వాడుకరి చర్చ:సత్యసాయి కొవ్వలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్యసాయి కొవ్వలి గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. __చదువరి (చర్చ, రచనలు) 12:48, 3 నవంబర్ 2006 (UTC)

వికీని నేర్చుకోవడం

[మార్చు]

సత్యసాయి గారూ! నా చర్చా పేజీలో మీరు రాసింది చూసాను. మీ మెప్పుదలకు ధన్యవాదాలు. కొత్తలో వికీ కాస్త అయోమయంగా ఉండడం సహజమే! ముందుగా మీరు Wikipedia:5 నిమిషాల్లో వికీ చదవండి. ఆపై ప్రయోగశాలలో ప్రయోగాలు చెయ్యండి. ప్రయోగశాల అంటే మరేం లేదు.. మీ సభ్యుని పేజీయే! కాకపోతే ప్రయోగాల కోసమని ఈ పేజీకి కొన్ని అనుబంధ పేజీలు తయారు చేసుకుని ఆ పేజీల్లో ప్రయోగాలు చేస్తారన్నమాట!

ఉదాహరణకు సభ్యుడు:Chaduvari.. ఇది నా సభ్యుని పేజీ. పట్టికలపై ప్రయోగాలు చేసేందుకు నేనీ పేజీకి ఒక అనుబంధ పేజీని ఇలా తయారు చేస్తాను..సభ్యుడు:Chaduvari/పట్టికలు. ఈ రకంగా మీరెన్ని అనుబంధ పేజీలు కావాలంటే అన్ని పేజీలు తయారు చేసుకోవచ్చు. మీ సభ్యుని పేజీ ఇలా ఉంటుంది. సభ్యుడు:సత్యసాయి కొవ్వలి (ప్రస్తుతం పేజీలో ఏమీ లేదు కాబట్టి ఈ లింకు నొక్కగానే దాని దిద్దుబాటు పేజీకి పోతుంది). దీనికి అనుబంధంగా ప్రయోగశాల1 అనే పేజీ తయారు చెయ్యాలంటే, ఇలా రాయాలి.. సభ్యుడు:సత్యసాయి కొవ్వలి/ప్రయోగశాల1. అంతే!

ఈ విషయాల్లో మీకేమైనా అనుమానాలుంటే నా చర్చా పేజీలో తప్పక రాయండి. లేదా మీరు Wikipedia:సహాయ కేంద్రంలో కూడా రాయవచ్చు. ప్రశ్న అడిగేందుకు మొహమాటమేమీ పడకండి.. మీ ప్రశ్నలకు సమాధానాలిచేందుకు సీనియరు సభ్యులందరూ సిద్ధంగా ఉంటారు. __చదువరి (చర్చ, రచనలు) 02:49, 9 నవంబర్ 2006 (UTC)