వల్లీ దేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వల్లీ దేవి, హిందూ దేవత. సుబ్రహ్మణ్యస్వామి వారి భార్య. ఆమె  విష్ణువులక్ష్మీదేవిల కుమార్తె అని కూడా అంటారు.తమిళం: வள்ளி

వల్లీ దేవిని తమిళనాడుకేరళ రాష్ట్రాల్లోని గిరిజన ప్రజలు ఎక్కువగా  పూజిస్తారు. విదేశాల్లోనూ వల్లీదేవిని కొలుస్తారు. శ్రీలంకలోని రోడియా, వెడ్డా జాతులకు చెందిన ప్రజలు కూడా వల్లీదేవి ఆరాధన చేస్తుంటారు.

కాట్పాడీ మండలంలోని వల్లీమలై గ్రామంలో ఉండే సరస్సులోని నీటితోనే వల్లీ దేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దప్పిక తీర్చిందని ప్రతీతి. ఇప్పటికీ ఆ తటాకాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు భక్తులు. ఈ సరస్సు ఆరుబయటే ఉన్నా, సూర్యకిరణాలు చేరకపోవడం విశేషం. వెడ్డా జాతి ప్రజలు ఎక్కువగా నివాసం ఉండే శ్రీలంకలోని కాట్రగామా ప్రాంతంలో వల్లీ దేవి గుడి ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఇక్కడి ఒక కొండపై ఉంది.

జననం

[మార్చు]

పూర్వకాలంలో దక్షిణ భారతదేశంలోని పర్వతాలను వివిధ గిరిజన  తెగలు పాలించేవి. కురవర్ తెగకు రాజైన నంబి రాజన్, ఆమె భార్య పర్వతాలకు దేవుడైన మురుగన్ ను ఆడ సంతానం కావలని ప్రార్ధిస్తారు.  దాని ఫలితంగా వారికి వల్లి అనే ఆడపిల్ల దొరుకుతుంది. ఆ గిరిజన తెగకు యువరాణిగా పెరుగుతుంది ఆమె. కొన్ని పురాణాల ప్రకారం ఒక సాధువు చూపు ఒక జింకపై ప్రసరించడంతో వల్లీదేవి జన్మించింది.

వల్లీదేవి పూర్వ జన్మలో దేవసేన(సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేరే భార్య) తోబుట్టువు. వీరిద్దరూ విష్ణువులక్ష్మీదేవిల కుమార్తెలు. ఆ జన్మలో వారిద్దరూ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని వివాహం చేసుకునేందుకు ఘోర తపస్సు చేస్తారు. వారిని తరువాతి జన్మలో పెళ్ళి చేసుకుంటానని స్వామి వరం ఇస్తాడు. ఆమె చిన్నతనంలో దేవ ఋషి నారదుడు, తండ్రి నంబి రాజన్ తో వల్లీదేవి మురుగన్ భార్య అని చెప్తాడు.

శ్రీలంక పురాణాల ప్రకారం కటరగమా ప్రదేశంలో వెడ్డా తెగలో వల్లీదేవి కథ జరిగింది. అయితే దక్షిణభారత పురాణాలు మాత్రం  సురపద్మన్ తో యుద్ధ సమయంలో తన సేనలను నిలిపిన ప్రదేశం కటరగమా ప్రదేశం అని చెబుతోంది.

దైవత్వ ప్రకటన

[మార్చు]
ఉభయ దేవేరులు దేవసేన(చిత్రంలో కుడి పక్క ఉన్న అమ్మవారు), వల్లీదేవి(ఎడమ వైపు)లతో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి.

మూలాలు

[మార్చు]