శకత్వంరాము
సంగీతంకోటి
కూర్పుకె.రమేష్
నిర్మాణ సంస్థ
భాషతెలుగు

లేడీస్ డాక్టర్ 1996 లో రాము దర్శకత్వంలో వచ్చిన కామెడీ సినిమా.[1] శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై, రాము దర్శకత్వంలో బి. వనజ, సి. కళ్యాణ్ నిర్మించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, వినీత, కీర్తన ప్రధాన పాత్రల్లో నటించగా, విద్యాసాగర్ సంగీతం సమకూర్చాడు.[2] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.[3]

కథ[మార్చు]

రామ్ ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్) ప్రాక్టీసు లేని డాక్టరు. రాణి (కీర్తన) అనే అందమైన అమ్మాయి ప్రేమలో పడతాడు. వారు పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. జానకి (వినీత) ఒక సాంప్రదాయిక మహిళ. ఆమె పూర్వపు ఆచారాలు, సంప్రదాయాలను అనుసరిస్తూంటుంది. తన కాబోయే భర్త తప్ప మరో మగవాడు తనను తాకనే కూడదనే నిబంధన పెట్టుకుంది.. ఒకసారి ఆమె తీవ్రమైన అపెండిసైటిస్‌తో బాధపడుతుంటే, లేడీ డాక్టర్ లేకపోవడం వల్ల, రామ్ ప్రసాద్ మహిళ వేషంలో ఆపరేషన్ చేస్తాడు. తరువాత, విషయం తెలుసుకున్న జానకి రామ్ ప్రసాదే తన భర్త అని ప్రకటిస్తుంది. జానకి సోదరుడు రామదాసు (కె. అశోక్ కుమార్), కరుడు గట్టిన నేరస్థుడు. రామ్ ప్రసాద్ ను బలవంతపెట్టి తన సోదరిని పెళ్ళి చేసుకునేందుకు ఒప్పిస్తాడు. ఇప్పుడు, రామ్ ప్రసాద్ ఇద్దరి మధ్య చిక్కుకున్నాడు. అతడు ఈ సమస్యల నుండి ఎలా బయట పడతాడు, అతను ఎవరిని పెళ్ళి చేసుకుంటాడనేది మిగతా కథ.

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "ఓ ఆకాశవాణీ"  మనో, కె.ఎస్.చిత్ర 4:02
2. "చలిగాలి చెంగుచాటు"  మనో, కె.ఎస్.చిత్ర 2:33
3. "వైద్యో నారాయణో హరీ"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రాజేంద్ర ప్రసాద్ 3:45
4. "ఎన్నెన్నో నోములు నోచి"  మనో, కె.ఎస్.చిత్ర 4:34
5. "ఇటుపక్క చక్కని బొమ్మ"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, స్వర్ణలత 4:00
6. "అమ్మోరు"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సింధు 4:53
మొత్తం నిడివి:
23:47

మూలాలు[మార్చు]

  1. "లేడీస్ డాక్టర్ (1996)". youtube.com. మల్లెమాల టీవీ. Retrieved 18 October 2016.
  2. Ladies Doctor (Cast & Crew).
  3. Ladies Doctor (Review).