వత్సవాయి (ఇంటిపేరు)
Appearance
వత్సవాయి తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.
చరిత్ర
[మార్చు]కాకతి గణపతిదేవ చక్రవర్తి కాలంలో సామంతునిగా ఉండి మహాదాతగా సుప్రఖ్యాతి పొందిన సాగి పోతరాజుకు మాచరాజు అనే సోదరుడు ఉండేవాడు. మాచరాజు కుమారుడు ఎరపోతరాజు ప్రతాపరుద్ర చక్రవర్తి సేనానుల్లో ఒకనిగా ఉండి మహమ్మదీయులతో జరిగిన యుద్ధాల్లో మరణించారు. అతని కుమారుల్లో తెలుగు రాజు రేకపల్లి దుర్గాన్ని, రామరాజు వత్సవాయి దుర్గాన్ని మహమ్మదీయ పాలనకు లోబడి కొంతకాలం రేచర్ల సింగమనాయుడు వంటి తిరుగుబాటు దారులతో పోరాడుతూండేవారు. వీరిలో సాగి రామరాజు వత్సవాయి కోటను పరిపాలించడంతో వారి తదనంతరకాలంలో వాళ్ళ ఇంటిపేరు సాగి నుంచి వత్సవాయిగా మారింది.[1] ఈ వివరాలన్నీ రామరాజుకు అంకితంగా వ్రాసిన రామవిలాసంలో ఉన్నాయి.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- పెద్దాపురం, తుని వంటి సంస్థానాలను పరిపాలించిన పరిపాలకుల్లో వత్సవాయి వంశీకులున్నారు.[1]
- వత్సవాయి వేంకటనీలాద్రిరాజు (జ: 1881 - మ: 1939) క్షత్రియునిగా జన్మించిన ప్రముఖ కవి, శతావధాని, విమర్శకుడు.
- రాయజగపతి వర్మ గారు వత్సవాయ వంశస్తుల దత్తపుత్రుల కోవకి చెందినవారు.
- వత్సవాయి బుచ్చి సీతాయమ్మ పెద్దాపురం సంస్థానానికి చెందిన మహారాణి. ఈమె పెద్దాపురం సంస్థానాన్ని (1828 - 1833) మధ్యకాలంలో పరిపాలించిన శ్రీ వత్సవాయి రాజా రాయ జగపతి భార్య
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.