Jump to content

వాడుకరి:Svpnikhil/వికీపీడియా అంటే ఏమిటి? విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది?

వికీపీడియా నుండి

జనవరి 15 2001, సరిగ్గా 13 ఏళ్ల 1 నెల క్రితం అంతర్జాలంలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. వికీపీడియా ఒక స్వేచ్చా విజ్ఞాన సర్వస్వం. ప్రపంచ వ్యాప్తంగా 286 భాషల్లో లభ్యమౌతున్న ఒక సంపూర్ణ వివరణాత్మక , విశ్లేషనాత్మక వెబ్ సైట్. జిమ్మీ వేల్స్ , లారీ సాంగర్ అనే ఇద్దరు ఔత్సాహికులచే స్థాపించబడింది. విద్యా, వైద్య, తత్వ, రాజకీయ, చరిత్ర, జీవ, క్రీడా, సంగీతం ఇలా ఎన్నో శాస్త్రాల గురించి విషయాలు తెలుసుకోవచ్చు.

చరిత్ర

[మార్చు]

వికీ అంటే హవాయి భాషలో క్విక్ అనగా తొందరగా అని అర్ధం. నుపీడియా అనేది దీని మాతృ సంస్థ. దాని అంతర్ధాన దశలో వికీ ఆవిర్భవించింది.

భేదం

[మార్చు]
వికీపీడియా ఇతర వెబ్ సైట్లు
ఒక విషయానికి సంబంధించిన వ్యాసం ఎవరైనా రాయవచ్చు వెబ్ సైట్ కి సంబంధించిన వ్యక్తి మాత్రమే రాయాలి
ఎన్నో అంశాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఒక సైటు కేవలం ఒకే అంశానికి ఉపయోగపడుతుంది.

ఉదా: సినిమాకి సంబందించిన దాంట్లో కేవలం ఆ విషయాలే ఉంటాయి.

ఒక కోత్త విషయం గురించి తెలిసిన వ్యక్తి ఎవరైనా రాయవచ్చు కేవలం ఆ సైటు పర్యవేక్షిస్తున్న వ్యక్తి మాత్రమే సవరించాలి.
అనవసర ప్రకటనలు ఉండవు. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు.
ఉచితంగా పనిచేస్తూ విరాళాల ద్వారా నడిచే సంస్థ కొంత రుసుము చెల్లించి వాడుకోవాలి.

ఉపయోగం

[మార్చు]

ఒక వ్యక్తి భారతదేశం గురించి తెలుసుకోవాలంటే గూగుల్ లొకి వెళ్లి ఇండియా అని టైపు చెయ్యగానే వివిధ రకాల వెబ్ సైట్లు వస్తాయి. ప్రతిది మరొక దానితో సంబంధం లేకుండా ఉంటుంది. భారతదేశం గురించి ఏదైనా కొత్త విషయం తెలిసిందంటే దాన్ని సవరించడానికి ఆ వ్యక్తి మాత్రమే చెయ్యాలి. ఒకవేళ అతనికి కుదరకపోతే ఆ వెబ్ సైట్ చూసిన వ్యక్తి తప్పుడు సమాచారం తెలుసుకుంటాడు. కాని వికిలో ఏదైనా కొత్త విషయం తెలియగానే దాని గురించి తెలిసిన వారెవరైనా క్షణాల్లో మార్పు చెయ్యవచ్చు.

విశిష్టత

[మార్చు]
  • ఇందులో ముఖ్యంగా కళలు సంస్కృతి సంప్రదాయాలు గురించి--30% ఉంది.
  • వ్యక్తుల జీవిత చరిత్ర గురించి --15%
  • భూగోళ, చరిత్ర , పర్యావరణ, సాంకేతిక రంగం మరియు మతం, ఆరోగ్యం గురించి వ్యాసాలు ఉంటాయి.

విద్యార్థులు-ఉపయోగం

[మార్చు]

ప్రస్తుతం విద్యార్థులు ఎన్నో పోటీ పరిక్షలకు సిద్హమౌతున్నారు. సివిల్స్ ,బ్యాంకు పరీక్షలు మొ"నగు వాటికి వర్తమానంసాలు , సాధారణ పరిజ్ఞానం సంబంధించి రాష్ట్రంలో ఎన్ని ఆనకట్టలు ఉన్నాయో తెలుసుకోవలనిపిస్తే ---ఆనకట్ట అని టైపు చెయ్యగానే 'అసలు ఆనకట్ట అంటే ఏంటి, ఆ పదం ఎలా పుట్టింది నుంచి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఆనకట్టల వరకు ప్రతి విషయం వస్తుంది'. ఇంకా శాస్త్ర, సాంకేతిక అంశాలకు సంబంధించి, ముఖ్యంగా శాస్త్రవేత్తల గురించి తెలుసుకోవచ్చు. ఒక రంగంలోని ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలనిపిస్తే దానితో పాటు ఆ రంగంలోని ఇతర వ్యక్తుల గురించి కూడా తెలుస్తుంది.

పురస్కారం

[మార్చు]
  • అంతర్జాల సైట్లకి పురస్కారం అందించే అలెక్సా అనే సంస్థ ఎక్కువ మంది వినియోగదార్లు ఉన్న 6వ సంస్థగా వికీని గుర్తించింది.
  • బ్రాండ్ ఛానల్ అనే సంస్థ నిర్వహించిన విశ్లేషణలో "2006 లో ఏ సంస్థ ఉత్పత్తి ప్రజల మీద అత్యంత ప్రభావం చూపింది " అనే ప్రశ్నకు సమాధానం గా 4 వ బహుమతితో సత్కరించింది.
  • హార్వర్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఒక పాఠ్యాంశo గా ప్రవేశ పెట్టింది.

ముగింపు

[మార్చు]

వికితో నా అనుభందం

[మార్చు]

నేను ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి తహతహలాడుతుంటాను. చరిత్ర, రాజ్యాంగ వ్యవస్థ గురించి, ప్రపంచ దేశాల గురించి ఎన్నో సరికొత్త అంశాల గురించి నేర్చుకున్నాను. ఎన్నో సవరణలు చేశాను, దానికి గుర్తుగా బార్న్ స్టార్ పతకంతో నన్ను సత్కరించింది.

దోషాలు

[మార్చు]

చాల మంది సరదాగా ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు రాస్తున్నారు, దీన్ని నియంత్రించాలి. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎంతోమందికి జ్ఞాన సముపార్జన అందించే ఇటువంటి సైట్లని మనం ఆదరించాలి.