వర్గం చర్చ:భారతదేశం బలహీన వర్గాలు కేంద్రీకృతమైన జిల్లాలు
ఈ వర్గం లోని పేజీలను ఏ ప్రాతిపదిక మీద ఇందులోకి చేర్చాలో తెలియడం లేదు. పేజీ పాఠ్యంలో ఏమైనా ఉందా అనేదాని కోసం నేను కొన్ని పేజీలను చూసాను. అందుకు సంబంధించిన వివరాలు ఏమీ కనబడలేదు. ఉదాహరణలు గజపతి జిల్లా - ఇది వెనకబడిన జిల్లా (దేశంలో వెనుకబడిన 250 జిల్లాల్లో ఇదొకటి) అని ఉంది గానీ, బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్న జిల్లా అని లేదందులో. గుమ్లా కూడా అంతే. బహ్‌రైచ్, దర్భంగా పేజీలు కూడా అంతే. దీన్ని బట్టి చూస్తే ఈ పేజీలకు ఈ వర్గం సరికాదనిపిస్తోంది. ఈ పేజీలను వర్గం:భారతదేశం లోని వెనుకబడిన జిల్లాలు అనే వర్గం లోకి చేరిస్తే సముచితంగా ఉంటుంది. వాడుకరులు పరిశిలించి అభిప్రాయాలు చెప్పాలని కోరుతున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 07:21, 6 నవంబర్ 2020 (UTC)
వర్గం:భారతదేశం బలహీన వర్గాలు కేంద్రీకృతమైన జిల్లాలు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. వర్గం:భారతదేశం బలహీన వర్గాలు కేంద్రీకృతమైన జిల్లాలు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.