లౌవ్రే మ్యూజియం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లౌవ్రే మ్యూజియం (Louvre Museum) అనేది పారిస్లో ఉన్న ఒక మ్యూజియం. ఈ మ్యూజియంలో ఉన్న కళా ఖండాల కారణంగా ఈ మ్యూజియం ప్రతి సంవత్సరం లక్షలాది సందర్శకులను ఆకర్షిస్తుంది. ఇది ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ కళా మ్యూజియం. ఈ లావ్రే మ్యూజియంలో లియొనార్డో డావిన్సి అనే ప్రముఖ ప్రాచీన చిత్రకారుడు చిత్రించిన ప్రఖ్యాతి గాంచిన మోనాలిసా చిత్రపటం ఉంది. ఇంకా ఈ మ్యూజియంలో రెంబ్రాండ్ట్, గియాంబట్టిస్టా పిట్టొని, కారావాగ్గియో, రూబెన్స్, టైటియాన్, యూజీన్ డెలక్రొయిక్స్ వంటి గొప్ప చిత్రకారులు చిత్రించిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ లౌవ్రే మ్యూజియం లోపల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అత్యంత ప్రముఖ విగ్రహాలైన వీనస్ డి మైలో, విన్జెడ్ విక్టరీ ఆఫ్ సమోత్‌రేస్ విగ్రహాలు ఉన్నాయి.