వందేమాతరం రవీంద్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వందేమాతరం రవీంద్ర

వందేమాతరం రవీంద్ర వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపక ధర్మకర్త[1]. అతను జాతీయత కోసం జీవితాన్ని అంకితం చేశాడు. [2]

జీవిత విశేషాలు

[మార్చు]

రవీందర్ వరంగల్ జిల్లా ఇల్లందులో పేద రైతు కుటుంబంలో జన్మించాడు. స్వంత ఊరిలోనే పదవ తరగతి వరకు చదివాడు. వర్థన్నపేటలో ఇంటర్ చదివే రోజుల్లో తాను చదివిన కళాశాల మౌలిక వసతుల కోసం కలెక్టరును కలసి 40 లక్షర రూపాయల నిధులు సాధించాడు. ఆ నిధులతో కళాశాలలో మౌలిక వసతుల కల్పన జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని అంతకు ముందే తన స్వంత గ్రామంలో ప్రారంభించాడు. చదువుకునే రోజుల్లో చైతన్య యూత్ అసోసియేషన్ ప్రారంభించి చెరువులలో పూడిక తీయించాడు. అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నాడు.[3]

వందేమాతరం పౌండేషన్

[మార్చు]

గ్రామాల్లో యువత మనస్సుల్లోకి దేశభక్తి ,సంస్కృతిని పెంపొందిస్తున్నాడు.1990 నుండి, అతను వివిధ సామాజిక సంస్థలలో నిమగ్నమై ఉన్నాడు, బాల కార్మికులను నిర్మూలించడానికి గ్రామాల సాధికారత దిశగా కృషి చేస్తున్నాడు. ఈ సమయంలో, అతను ప్రభుత్వ పాఠశాలల సాధికారత అవసరాన్ని గ్రహించాడు,దీని కారణంగా అతను 2005 లో వందేమాతరం ఫౌండేషన్ ను ప్రారంభించాడు.అప్పటి నుండి అతను ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అలుపెరగకుండా పనిచేస్తున్నాడు.[4]మహబూబాబాద్ జిల్లా లో తొర్రూరు పట్టణంలోని నితిన్ భవన్ లొ వందేమాతరం ఫౌండేషన్ ను స్థాపించి దానిని నడిపిస్తున్నాడు.[5] ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 5 జూన్ 2021న తొర్రూరు లోని నితిన్ భవనంలో వీఎంఎఫ్‌ ఆధ్వర్యంలో 10 లక్షల విత్తన బంతుల తయారీకి శ్రీకారం చుట్టారు. [6] కాకినాడ ఇంజనీరింగ్ అలుమ్ని ట్రస్ట్ ఫర్ సర్వీస్, వందేమాతరం పౌండేషన్ ఆద్వర్యం లో తొర్రూరు లోని నితిన్ భవనంలో నిరుద్యోగ యువతకు డిజిటల్ లాండ్ సర్వే పై శిక్షణ ఇచ్చారు. [7]

మూలాలు

[మార్చు]
  1. "చిన్నారులు ఉన్నత విద్యపై మక్కువ పెంపొందించుకోవాలి : ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి - Namasthetelangaana". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2021-06-15.
  2. Foundation, Vandemataram. "VMF Team - India | Vandemataram Foundation". Vandemataram Foundation (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-06-16. Retrieved 2021-10-20.
  3. "Vandemataram Foundation" (PDF). sakshiexcellenceawards.com.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Sri Ravinder T, Founder". Archived from the original on 2021-06-16. Retrieved 2021-06-15.
  5. "Kalam's 89th Birthday Celebrations". Archived from the original on 2021-06-16. Retrieved 2021-06-15.
  6. "10 లక్షల విత్తన బంతుల తయారీకి శ్రీకారం". EENADU. Retrieved 2021-10-20.
  7. "SKILL DEVELOPMENT PROGRAM AT THORRUR, MAHABUBABAD DT". Keats (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-03-05. Retrieved 2021-10-21.