వాడుకరి చర్చ:వివినమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వివినమూర్తి గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య (చర్చ, రచనలు)

గ్రామాల పేర్లు

[మార్చు]

వివినమూర్తి గారూ, గ్రామాల పేర్లు సరిద్ది తెలుగు వికీకి తోడ్పడుతున్నందుకు ధన్యవాదములు. వీటిని ఆంగ్లమునుండి పెద్దఎత్తున అనువాదము చేయటములో తప్పులు దొర్లినాయి. మీలా ఆయా గ్రామాలు తెల్సినవారు దిద్దితే బాగుంటుంది. --వైఙాసత్య 07:49, 23 నవంబర్ 2006 (UTC)

ప్రసిద్ధ రచయిత

[మార్చు]

వివినమూర్తి గారూ! మీ పరిచయం మీ సభ్యునిపేజీ లో ఇంకా రాసుకోలేదు; కుతూహలం కొద్దీ అడుగుతున్నాను.. ప్రసిద్ధ రచయిత వివినమూర్తి మీరేనా? __చదువరి (చర్చ, రచనలు) 08:08, 23 నవంబర్ 2006 (UTC)

అవును నేనే వివిన మూర్తి పేరుతో రాస్తుంటాను. నాదో ఆలోచన. తెలుగులో సమగ్రమైన నిఘంటువు రావలసి ఉంది. నా ఊహలలో దాని రూపం ఏంటంటే ఒక పదంకి వివిధ ప్రాంతాలలో ఉన్న మాండలికాలన్నీ ఒకేచోట లభించాలి. ఉదా- ఒళ్లు = పెయి (తెలంగాణా) శరీరము(సం)
మనం అందరం కలిసి తయారుచేసి అచ్చురూపంలో కూడా తేగలమా- మన తెలుగుని సంపన్నం చేసుకోగలమా మూర్తి
వివిన మూర్తి గారూ, మీలాంటి రచయితలు కూడా ఈ కృషిలో పాల్గొనడము మహద్భాగ్యము. మీరన్నట్ట్లు సరిగ్గా అలాంటి నిఘంటువు ప్రయత్నము తెలుగు విక్షనరీలో ప్రారంభించాము. అది ఇంకా అంత ఊపందుకోలేదు. వికిపీడియా, విక్షనరీలను అచ్చురూపములో తేవడానికి ఇబ్బందులేమీ లేవు --వైఙాసత్య 14:28, 1 డిసెంబర్ 2006 (UTC)
వివినమూర్తిగారూ! నమస్కారం. రచయితలు, జర్నలిస్టులు, ఉపాధ్యాయులు అంత ఉత్సాహంగా పాల్గొనడంలేదనే లోటు తెవికీలో బాగా ఉన్నది. వారు ముందుకొస్తే అద్భుతమైన ప్రగతి సాధ్యమని నా అభిప్రాయం. స్వాగతం. కాసుబాబు 16:57, 1 డిసెంబర్ 2006 (UTC)
కాసుబాబు గారూ వైఙాసత్య గారూ చదువరి గారూ !మీ విక్షనరీలో కూడా చేరాను. మీ ఈ ప్రయత్నాలు నాకు భవిష్యత్తు మీద అంతులేని ఆశ కలిగించాయి. మనుషులు తమ కష్టసుఖాలను, ఎరుకను కలబోసుకునే తత్వం నుంచే సమస్త శాస్త్రాలూ, సాహిత్యం, ప్రగతీ మొదలయాయి. ఈ వికీపీడియా అదే తత్వానికి ఆధునిక రూపం. పట్టు విడవకండి. మూర్తి
వివినమూర్తి గారూ, మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. మీవంటి వారు ఇక్కడ ఉండడమే సభ్యులకు ఉత్తేజానిస్తుంది. (చర్చా పేజీల్లో ఇలా సంతకం చెయ్యొచ్చు - ~~~~~. ఇలా ఐదు టిల్డె కారెక్టర్లు వరసగా రాస్తే మీ పేరూ, రాసిన సమయం ప్రింటవుతాయి.) __చదువరి (చర్చ, రచనలు) 05:13, 13 డిసెంబర్ 2006 (UTC)

తెలుగు వికీపీడియా ఆభివృద్ధికి సహకారం

[మార్చు]

వివినమూర్తి గారు, చాలా కాలం తరువాత మరల మీరు తెవికీలో క్రియాశీలం ఐనందులకు ఆనందంగా వుంది. బెంగుళూరులో తెలుగు వికీపీడియా సముదాయాన్ని బలపరచటంలో మీ సహకారము కోరుతున్నాను.--అర్జున 01:58, 21 సెప్టెంబర్ 2010 (UTC)