వకార్ హసన్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | వకార్ హసన్ మీర్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | అమృతసర్, పంజాబ్, బ్రిటిష్ ఇండియా | 1932 సెప్టెంబరు 12|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2020 ఫిబ్రవరి 10 కరాచీ, సింధ్, పాకిస్తాన్ | (వయసు 87)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి | |||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | పర్వేజ్ సజ్జాద్ (సోదరుడు) జమీలా రజాక్ (1963-2020) | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 11) | 1952 అక్టోబరు 16 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1959 నవంబరు 21 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 10 February 2020 |
వకార్ హసన్ మీర్ (1932, సెప్టెంబరు 12 - 2020 ఫిబ్రవరి 10) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1952 నుండి 1959 వరకు 21 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. పాకిస్తాన్ ప్రారంభ టెస్ట్ జట్టులో జీవించి ఉన్న చివరి సభ్యుడు ఇతను.[1] టెస్ట్ క్రికెట్‌లో 1,071 పరుగులు చేశాడు, 99 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.[2]
క్రికెట్ కెరీర్
[మార్చు]వకార్ హసన్ లాహోర్‌లోని ప్రభుత్వ కళాశాలలో చదివాడు. అక్కడ క్రికెట్ జట్టు కోసం ఆడాడు.[3] 1951లో యువ క్రికెటర్లతో కూడిన పాకిస్తాన్ ఈగల్స్ జట్టుతో కలిసి ఇంగ్లాండ్‌లో పర్యటించాడు.[3]
పాకిస్తాన్ మొదటి 18 టెస్ట్‌లలో ఆడాడు. 1952-53లో భారత్ తో జరిగిన పాకిస్తాన్ తొలి టెస్ట్ సిరీస్‌లో, అతను ఇరువైపులా అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు, 44.62 సగటుతో 357 పరుగులు చేశాడు.[4] 1954 ఇంగ్లాండ్ పర్యటనలో 14.71 సగటుతో 103 పరుగులతో తక్కువ విజయాన్ని సాధించాడు, కానీ కవర్లలో తన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు.[5]
1955-56లో లాహోర్‌లో న్యూజిలాండ్‌పై తన ఏకైక టెస్ట్ సెంచరీని సాధించాడు, 430 నిమిషాల్లో 189 పరుగులు చేశాడు, స్కోరు 6 వికెట్లకు 111 అయిన తర్వాత ఇంతియాజ్ అహ్మద్‌తో కలిసి ఏడవ వికెట్‌కు 309[6] పరుగులు జోడించాడు. 189 పాకిస్తాన్ అత్యధిక టెస్ట్ స్కోర్‌గా కొత్త రికార్డును నెలకొల్పింది, ఇది మరుసటి రోజు అహ్మద్ (209 పరుగులు చేశాడు).[7] హసన్ 50కి చేరుకోకుండానే మరో ఐదు టెస్టులు ఆడాడు.[8]
1949 నుండి 1966 వరకు పాకిస్తాన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. 1953–54లో హసన్ మహమూద్స్ XIకి వ్యతిరేకంగా LW కానన్స్ XI తరపున అత్యధిక స్కోరు 201 (నాటౌట్) చేశాడు.[9] 1963-64 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీ [10] ఫైనల్‌లో కరాచీ బ్లూస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇతని చివరి ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో అతను మళ్లీ 1964-65 పోటీలో విజేతగా నిలిచాడు.[11]
1960ల నుండి 1980ల వరకు అనేకసార్లు జాతీయ సెలెక్టర్‌గా పనిచేశాడు. 1982-83లో స్వదేశంలో పాకిస్తాన్ 3-0తో భారత్‌ను ఓడించినప్పుడు అతను చీఫ్ సెలెక్టర్ గా ఉన్నాడు.[3]
మరణం
[మార్చు]వకార్ తన 87 ఏళ్ళ వయసులో 2020 ఫిబ్రవరి 10న మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Waqar Hasan, last link to Pakistan's inaugural Test XI, dies at 87". ESPN Cricinfo. Retrieved 2023-09-21.
- ↑ "Waqar Hasan, last-surviving member of Pakistan's maiden Test XI, passes away at 87". International Cricket Council. Retrieved 11 February 2020.
- ↑ 3.0 3.1 3.2 Chaudhry, Ijaz. "Pakistan's first tour of India was my most memorable". Cricinfo. Retrieved 2023-09-21.
- ↑ Wisden 1953, pp. 872–83.
- ↑ Wisden 1955, pp. 215–19.
- ↑ "Pakistan v New Zealand, Lahore 1955–56". CricketArchive. Retrieved 2023-09-21.
- ↑ Don Neely & Richard Payne, Men in White: The History of New Zealand International Cricket, 1894–1985, Moa, Auckland, 1986, pp. 240–41.
- ↑ "Waqar Hasan, Test batting by season". CricketArchive. Retrieved 2023-09-21.
- ↑ "Hasan Mahmood's XI v L. W. Cannon's XI, 1953–54". CricketArchive. Retrieved 2023-09-21.
- ↑ "Karachi Blues v Karachi Whites, 1963–64". CricketArchive. Retrieved 2023-09-21.
- ↑ "Karachi Blues v Lahore Greens, 1964–65". CricketArchive. Retrieved 2023-09-21.
బాహ్య లింకులు
[మార్చు]- వకార్ హసన్ at ESPNcricinfo
- "Pakistan's first tour of India was my most memorable" from Cricinfo
- "Waqar Hasan – A pioneer with a touch of class" – biography and tributes