వసంత నాగేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వసంత నాగేశ్వరరావు మాజీ మంత్రి, ఆప్కాబ్ ఛైర్మన్, జై ఆంధ్ర ఉద్యమ నాయకులు.కృష్ణా జిల్లా నందిగామ వాస్తవ్యులు. పిళ్ళా వెంకటేశ్వరరావు, ఎల్‌. జైబాబు, బేతు రామ్మోహన రావు, ఎస్‌ఎస్‌సి బోస్‌, జి.వి.రాంప్రసాద్‌, సుంకర కృష్ణమూర్తి, చేకూరి శ్యాంసుందర్ రావు, నూతక్కి వెంకట సత్యనారాయణ తదితర అనుచరులతో కలిసి ఈయన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతున్నారు.

భావాలు[మార్చు]

  • ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటినుండి ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలు దోపిడీకి గురయ్యాయి.ఇప్పటికైనా విడిపోతేనే ఆంధ్రా ప్రాంతం అభివృద్ధి సాధిస్తుంది.ఆ దిశగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.ఆంధ్ర తెలంగాణా రాష్ట్రాల విభజన బిల్లు పార్లమెంట్‌లో పెట్టాలి.విభజించి ఆంధ్ర ప్రాంతానికి లక్ష కోట్ల నిధులు ఇవ్వాలి.డిసెంబరు 9న చిదంబరం చేసిన ప్రకటనకు కట్టుబడాలి.
  • రాష్ట్రాన్ని విభజిస్తే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలి.సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే వరకు పోరాటం ఆగదు.ఏ పార్టీ అయినా ప్రజల ఆకాంక్షలకు తలొగ్గాల్సిందే. రాష్ట్రాన్ని విభజించాలని తెలంగాణ ప్రజలకంటే ఎక్కువగా సీమాంధ్ర ప్రజలు సుముఖంగా ఉన్నారు.హైదరాబాద్ లో ఆస్తులు కూడబెట్టుకున్న నాయకులే తమ స్వార్ధం కోసం విభజనకు అడ్డుపడుతున్నారు.విభజన జరిగితే సముద్ర తీరం, గ్యాస్ నిక్షేపాలు ఉన్న ఆంధ్ర ప్రాంతం మంచిగా అభివృద్ధి చెందుతుంది.సమైక్య ఉద్యమం బలంగా ఉందని కేంద్రానికి తప్పుడు సంకేతాలు పంపుతున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన వ్యవహారం బయటపడుతుందని నందిగామలో జరగాల్సిన ప్రత్యేకాంధ్ర మహాసభను అడ్డుకున్నాడు.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ మంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుండే ఎన్నికయ్యారు. కానీ రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆంధ్రా పాలకుల వల్ల రాయలసీమ అభివృద్ధి కాలేదని అంటున్నారు. ఇది ఆయన అవివేకానికి నిదర్శనం. తన స్వార్ధం కోసం బైరెడ్డి ఆంధ్రా ప్రజలను నయవంచకులుగా చిత్రీకరించడం మానుకోవాలి.మంచితనం, గౌరవం ఇచ్చి పుచ్చుకొనే సంస్కృతి గల ఆంధ్ర ప్రజల సహనాన్ని పరీక్షించవద్దు.తెలంగాణా, రాయలసీమ విడిపోతే ఆంధ్ర ప్రజలు అభివృద్ధి చెందుతారు.రని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే తెలంగాణతో పాటు అవసరమైతే రాయలసీమ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి.ఏ నాయకులైనా ఆంధ్రా ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడితే సహించేది లేదు.అసలు బైరెడ్డి చేసే ఆందోళన సమైక్య వాదులకు బలంగా ఉంది.తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం సిద్దమవుతున్న తరుణంలో ప్రత్యేక రాయలసీమ అంటూ అనవసర వాదన తెస్తున్నాడు.ప్రత్యేక రాష్ట్రం కోరుకునే హక్కు అందరికీ ఉంటుంది.దానికోసం ఇతరులను కించపరచొద్దు.
  • "నడిబజారులో నా ప్రాణాలు తీసినా నేను జైఆంధ్రా వేర్పాటు డిమాండ్‌కు కట్టుబడివుంటా. హైదారాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్త్తించాలి.విజయవాడ- మంగళగిరి-గుంటూరుల మధ్య కొత్త్త ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం జరగాలి.సమైక్యాంధ్రకు కట్ట్టుబడి వుండాలన్న మాపార్ట్టీ నిర్ణయాన్ని నేను తప్పుపట్టను. అయితే ఒక పౌరుషం కలిగిన ఆంధ్రునిగా నేను అందుకు వ్యతిరేకం.నేను 1972లో అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహరావు ముల్కీని అమలుచేస్త్తే అందుకు వ్యతిరేకంగా ప్రత్యేకాంధ్ర రాష్ట్రం డిమాండ్‌తో ఉద్యమించాను.అప్పటి నుంచి అదే స్టాండ్‌పై ఉన్నాను.పార్టీ నిర్ణయం ఏదైనా నా స్టాండ్ నాదే.ఈ విషయంలో నన్ను కత్త్తులు,పలుగులు,ఈటెలతోపొడిచినా, నడిబజారులో నరుకుతానన్నా వెనక్కి తగ్గ్గేది లేదు.సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నేను ప్రతిఘటించను.అయితే ఆంధ్రులు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి.ఎప్పుడైనా విడిపోక తప్పదు.రాష్ట్రం ఎప్పుడో విడిపోయి ఉంటే సీమాంధ్ర ఎంతో అభివృద్ధిచెంది ఉండేది." (ఈనాడు, వార్త, సాక్షి 12.8.2013)
* మొదట 1970లో ఐతవరం సర్పంచిగా తన రాజకీయ జీవితం ప్రారంభించిన వీరు, 1981 లో నందిగామ సమితి అధ్యక్షులుగా ఎన్నికైనారు. 1983, 1985 లలో రెండుసార్లు 

నందిగామ శాసనసభ్యుడిగా ఎన్నికైనారు. మధ్యతరహా నీటిపారుదల శాఖ, హోం శాఖ, వ్యవసాయశాఖా మంత్రిగా పనిచేశారు. 2005లో తన స్వంతగ్రామంలోని సొసైటీనుండి ఎన్నికై కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మనుగా, జాతీయ స్థాయిలో నాప్కాబ్ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. ఇటీవల ఐతవరం సొసైటీ అధ్యక్షిడిగా తిరిగి ఎన్నికైనారు. (ఈనాడు కృష్ణా 12-7-2013.8వ పేజీ)