వసుంధర రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుసమల్ల వసుంధర రెడ్డి
వసుంధర రెడ్డి


వ్యక్తిగత వివరాలు

జననం 1964
నిజామాబాద్, తెలంగాణ రాష్ట్రం
జాతీయత భారతియురాలు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు బూసమల్ల శ్రీనివాస్‌, డోనా
సంతానం ఒక కూతురు
మతం క్రైస్తవ

బుసమల్ల వసుంధర రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు, తెలంగాణ ఉద్యమకారిణి.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

బుసమల్ల వసుంధర 1964లో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్‌ లో బూసమల్ల శ్రీనివాస్‌, డోనా దంపతులకు జన్మించింది. ఆమె హోటల్‌ మేనేజ్‌మెంట్‌ లో డిగ్రీ చేసింది.

రాజకీయ జీవితం

[మార్చు]

బుసమల్ల వసుంధర రాజకీయాల్లోకి రాకముందు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్స్ పూర్తి చేసి దుబాయికి వెళ్లి అక్కడ కొంతకాలం పని చేసింది. వసుంధర చిన్నప్పటి నుంచే సామాజిక సమస్యలపై స్పందించే గుణం కలిగిన ఆమె తెలంగాణ తెలంగాణ మలిదశ ఉద్యమ పట్ల ఆకర్షితురాలై 2001లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో 2001లో హైదరాబాద్ కి తిరిగి వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంది. వసుంధర తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్, నాయిని నర్సింహారెడ్డి, మహమూద్ అలీ వంటి సీనియర్‌ నాయకులతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొంది. ఆమె ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే తరువాత 2018లో టీఆర్‌ఎస్‌ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరింది.

మరణం

[మార్చు]

బుసమల్ల వసుంధర 2021 ఫిబ్రవరిలో ఆమెకు క్యాన్సర్‌ సోకి నట్టు నిర్థారణ కావడంత్థ ఆమె నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స అందుకుంది, వ్యాధి తీవ్రత తగ్గినట్టేనని డాక్టర్లు చెప్పడంతో తన సోదరుడి వద్ద ఉంది. ఈ క్రమంలో ఆగష్టు లో వెన్నుపూసకు క్యాన్సర్‌ వ్యాపించి పరిస్థితి విషమించగా నిమ్స్ లో చికిత్స తీసుకుంది, ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన ప్రభుత్వం ఆమెకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి సహాయం అందించింది. ఆమె క్యాన్సర్‌ తో పోరాడుతూ 28 డిసెంబర్ 2021న మరణించింది. ఆమె అంత్యక్రియలు 29 డిసెంబర్ 2021న 11గంటలకు కార్ఖాన సీఎ్‌సఐ సమాధుల స్థలంలో జరిగాయి.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (29 December 2021). "టీఆర్‌ఎస్‌ నాయకురాలు వసుంధర కన్నుమూత". Archived from the original on 7 January 2022. Retrieved 7 January 2022.
  2. Andhrajyothy (29 December 2021). "తెలంగాణ ఉద్యమకారిణి వసుంధర కన్నుమూత". Archived from the original on 7 January 2022. Retrieved 7 January 2022.
  3. Nava Telangana (29 December 2021). "టీఆర్‌ఎస్‌ నాయకురాలు వసుంధర కన్నుమూత". Archived from the original on 7 January 2022. Retrieved 7 January 2022.