వలిమై
వలిమై | |
---|---|
దర్శకత్వం | హెచ్. వినోద్ |
రచన | హెచ్. వినోద్ |
నిర్మాత | బోనీ కపూర్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | నీరవ్ షా |
కూర్పు | విజయ్ వెల్ కుట్టి |
సంగీతం | బ్యాక్‌గ్రౌండ్ సంగీతం: జిబ్రాన్ పాటలు: యువన్ శంకర్ రాజా |
నిర్మాణ సంస్థలు | జీ స్టూడియోస్ బేవ్యూ ప్రాజెక్ట్స్ |
పంపిణీదార్లు | ఐవీవై ప్రొడక్షన్స్ (గోపీచంద్ ఇనుమూరి) |
విడుదల తేదీ | 24 ఫిబ్రవరి 2022 |
సినిమా నిడివి | 179 నిముషాలు 187 నిముషాలు (డెలిటెడ్ సీన్స్)[1] |
దేశం | భారతదేశం |
భాషలు |
|
బడ్జెట్ | 150 కోట్లు |
వలిమై 2022లో విడుదలైన పాన్ ఇండియా సినిమా. జీ స్టూడియోస్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్‌పై బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో ఇనుమూరి గోపీచంద్ విడుదల చేయగా హెచ్. వినోద్ దర్శకత్వం వహించాడు. అజిత్ కుమార్, కార్తికేయ, హుమా ఖురేషి, సుమిత్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 13న విడుదల కావాల్సిన ఉండగా కరోనా కారణంగా వాయిదా పడి ఫిబ్రవరి 24న విడుదల చేసి, ‘జీ-5’ ఓటీటీ లో మార్చి 25 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]
కథ
[మార్చు]విశాఖ నగరంలో వరుసగా నేరాలు (హత్యలు, చైన్ స్నాచింగ్స్, డ్రగ్స్ దందా), యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారతారు. ప్రభుత్వం వీటిని ఆపడానికి ఏసీపీ అర్జున్ కుమార్ (అజిత్) ని విజయవాడ నుంచి విశాఖకు బదిలీ చేస్తారు. విశాఖలో నేరాలు అన్నిటికీ ఓ బైకర్స్ గ్యాంగ్ కారణం అని అర్జున్ తెలుసుకుంటాడు. ఆబైక్ గ్యాంగ్ మాఫియాని నరేన్ (కార్తికేయ) ను అర్జున్ ఎలా అడ్డుకున్నాడు? అనేదే మిగతా సినిమా కథ.[3][4]
నటీనటులు
[మార్చు]- అజిత్ కుమార్[5]
- కార్తికేయ[6]
- హుమా ఖురేషి
- వైష్ణవి చైతన్య
- సుమిత్ర
- బని జె
- రాజ్ అయ్యప్ప
- చైత్ర రెడ్డి
- పుగాస్హ్
- యోగి బాబు
- ధృవన్
- దినేష్ ప్రభాకర్
- పెర్లే మానే
- సెల్వ
- జి.ఎం. సుందర్
- అచ్యుత్ కుమార్
- పావెల్ నవగీతన్
- కార్తీక్ రాజ్
- గుర్బానీ జడ్జ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: జీ స్టూడియోస్ , బేవ్యూ ప్రాజెక్ట్స్
- నిర్మాత: బోనీ కపూర్[7]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:హెచ్. వినోద్
- సంగీతం: యువన్ శంకర్ రాజా
- సినిమాటోగ్రఫీ:నీరవ్ షా
మూలాలు
[మార్చు]- ↑ "Valimai – Certificate Detail". Central Board of Film Certification. 17 January 2022. Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
- ↑ Eenadu (27 March 2022). "ఓటీటీలో 'వలిమై'రికార్డు". Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.
- ↑ Eenadu (24 February 2022). "రివ్యూ: వలిమై". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
- ↑ Namasthe Telangana (24 February 2022). "'వలిమై' రివ్యూ". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
- ↑ HMTV (12 July 2021). "వైరలౌతోన్న అజిత్ 'వాలిమై' ఫస్ట్ లుక్". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
- ↑ Namasthe Telangana (19 February 2022). "ఆ లెక్కల్ని పట్టించుకోను!". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
- ↑ Eenadu (23 February 2022). "'వలిమై' కొత్త అనుభూతిని పంచుతుంది". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.