వత్సవాయ రాయజగపతి వర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాయజగపతి వర్మ గారు వత్సవాయ వంశస్తుల దత్తపుత్రుల కోవకి చెందినవారు.

సాహిత్యాభిలాష

[మార్చు]

ఈయన సామర్లకోటలో నివసించే వారు వీరికి చిన్నతనం నుండి సాహిత్యాభిలాష ఎక్కువ ఈయన తాత గారు రాజా రాయజగపతి రాజు గారి ద్వారా పెద్దాపుర సంస్థాన వైభవం గురించి తెలుసుకున్న క్షణం నుంచి పెద్దాపుర సంస్థాన చరిత్రమును ఎలా అయినా ప్రచురించాలని సంకల్పించుకొని అనేక వ్యయ ప్రయాసలకోర్చి చామర్లకోట, కిమ్మూరు కైఫీయతులను సంపాదించి మద్రాసు లిఖిత పుస్తక భాండాగారంలో కొంత సమాచారం అప్పటి గుంటూరు డిప్యుటీ కలక్టర్, ఆంధ్ర సాహిత్య పరిషత్ కార్య నిర్వాహక అద్యక్షులు అయినటువంటి బ్రహ్మర్షి జయంతి రామయ్య పంతులు, మహానుబావుల వద్ద మరికొంత సమాచారం సేకరించి చివరకు కృతకృత్యులయ్యారు.[1]

రాజా రాయ జగపతి గారు (1797 - 1804) రెండవ భార్య అయిన మహారాణీ బుచ్చి సీతాయమ్మ (1828 - 1833) గారికి సంతానం లేకపోవడంతో కోటగండ్రేడు గ్రామనివాశి-తన మేనత్త మనుమడు అయిన శ్రీ వత్సవాయి నరసరాజు గారి పుత్రుడు శ్రీ వెంకట జగపతి రాజు గారిని తమ సంరక్షణలో పెంచుకున్నారు ఆ వంశక్రమానికి చెందిన వారే రాయజగపతి వర్మ గారు.

ఆంధ్రగీర్వాణభాషాకోవిదులును
బహుశాస్త్రవిశారదులును
ఉభయభాషాకవులును
వైఘానసధర్మచంద్రికాది గ్రంథకర్తలును
శ్రీరామభక్తులును,
అస్మదాథ్యాత్మిక గురువరేణ్యులు అయిన శ్రీ రాజా రాయజగపతి రాజు గారు వీరి తాత గారు (గమనిక : రాజ్యపాలన చేయలేదు)[2]

వత్సవాయ రాయజగపతి వర్మ గారి తండ్రి శ్రీ రాజా నారాయణ జగపతి రాజు గారు

రాయ జగపతి వర్మ గారు ప్రసిద్ధ గ్రంథ పరిశోధకులు అనేక చారిత్రిక ఆధారాలను పరిశీలించి "పెద్దాపుర సంస్థాన చరిత్రము"ను ప్రచురించారు దీనిని మనోరమా ముద్రాక్షరశాల, రాజమహేంద్రవరంలో 1915లో రెండవసారి ముద్రించారు. దీనిలో పెద్దాపుర సంస్థానం యొక్క చరిత్ర విశదీకరించారు.

పద్మనాభ యుద్ధం, ఏనుగు లక్ష్మణ కవి రచించిన రామవిలాసం వంటి చారిత్రిక కావ్యాలను పరిశీలించి సంపాదించి ముద్రించారు, చామర్ల కోట కైఫీయతును సంపాదించి ప్రకటించారు. చిన్ని చిన్ని కదల సంపుటంగా రచించిన ఆంధ్రదేశ కథలు ఆంధ్రరాష్ట్రము నుంచి అన్న ఉపశీర్షిక బహుళ ప్రజాదరణ పొందింది.[3]

వత్సవాయి రాయ జగపతి వర్మ గారి రచనలు

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్ర సంస్థానములు - సాహిత్య పోషణము - డా . తూమాటి దొప్పన్న - పేజి 275-276
  2. పెద్దాపుర సంస్థాన చరిత్రము పేజీ నం 91
  3. ఆంధ్ర సంస్థానములు - సాహిత్యపోషణము, డా . తూమాటి దొప్పన్న పేజీ 275-276