వర్గం చర్చ:Wikipedia pages with incorrect protection templates

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ మూసల్లోని సమస్య[మార్చు]

ఏదైనా పేజీని సంరక్షించాక, ఆ సంరక్షణ గురించి అందరికీ తెలిసేందుకు గాను, సంరక్షణ మూసలు పెడతాం. ఈ పేజీని సంరక్షించారు అంటూ ఒక సందేశాన్ని ఆయా పేజీల్లో చూపిస్తుంది. కానీ, అసలు సంరక్షణ చెయ్యని పేజీల్లో కూడా ఈ మూసలు పెడితే, సాఫ్టువేరు ఆ పేజీల్లో ఆ మూస సందేశాన్ని చూపించదు- ఎందుకంటే పేజీని అసలు సంరక్షణే చెయ్యలేదుగా. నేను ఈ వర్గం లోని కొన్ని మూసలను గమనిస్తే, వాటిని అసలు సంరక్షణే చెయ్యలేదు; కానీ పేజీల్లో మాత్రం సంరక్షణ మూస ఉంది. బహుశా ఈ వర్గం లోని చాలా పేజీలు ఇలాంటివే అయి ఉండవచ్చు.

ఇంగ్లీషు వికీ నుండి మూసను దిగుమతి చేసుకున్నపుడు మూస పాఠ్యమంతా దిగుమతి వుతుందిగానీ, బహుశా సంరక్షణ స్థాయి దిగుమతి కాదు గామోసు. బహుశా అందుకే ఈ సమస్య వచ్చి ఉంటుంది. దిగుమతి చేసుకునే వారు గమనించవలసినది. దిగుమతి చేసుకున్నాక, మూసను సంరక్షించాలి లేదా అందులో సంరక్షణ మూస ఉంటే దాన్ని తీసెయ్యాలి. __చదువరి (చర్చరచనలు) 02:56, 4 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]