Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

వాడుకరి:Chakrapani Nettem

వికీపీడియా నుండి

తెలుగు సభ్యులకు నా నమస్కారాలు,


నేను అమెరికాకు 1998లో వచ్చాను. అప్పుడు నా దృష్ఠి ఏదో నాలుగు రాళ్ళు వెనకేసుకుని వెనక్కు వెళ్ళాలని కాని యిప్పుడు అది మార్ఛుకున్నాను. ప్రస్తుతము ఆర్థికంగా వృద్ధి చెందటానికి వృత్తి చేసుకుంటూ, 2015 తరువాత సంఘ సేవ చేయటానికి పునాదులు వేసుకుంటున్నాను. దానిలో ఒక భాగమే ఈ పరిచయ కార్యము. నేను పుట్టిన ఊరు అనంతపురం, చదివినది బి.టెక్ (కంప్యూటర్స్) వృత్తి యస్.ఎ.పి (ఫైకొ). మీకు ఏ విదమైన సహాయము కావాలన్న నన్ను సంప్రదించవచ్చు.

నా గురించి

[మార్చు]

శ్రీ చక్రపాణి నెట్టెం గారు అనంతపురం వాస్తవ్యులు, వీరి తండ్రిగారు వెంకటరమణ తల్లిగారు వెంకటలక్ష్మి, తండ్రిగారు వృత్తిరిత్యా పంచాయతీరాజ్ లో జియాలజిస్టుగా సుప్రసిద్ధులు. శ్రీ చక్రపాణి గారు మహబూబ్ నగర్ నగరమున అక్షరాభ్యాసము చేసినారు. తరువాత అనంతపురం నందు, కర్నూలు లోని చిన్మయా మిషన్ స్కూల్, మాంటెసోరి స్కూల్ నందు చేశారు. అనంతపురం లోని గుడ్ షెప్పర్డ్ స్కూల్, ప్రభుత్వ బాలుర కళాశాల యందు (యం.పి.సి) చేశారు. ఈ కళాశాలలో చదివే రోజులలో కళాశాల ఎన్నికలల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తరువాత నెల్లూరు వెళ్ళి కోచింగుకు వెళ్ళారు, అక్కడ చదువుకంటే సినిమాలకు బాగా ఆకర్షితులైనారు. అటునుండి తుముకూరు వెళ్ళి బి.ఇ (కంప్యూటర్స్) కష్టపడి చదివారు. తరువాత బెంగళూరు సమీపాన పాఠశాల యందు భోదనావృత్తి చేశారు, చిన్నపిల్లలను తన భోదనాశక్తితో బాగా ఆకట్టుకున్నారు. ఎప్పటికైనా బాగా నచ్చిన సేవ ఈ భోదనావృత్తేనని గ్రహించారు. అటునుండి వ్యయసాయము చేయాలని తలచారు. వ్యయసాయ అప్పుకోసము బ్యాంకుల చుట్టు, రిజిష్ట్రేషను కార్యాలయము చుట్టు తిరిగి తిరిగి, అక్కడ వున్న అవినీతి కళ్ళార చూచి విసుగుచెందారు, ఇంత చదువు చదివిన వాళ్ళకే ఈ వ్యవస్థ యిన్ని యిబ్బందులు పెడుతుంటె మరి చదువు లేని వ్యవసాయదారులకు ఎన్ని ఇక్కట్లు పెడుతున్నారో కదా! ఇక వ్యవసాయ పదకానికి తిలోదకాలు యిచ్చి, చదువుకున్న చదువుకు ఏదో ఒక ఉద్యోగము చేయుటకు పూనుకున్నారు. రాజదాని హైదరాబాదు చేరుకున్నారు, అక్కడ ఇక్కట్లు తప్పలేదు విసిగిపోయి ఆఖరి ప్రయత్నంగా బెంగళూరు చేరి ప్రయత్నించారు. ఎట్టకేలకు పూణెలో ఉద్యోగము సంపాదించగలిగారు. మెదటి సారిగా జీవితము ఎంత మధురముగా వుంటుందో చవిచూశారు. ఆరు మాసముల తరువాత సింగపూర్కు వెళ్ళి అక్కడ మనుషులు ఎంత కష్టపడి పనిచేస్తారో చూసి అలాగే పనిచేసి మ్యానేజర్స్ చేత మెప్పొంది వృత్తిరిత్యా ఆనందించారు. అక్కడినుండి తిరిగి వచ్చి కెనడాకు వెళ్ళి వుండలేక అమెరికాకు మళ్ళారు. ప్రస్తుతము ఇంతే సంగతులు.