వంద సంవత్సరాల యుద్ధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వంద సంవత్సరాల యుద్ధం

వంద సంవత్సరాల యుద్ధం ఫ్రెంచి సింహాసనం మీద ఆధిపత్యం కోసం ఇంగ్లాండ్, ఫ్రానుసు రాజవంశాల మధ్య 1337 నుంచి 1453 దాకా అనేక పోరాటాలు జరిగాయి. వీటినే వంద సంవత్సరాల యుధ్ధం అంటారు. వీరి మిత్ర రాజ్యాలు కూడా దీనిలోకి లాగడం జరిగింది. దీనికి సంబంధించిన మూలాలు ఇంగ్లాండ్ రాజయిన విలియం ది కాంక్వెరర్ కాలములో తలెత్తిన ఒక రాజ్య సంబంధమైన వివాదములోనే ఉన్నాయి. 1033లో విలియం ఇంగ్లాండు రాజ్యమునకు రాజయినపుడు ఫ్రానుసు రాజ్య భాగమైన నార్మండీ సంస్థానాన్ని తనతో పాటే ఉంచుకున్నాడు. దీని వలన నార్మండీ పాలకులు ఇతర దేశానికి రాజులయినప్పటికీ వారు ఫ్రానుసు చక్రవర్తికి తమ నివాళులు అర్పించేవారు. కానీ 1337లో ఆరవ ఫిలిఫ్ ఫ్రానుసు రాజుగా ఉన్న కాలములో ఇంగ్లాండు రాజు మూడవ ఎడ్వర్డ్ దీనికి నిరాకరించాడు. దీనితో కోపించిన ఆరవ ఫిలిఫ్ ఆక్వాంటైన్‌లోని ఎడ్వర్డ్ భూములను ఆక్రమించుకున్నాడు.

దీనికి వ్యతిరేకంగా ఫ్రానుసుకు ఫిలిప్‌గాక తానే నిజమైన రాజునని ప్రకటించుకున్నాడు. 1328లో ఎడ్వర్డ్ మేనమామ ఫ్రెంచి పాలకుడు అయిన నాలుగవ ఛార్లెస్ మగ సంతానం లేకుండా మరణించాడు. ఎడ్వర్డ్ ఫ్రానుసుకు చెందిన నాలుగవ ఫిలిప్ కూతురు నాలుగవ చార్లెస్ చెల్లెలు ఇసబెల్లా కుమారుడు. ఈ విధంగా చార్లెస్‌ అతి దగ్గరి బంధువు. కానీ చనిపోయిన రాజు దాయాది, నాలుగవ ఫిలిప్ చిన్న తమ్ముడు వాలోయిస్ కౌంట్ అయిన చార్లెస్ కుమారుడు ఆరవ ఫిలిప్ ఫ్రానుసు సింహాసనాన్ని అధిశష్టించాడు. దీనికి ఆధారం సాలిక్ లా. దీని ప్రకారం ఆడ పిల్లల వంశక్రమము ద్వారా వచ్చే మగపిల్లలు సింహాసనానికి అనర్హులు. ఈ విధంగా ఈ వారసత్వ తగాదా తరతరాలుగా ఇంగ్లాండు ఫ్రానుసు రాజుల మధ్య యుధ్ధాలకు కారణంగా మారింది.

ఈ యుధ్ధం రకరకాల కారణాల వల్ల చారిత్రక ఫ్రాధన్యతను సంతరించుకున్నది. నిజానికి ఇది వారసత్వ తగాదా అయినప్పటికి ఇంగ్లాండు, ఫ్రానుసు జాతీయవాదము అభివృధ్ధి చెందడానికి తోడ్పడింది అని చెప్పవచ్చు. ఈ యుధ్ధంలో కొత్త రకాల ఆయుధాలు వ్యూహాలను ఉపయోగించడం జరిగింది. కానీ అప్పటి దాకా ఫ్యూడల్ సైన్యాలలో భారీ ఆశ్విక దళాళలకు ఎక్కువ ఫ్రాధాన్యం ఉండేది. వాటి స్థానాన్ని కొత్త ఆయుధాలు ఆక్రమించాయి. పశ్చమ రోమన్ కాలము తరువాత ఇంత కాలానికి ఐరోపా‌లో మొదటి సారిగా స్థిరమైన సైన్యన్ని ఏర్పాటు చేశారు. దీని వలన రైతాంగము పాత్ర మారిపోయింది. వీటన్నిటి వలన, అంతేగాక ఇది కొనసాగిన వ్యవధి వలన దీనిని మధ్య యుగములో జరిగిన యుధ్ధాలలో చాలా ప్రాముఖ్యత కలదిగా గుర్తించబడింది.యుధ్ధములో పాల్గొన్న పక్షాలలో కాలక్రమేణా ఇంగ్లీషు రాజకీయ శక్తులు ఆర్థికముగా చాలా భారాన్ని మోయవలసి వచ్చింది. ఈ యుధ్ధము వలన ఖండాంతర భూభాగముల నష్టము వలన ఆంగ్లేయ ఉన్నత వంశస్తులలో అసంతృప్తి చెలరేగి, గులాబీ యుధ్ధాలు అనబడే అంతర్యుధ్ధాలకు దారితీసింది. ఫ్రానుసులో అంతర్యుధ్ధాలు, ప్రాణాంతక అంటువ్యాధులు, కరువులు, కిరాయి హంతకుల బందిపోటు ముటాలు జనాభాను విపరీతంగా తగ్గించాయి.

నేపథ్యం[మార్చు]

నాలిగవ ఫిలిప్ (కూర్చున్న వ్యక్తి) కు వెధేయతను ప్రదర్శిస్తున్న ఇంగ్లాండుకు చెందిన ఒకటవ ఎడ్వర్డ్. అక్వైటైన్ ప్రభువుగా ఎడ్వర్డ్ కూడా ఫ్రానుసు రాజుకు సామంతుడు.

ఆంగ్లేయ రాజులు , వారి ఖండాంతర సంస్థానాధిపత్యం: 1066 - 1331[మార్చు]

1066నాటి నార్మన్ ఆక్రమణ తరువాత ఇంగ్లాండును ఆంగ్లో - నార్మన్ వంశస్థుల పాలించారు. కానీ 1154లో అంజూకు చెందిన జియోఫ్రే, మాటిల్దా రాణి కుమారుడైన హెన్‌రీ (విలియం ది కాంక్వెరర్ మునిమనుమడు) రాజు రెండవ హెన్‌రీ పేరుతో ఇంగ్లాండుకు మొదటి ఆంజీవియన్ రాజయినపుడు వీరిపాలన ముగిసింది[1] . ఇప్పుడు ఆంజీవియన్ రాజ్యముగా మారిన ఇంగ్లాండు రాజుగా ఫ్రానుసు రాజు కంటే ఎక్కువగా ఫ్రానుసు భూములను ప్రత్యక్షముగా పాలించారు. కాని సంస్థాన పాలకులుగా వీరు ఫ్రానుసు రాజుకు సామంతులుగా తమ నివాళులు అర్పించారు. కానీ 11వ శతాబ్దము తరువాత ప్రభువులకు ఎక్కువ స్వయంప్రతిపత్తి లభించటం వలన ఈ సమస్య పరిష్కారమైంది.[2]

ఇంగ్లాండుకు చెందిన జాన్ ఆంజీవియన్ ప్రాంతాలను రాజు ఒకటవ రిచర్డ్ నుండి వారసత్వంగా పొందాడు. అయినప్పట్టీకీ న్యాయపరంగా, సైనికపరంగా జాన్ బలహీలతలను ఆసరాగా తీసుకుని ఫ్రానుసుకు చెందిన రెండవ ఫిలిప్ 1204 నాటికి దాదాపు అంజీవియన్ ఖండాంతర భూభాగాలన్నింటిని ఆక్రమించుకున్నాడు. జాన్ పాలనాకాలములో, బొవియన్ యుధ్ధం (1214), సెయింటాంగే యుధ్ధము (1242) మరియి చివరగా సెయింట్ - సార్డోస్ యుధ్ధాల (1324) వలన ఇంగ్లాండు నార్మండీని పూర్తిగా పోగొట్టుకుంది. ఇంగ్లీషువారి ఆధీనంలోని ప్రాంతాల సంఖ్య గాస్కోనీలోని కొన్న్ రాష్ట్రాలకు తగ్గిపోయింది.[3]

ఫ్రానుసులో వారసత్వ సంక్షోభము: 1314-1328[మార్చు]

ఫ్రానుసు రాజ్య న్యాయసూత్రాల ప్రకారం సింహాసనము ఆడపిల్లల వారసులకు సంక్రమించదు. ఇది కేవలం పాత కాలం నుంచి వస్తున్న ఒక ఆచారం. 1316లో పదవ లూయిస్, 1322లో ఐదవ ఫిలిప్, 1328లో నాలుగవ చార్లెస్ ల మరణానంతరము ఆడపిల్లల వారసత్వ హక్కుల ప్రశ్న తలెత్తింది. కానీ కానీ ప్రతిసారీ మగ వారసులకు ప్రాధాన్యం లభించింది.[4]

1328లో ఫ్రానుసు రాజు నాలుగవ చార్లెస్ మరణించినప్పుడు ఆయన కూతుర్లను మాత్రమే వదిలి వెళ్ళాడు, ఆయనకు అతిదగ్గర మగ బంధువు ఇంగ్లాండుకు చెందిన మూడవ ఏడ్వర్డ్. చనిపోయిన చార్లెస్‌కు ఎడ్వర్డ్ తల్లి ఇసబెల్లా చెల్లెలు. ఈ విధంగా తను తల్లి ద్వారా వారసత్వంగా హక్కును పొందాండు. కానీ తాను ఆడపిల్ల కావడం వల్ల పొందలేని హక్కు తన పిల్లలకు మాత్రం ఎలా వస్తుందన్న ప్రశ్న తలెత్తింది. అంతేకాకుండా ఫ్రానుసు ఉన్నత వంశస్థులు ఇంగ్లీషు రాజు తమను పాలించడాన్ని అంగీకరించలేకపోయారు. జమిందారులు, మతాథికారులు, పారిస్ యూనివర్శిటిల సమావేశములో తల్లి ద్వారా వారసత్వాన్ని పొందిన మగ పిల్లలకు సింహాసనాన్ని అధిష్టించే అర్హత లేదని తీర్మానించారు. కాబట్టి మగ వారసుల ద్వారా సింహాసనానికి దగ్గర వారసుడు వాలోయిస్ జమిందారు చార్లెస్ మొదటి దాయాది ఫిలిప్, నాలుగవ ఫిలిప్ పేరుతో సింహాసనాన్ని అధిష్టించాలని తీర్మానించారు. 1340లో సాలిక్ లా ప్రకారం మగపిల్లలు తమ తల్లుల ద్వారా వారసత్వాన్ని పొందకూడదని అవిగ్నాన్ పోపులు దీనిని బలపరిచారు.[4][5]

యుధ్ధానికి ప్రారంభము: 1337-60[మార్చు]

ఇంగ్లీషు రాజు పాలనలో గాస్కోనీ[మార్చు]

11వ శతాబ్దములో నైఋతి ఫ్రానుసులోని గాస్కోనీని అక్వటైంతో కలివేసి, గుయన్నే, గాస్కోనీ రాష్టమును ఏర్పాటు చేశారు.ఇంగ్లాండును పాలించిన రెండవ హెన్‌రీ ఫ్రానుసు రాణి అయిన ఆక్వెంటయిన్ ఎలెనార్‌ వివాహము చేసుకున్నఫప్పుడు ఆక్వెంటయిన్ సంస్థానము ఇంగ్లీషు అంజీవియన్ రాజులకు సంక్రమించింది. ఈ విధముగా ఈ ప్రాంతాలు ఫ్రానుసు సార్వభౌమత్వములో ఉన్నాయి. 13వ శతాబ్దము నాటికి అక్వటైం, గుయన్నే, గాస్కోనీ పదాలు సమానార్థాలుగా వాడబడ్డాయి.[6][7] 1327 ఫిబ్రవరి ఇన మూడవ ఎడ్వర్డ్ రాజయ్యే కాలానికి అతని చేతులలో మిగిలిన ఆక్వెంటయిన్ భూభాగము గాస్కోనీ సంస్థానము మాత్రమే. ఈశాన్య ఫ్రానుసులో ఇంగ్లాండు రాజుల ఆధీనంలోని ప్రాంతాలను ఇప్పుడు గాస్కోనీ అని పిలవనారంభించారు. కానీ ఇంగ్లీషు రాజులు ఆక్వెంటయిన్ ప్రభువు అనే పదాన్నే ఉపయోగించారు.[7][8].

మూడవ ఎడ్వర్డ్ పది సంవత్సరాల పాలనలో గాస్కోనీ సంఘర్షణలకు మూల కేంద్రముగా మారిపోయింది. నాలుగవ చార్లెస్ తన సామంతునితో తగిన విధముగా ప్రవర్తించలేదని, కావున ఫ్రానుస్ సార్వభౌమత్వమునుంచి ఎడ్వర్డ్ సంస్థాన విషయములో స్వతంత్రుడని ఇంగ్లీషు వారు వాదించారు. కానీ 1329లో 17 సంవత్సరాల మూడవ ఎడ్వర్డ్ ఆరవ ఫిలిప్‌కు నివాళులర్పించినప్పుడు ఈ వాదనను పాటించలేదు. ఆచారము ప్రకారం సామంతులు రాజును చూడడానికి వచ్చినపుడు ఆయుధాలు ధరించరాదు, తలను కప్పి ఉంచరాదు. కానీ ఎడ్వర్డ్ ఈ వేడుకకు కిరీటము ఖడ్గాలను ధరించి వచ్చి తన నిరసనను ప్రదర్శించాడు.[9] ఫ్రానుసు ఎడ్వర్డ్ ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతముగా ఇంగ్లీషు పాలనపై ఒత్తిడి తీసుకురాసాగింది.[10]

నిజానికి గాస్కోనీ ఒక్కటే ముఖ్య కారణము కాదు. ఆర్టోయిస్‌కు చెందిన మూడవ రాబర్ట్ ఎడ్వర్డ్ ప్రభావశీలురైన సలహాదారులలో ఒకడు. నాలుగవ ఫిలిప్‌తో ఒక వారసత్వము విషయముతో విభేదించి ఫ్రానుసు రాజ సభనుంచి పారిపోయి వచ్చాడు. అతను యుధ్ధము ద్వారా ఫ్రానుసును తిరిగి సంపాదించమని ఎడ్నర్డ్‌తో వాదించాడు. అతనే ఫ్రెంచి రాజ దర్బారుకు సంబంధించిన అంతులేని సమాచారాన్ని అందించాడు.[11]

ఫ్రాంకో - స్కాట్‌ల కూటమి[మార్చు]

కొన్ని సంవత్సరాలుగా ఇంగ్లీషు రాజులు స్కాట్‌ల తల వంచడానికి ప్రయత్నించారు. 1295లో ఫిలిప్ ది ఫెయిర్ కాలములో ఫ్రానుసు స్కాట్‌లాండ్‌ల మధ్య ఒక ఒప్పందము కుదిరినది. నాలుగవ చార్లెస్ ఈ ఒప్పందాన్ని పునరఉధ్ధరించి ఎప్పుడు ఇంగ్లాండు స్కాట్‌లపై దండెత్తితే అప్పుడు ఫ్రానుసు సహాయము చేస్తుందని వాగ్దానము చేశాడు. అదే విధంగా స్కాట్‌లు సహాయము చేయాలి. స్కాట్‌లు ఫ్రానుసు సహాయాన్ని కోరతారని భయపడి ఎడ్వర్డ్ తన ప్రయత్నాలను అమలుచేయలేకపోయాడు.[10]

పవిత్ర ప్రాంతానికి క్రూసేదడు మొదలు పెట్టాలనే తన గొప్ప యోచనలో భాగంగా మార్సెయిల్ వద్ద ఒక గొప్ప నావికాదళాన్ని సమీకరించాడు. అయితే ఈ ఆలోచనను విరమించాడు. నావికా దళాన్ని రద్దు చేసాడు. వారిలో స్కాటిష్ నావికా దళ విభాగాలు కూడా ఉన్నాయి. వీరు 1336లో నార్మండీని వదిలి ఇంగ్లీషు చానెల్‌లో ప్రవేశించి ఇంగ్లాండును భయపెట్టసాగారు.[11] ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఎడ్వర్డ్ ఇంగ్లీషు వారు రెండు పెద్ద సైన్యాలను తయారు చేయాలని ప్రతిపాదించాడు. ఒక దళం సరియైన సయములో స్కాట్‌లను ఎదురోవాలని, రెండవ దళము గాస్కోనీ వెళ్ళాలని ప్రతిపాదించాడు. అదే సమయములో ఫ్రానుసు రాజూ దగ్గరకు దూతలను స్నేహ ఒప్పందము కుదుర్చుకోవాలని పంపాడు.[12]

ముగిసిన విధేయత[మార్చు]

1337 ఏప్రిల్ మాసాంతములో ఇంగ్లాండ్ నుండి వచ్చిన దూతలను కలవడానికి ఆరవ ఫిలిప్ నిరాకరించాడు. 1337 ఏప్రిల్ 30 నుండి ఆయుధాలు ధరించాలని ఫ్రానుసు అంతటా ఆదేశించడం జరిగింది. 1337 మేలో ఫిలిప్ ఒక గొప్ప సమావేశాన్ని పారిస్‌లో ఏర్పాటుచేశాడు. దీనిలో మూడవ ఏడ్వర్డ్ సామంతునిగా తన బాధ్యతలను ఉల్లంగించాడని అందువలన అక్వాంటయిన్ సంస్థానాన్ని, నిజానికి గాస్కోనీని రాజు తన చేతులలోకి తీసుకోవాలని తీర్మానించారు. అంతేగాక అతను రాజు బధ్ధశత్రువైన రాబర్ట్ డి ఆర్టాయిస్‌కు ఆశ్రయం కల్పించాడు. ఇంకాచెప్పని కారణాలు అనేక ఉన్నాయి.[13] ఇలా అక్వాంటయిన్‌ను జప్తు చేయడాన్ని సింహాసనముపై ఫిలిప్ హక్కును ప్రశ్నించడం ద్వారా సవాలు చేశాడు.నాలుగవ ఛార్లెస్ మరణించినపుడు ఎడ్వర్డ్ ఫ్రెంచి సింహాసనంపై వారసత్వానికి తనకు గల హక్కును గురుచేశాడు. అతను నాలుగవ ఫిలిఫ్ కూతురు నాలుగవ ఛార్లెస్ సోదరి ఇసబెల్లా కుమారుడు. 1329లో ఆరవ ఫిలిప్‌ను ఏడ్వర్డ్ స్వయంగా కలసి నివాళులర్పించడం ద్వారా ఈ వాదము విస్మరించబడింది. అయితే 1340లో ఏడ్వర్డ్ తన వాదనను పునరుధ్ధరించాడు. అధికారికంగా ప్రానుసు రాజు బిరుదును ఫ్రానుసు రాజచిహ్నాలని ధరించడం ప్రారంభించాడు.[14]

1340 జనవరి 26న ఫ్లాండర్స్ జమీందారు సవతి తమ్ముడైన గయ్ అధికారికంగా మూడవ ఏడ్వర్డ్‌ రాజుగా గుర్తించాడు. గెంట్, ప్రెస్, బ్రూగ్స్‌లలోని పౌరపాలనా సంఘాలు ఏడ్వర్డ్‌ను ఫ్రానుసు రాజుగా అంగీకరించాయి. ఏడ్వర్డ్‌ లక్ష్యం ఏమిటంటే సముద్రతీరప్రాంతాలలో తన పలుకుబడిని పెంచుకోవడం. అతని మద్దత్తుదారులు తాము నిజమైన ఫ్రానుసు రాజు విశ్వాస పాత్రులమని చెప్పుకున్నారు. కానీ వారు ఫ్హిలిప్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేదు. 1340 ఫిబ్రవరిలో ఇంకా ఎక్కువ నిధులు సకూర్చుకోవటానికి, తన రాజకీయ సమస్యలను పరిష్కరించుకోవటానికి ఏడ్వర్డ్‌ ఇంగ్లాండు తిరిగి వెళ్ళాడు.[15]

1470లో బ్రూగ్ రచించిన ఫ్రియోసార్ట్స్ క్రానికల్ రాతప్రతిలో స్లయ్స్ యుధ్ధము

ఫ్లాండర్స్‌తో సంబంధాలు ఇంగ్లీషు వారి ఊలు వ్యాపారముతో కూడా ముడిపడి ఉన్నాయి. తమ ఊలు వ్యాపారము ఫ్రాధాన్యతకు చిహ్నముగా తన ఛాన్స్‌లర్‌ను మంత్రుల సభలో ఊలు ఆసనముపై కూర్చోవాలని ఆదేశించాడు.[16] ఆసమయములో సస్సెక్స్ ఒక దానిలోనే 1,11,000ల ఓడలు ఉండేవి.[17] మధ్య యుగాలనాటి పెద్ద ఆంగ్లేయ మటాలు పెద్ద మొత్తంలో ఊలును తయారుచేసేవి. దీనిని ఐరోపా అంతటా అమ్మేవారు. తరతరాలుగా ప్రభుత్వాలు వీటిపై పన్ను వేసి పెద్ద మొత్తంలో లాభాన్ని పొందేవి.[16] ఫ్రానుసు నావికా శక్తి వలన ఆర్థికంగా నష్టాలు ఆరంభమయ్యాయి. ఫ్లాండర్స్‌తో ఊలు వ్యాపారము, గాస్కోనీతో వైన్ వ్యాపారాలు తగ్గిపోయాయి.[18][19]

ఇంగ్లీష్ చానల్ బ్రిటానీలలో ఆకస్మిక పరిణామాలు[మార్చు]

1340 జూన్ 22న ఎడ్వర్డ్ తన నావికాదళంతో ఇంగ్లాండు నుండి బయలుదేరాడు. తరువాత రోజు జ్విన్ నదీ ముఖద్వారాన్ని చేరుకున్నాడు. స్లయ్స్ ఓడరేవు వద్ద ఫ్ర్ంచి నావికాదళం రక్షణాత్మక వ్యూహములో ఉంది. ఇంగ్లీషు నావికా దళం తాము వెనుదిరిగి వెళ్ళిపోతున్నట్టు ఫ్రాన్స్ వారిని నమ్మించారు. మధ్యానం సముద్ర గాలి మళ్ళినప్పుడు ఇంగ్లీశ్హు వారు దానితో పాటు దాడి చేశారు. ఇప్పుడు సూర్యుడు వారి ముందు భాగాన ఉన్నాడు. ఈ దాడిలో ప్రాంస్ నావికా దళం అంతా దాదాపు నాశనమయ్యింది. దీనిని స్లయ్స్ యుధ్ధం అంటారు. మిగిలిన దశలో ఇంగ్లీశ్ చానల్ పై ఆంగ్లేయ నావికాదళం అధిపత్యాన్ని చెలాయించింది. ప్రాంస్ దురాక్రమణలను అడ్డుకున్నది.[15] ఈ సమయానికి ఎడ్వర్డ్ ఖజానాలోని ధనమంతా ఖర్చయిపోయినదై. దీనితో ఈపోరాటము ముగింపు దశకు వచ్చింది. కానీ యుధ్ధము ఇంకా ముగియలేదు. ఈ సమయములో బ్రిటానీ ప్రభువు మరణించాడు. దీనితో ఆ సంస్థాన అధిపత్యమునకై డ్యూక్ సవతి సోదరుడు అయిన జాన్ మోంట్‌ఫోర్ట్, రాజు నాలుగవ ఫిలిప్ బంధువు (nephew) బ్లావ్స్‌కు చెందిన ఛార్లెస్‌కు మధ్య వారసత్వ వివాదం చెలరేగింది.[20]
క్రేసీ యుధ్ధము, 1346

వారసత్వము కోసం తలెత్తిన వివాదము వలన 1341లో బ్రెటాన్ వారసత్వ యుధ్ధం మొదలైంది. ఇందులో ఎడ్వర్డ్ మోంట్‌ఫోర్ట్‌కు చెందిన జాన్‌ను, ఫిలిప్ బ్లావ్స్‌కు చెందిన ఛార్లెస్‌కు మద్దత్తు పలికారు. తరువాత కొన్ని సంవత్సరముల వరకు బ్రిటానీలో జరుగుతున్న పోరాటముపై దృష్టి కేంద్రీకరించారు. వాన్నెస్ నగరం చాలా సార్లు చేతులు మారింది. తరువాత గాస్కోనీలో జరిగిన ఘర్షణలలో ఇరుపక్షాలకు మిశ్రమ ఫలితాలు లభించాయి.[20]

క్రేసీ యుధ్ధము, కలాయిస్ ఆక్రమణ[మార్చు]

గమనిక[మార్చు]

 1. Bartlett 2000, p. 22
 2. Bartlett 2000, p. 17
 3. Gormley 2007 [1] Ohio State University
 4. 4.0 4.1 Brissaud 1915, pp. 329–330
 5. Previte-Orton 1978, p. 872
 6. Harris 1994, p. 8
 7. 7.0 7.1 Prestwich 1988, p. 298
 8. Prestwich 2005, pp. 292–293
 9. Wilson 2011, p. 194
 10. 10.0 10.1 Prestwich 2005, p. 394 ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "prestwich304" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 11. 11.0 11.1 Prestwich 2005, p. 306
 12. Sumption 1991, p. 180
 13. Sumption 1991, p. 184
 14. Prestwich 2003, pp. 149–150
 15. 15.0 15.1 Prestwich 2005, pp. 307–312
 16. 16.0 16.1 Friar 2004, pp. 480–481
 17. Darby & 1976 New Edition, p. 160
 18. Sumption 1991, pp. 188–189
 19. Sumption 1991, pp. 233–234
 20. 20.0 20.1 Rogers 2010, pp. 88–89

ఆధారము[మార్చు]

 • Backman, Clifford R (2003). The Worlds of Medieval Europe. New York: Oxford University Press. ISBN 0-1953-3527-9.CS1 maint: ref=harv (link)
 • Bartlett, Robert (2000). J.M.Roberts (ed.). England Under the Norman and Angevin Kings 1075 -1225. London: OUP. ISBN 978-0-19-925101-8.CS1 maint: ref=harv (link)
 • Brissaud, Jean (1915). Garner, James W. Tr (ed.). History of French Public Law. The Continental Legal History series. Vol 9. Boston: Little, Brown and Company.CS1 maint: ref=harv (link)
 • Curry, Anne (2002). The Hundred Years War 1337–1453. Oxford: Osprey Publishing. ISBN 1-84176-269-5.CS1 maint: ref=harv (link)
 • Darby, H. C. (1976 New edition). The British islands and their vegetation. Cambridge, England: Cambridge University Press. ISBN 0-521-29144-5. Check date values in: |year= (help)CS1 maint: ref=harv (link)
 • Davis, Paul K (2003). Besieged: 100 Great Sieges from Jericho to Sarajevo 2nd. Ed. Santa Barbara CA: Oxford University Press. ISBN 0-19-521930-9.CS1 maint: ref=harv (link)
 • "Encyclopædia Britannica Online". Encyclopædia Britannica. Retrieved 21 September 2012.CS1 maint: ref=harv (link)
 • Favier, Jean (1980). La Guerre de Cent Ans. Paris: Fayard. ISBN 978-2-213-00898-1.CS1 maint: ref=harv (link)
 • Friar, Stephen (2004). The Sutton Companion to Local History. Sparkford, England: Sutton. ISBN 0-7509-2723-2.CS1 maint: ref=harv (link)
 • Froissart, Jean (1895). Macaulay; George Campbell (ed.). The Chronicles of Froissart. John Bourchier Translator; Lord Berners Translator. London: Macmillan and Son. Retrieved 24 September 2012.CS1 maint: multiple names: editors list (link) CS1 maint: ref=harv (link)
 • Gormley, Larry (2007). "eHistory:The Hundred Years War: Overview". Ohio State University. Retrieved 20 September 2012.CS1 maint: ref=harv (link)
 • Griffiths, R.A. "Henry VI (1421–1471) in Oxford Dictionary of National Biography, 2004; online edn, Sept 2010; Subscription required". Oxford University Press. Retrieved 9 October 2012.CS1 maint: ref=harv (link)
 • Grummitt, David (2008). The Calais Garrison: War and Military Service in England, 1436–1558. Woodbridge: The Boydell Press. ISBN 978-1-84383-398-7.CS1 maint: ref=harv (link)
 • Guignebert, Charles (1930). A Short History of the French People. Vol 1. F. G. Richmond Translator. New York: Macmilan Company.
 • Harris, Robin (1994). Studies in History 71: Valois Guyenne. Woodbridge, Surrey: Boydell Press. ISBN 0-86193-226-9.CS1 maint: ref=harv (link)
 • Hattendorf, John B; Unger, Richard W, eds. (2003). War at Sea in the Middle Ages and the Renaissance. Woodbridge: The Boydell Press. ISBN 0-85115-903-6.CS1 maint: ref=harv (link)
 • Holmes, Jr, Urban T; Schutz, Alexander H (1948). A History of the French Language, Revised ed. Columbus, OH: Harold L. Hedrick.CS1 maint: ref=harv (link)
 • Jones, Robert. "Re-thinking the origins of the Irish Hobelar". Cardiff School of History and Archaeology. Retrieved on 8 April 2013.
 • Lambert, Craig L. "Edward III’s siege of Calais: A reappraisal," Journal of Medieval History (2011) 37#3 pp 231–342
 • Lee, Cristopher (1998). This Sceptred Isle:55BC-1901. London: Penguin Books. ISBN 0-140-26133-8.CS1 maint: ref=harv (link)
 • Ladurie, Emmanuel Le Roy (1987). The French peasantry, 1450–1660. Alan Sheridan Translator. Berkeley and LA: University of California Press. ISBN 0-520-05523-3.CS1 maint: ref=harv (link)
 • Lowe, Ben (1997). Imagining Peace: History of Early English Pacifist Ideas. University Park PA: Pennsylvania State University Press. ISBN 0271016892.CS1 maint: ref=harv (link)
 • Mortimer, Ian (2008). The Fears of Henry IV: the Life of England's Self-Made King. London: Jonathan Cape. ISBN 978-1-844-13529-5.CS1 maint: ref=harv (link)
 • Neillands, Robin (1990). The Hundred Years War, Revised ed. London: Routledge. ISBN 0-415-26131-7.CS1 maint: ref=harv (link)
 • Nicolle, David (2012). The Fall of English France 1449–53. Colchester, Essex: Osprey Publishing. ISBN 978-1-84908-616-5.CS1 maint: ref=harv (link)
 • Ormrod, W Mark (2001). Edward III. London: Yale University Press. ISBN 978-0-30-011910-7.CS1 maint: ref=harv (link)
 • Le Patourel, John (1984). Jones, Michael (ed.). Feudal Empires:Norman and Plantagenet. London: Hambledon Continuum. ISBN 0-907628-22-2. Retrieved 26 September 2012.CS1 maint: ref=harv (link)
 • Powicke, Michael (1962). Military Obligation in Medieval England. Oxford: OUP. ISBN 0-198-20695-X.CS1 maint: ref=harv (link)
 • Preston, Richard; Wise, Sydney F.; Werner, Herman O. (1991). Men in arms: a history of warfare and its interrelationships with Western society. 5th Edition. Beverley MA: Wadsworth Publishing Co Inc. ISBN 0-03-033428-4.CS1 maint: ref=harv (link)
 • Prestwich, Michael (1988). English Monarchs: Edward I. Berkeley and LA: University of California. ISBN 0-520-06266-3.CS1 maint: ref=harv (link)
 • Prestwich, Michael (2003). The Three Edwards: War and State in England 1272–1377. London: Routledge. ISBN 0-203-60713-9.CS1 maint: ref=harv (link)
 • Prestwich, Michael (2005). J.M.Roberts (ed.). Plantagenet England. Oxford: OUP. ISBN 978-0-19-922687-0.CS1 maint: ref=harv (link)
 • Previte-Orton, C.W (1978). The shorter Cambridge Medieval History 2. Cambridge: Cambridge University Press. ISBN 0-521-20963-3.CS1 maint: ref=harv (link)
 • Rogers, Clifford J, ed. (2010). The Oxford Encyclopedia of Medieval Warfare and Military Technology. Vol. 1. Oxford: Oxford University Press. ISBN 978-0-19-533403-6.CS1 maint: ref=harv (link)
 • Sumption, Jonathan (1991). The Hundred Years War I: Trial by Battle. Philadelphia: University of Pennsylvania Press. ISBN 0-8122-1655-5.CS1 maint: ref=harv (link)
 • Tuchman, Barbara (1978). A Distant Mirror: The Calamitous 14th Century. New York: Ballantine. ISBN 978-0-345-34957-6.CS1 maint: ref=harv (link)
 • Turchin, Peter (2003). Historical dynamics: why states rise and fall. Princeton: Princeton University. ISBN 0-691-11669-5.CS1 maint: ref=harv (link)
 • Vauchéz, Andre, ed. (2000). Encyclopedia of the Middle ages. Volume 1. Cambridge: James Clark. ISBN 1-57958-282-6.CS1 maint: ref=harv (link)
 • de Venette, Jean (1953). Newall, Richard A (ed.). The Chronicle of Jean de Venette. Translated by Jean Birdsall. New York: Columbia University Press.CS1 maint: ref=harv (link)
 • Wagner, John A (2006). Encyclopedia of the Hundred Years War. Westport CT: Greenwood Press. ISBN 0-313-32736-X.CS1 maint: ref=harv (link)
 • Webster, Bruce (1998). The Wars of the Roses. London: UCL Press. ISBN 1-85728-493-3.CS1 maint: ref=harv (link)
 • Wilson, Derek (2011). The Plantagenets. The Kings that made Britain. London: Quercus. ISBN 978-0-85738-004-3.CS1 maint: ref=harv (link)

బాహ్య ఆధారములు[మార్చు]