వాడుకరి చర్చ:59.90.160.86

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

By 59.90.160.86 సద్దాం హుస్సేన్ చేసిన మంచి పనుల గురించి నేను వ్రాస్తే ఎడిట్ చేసి, కేవలం అతనిలోని నెగటివ్ పాయింట్లని ఎత్తి చూపించారు. సద్దాం హుస్సేన్ ఇస్లామిక్ ఉగ్రవాది కాదు. అతనికి అరబ్ క్రైస్తవుల సప్పోర్ట్ కూడా ఉంది. అతని కుడి భుజం మిఖాయిల్ యూహాన్నా కూడా క్రైస్తవుడే.

మీరు వివాదాస్పద విషయాలు రాస్తున్నారు. కాబట్టి మీరు ఒక ఖాతా సృష్టించుకోండి. సభ్యులతో సంభాషించండి. సభ్యులతో చర్చించకుండా మార్పులు చేస్తూ పోతే ఈ ఐపి ఆడ్రసు మీద నిషేధం విదించాల్సి వస్తుంది. రవిచంద్ర(చర్చ) 05:04, 4 డిసెంబర్ 2008 (UTC)
సద్దాం హుస్సేన్ వ్యాసంలో సద్దాం ఉగ్రవాది అని ఎక్కడ వ్రాసింది? ఎందుకిలా బుకాయిస్తున్నారు? --వైజాసత్య 05:58, 5 డిసెంబర్ 2008 (UTC)

సద్దాం గారు మీకు ఉగ్రవాది లాగ కనిపించక పోతే మీకు అంత భయం ఎందుకు?

ప్రాపంగాడా వ్యాసాలు[మార్చు]

మీ ప్రాపంగాడా వ్యాఖ్యలు వ్రాయటానికి ఇది సరైన ప్రదేశం. ఏదో ఒక బ్లాగు తెరుచుకొని అందులో వ్రాసుకుంటే మీ అభిప్రాయాలతో ఏకీభవించేవాళ్ళు వచ్చి చదువుతారు. ఇక్కడ విమర్శనాత్మక వ్యాసాలు ఉండకూడని కాదు. ఈ ఉదాహారణ కాస్త పచ్చిగా ఉండవచ్చుగానీ అంతకంటె మీకు సరిగ్గా ఎలా చెప్పాలో అర్ధం కావట్లేదు. ఉదాహారణకు నెహ్రూ మీద వ్యాసం ప్రారంభిస్తే నెహ్రూ ఆవిడతో తిరిగాడు, ఈవిడతో కులికాడు వ్రాయటం ఎంత సబబు. అవి నిజాలు కావచ్చు. నెహ్రు మొదటి ప్రధానమంత్రి, స్వాతంత్ర సమరయూధుడు అని ఆయన పరిపాలన ఎలా సాగింది వంటి విషయాలు వ్రాసి ఏదో మూలన వ్యక్తిగత జీవితమంటూ ఒక ముక్క వ్రాస్తారు. మసాలా నినాదాలే వ్యాసానికి ముఖ్యమైన పాయింట్లలాగా వ్రాస్తే ఎలా. వికీపీడియా వ్యాసాలు కాలేజీ గోడల మీద వ్రాతలు కాదు. --వైజాసత్య 05:17, 4 డిసెంబర్ 2008 (UTC)

  • శ్రీకాకుళం జిల్లా గ్రామాల గురించి మీకు తెలిసిన సమాచారం వ్రాయండి. పుణ్యక్షేత్రాలు, చర్చిలు, మసీదులు, నదులు, వ్యాపార వైద్య సంబంధిత వివరాలు తెలియజేయండి.ధన్యవాదాలు.Rajasekhar1961 06:47, 4 డిసెంబర్ 2008 (UTC)

విన్నపం[మార్చు]

విశాఖ వాసి గారూ! దయచేసి వివాదాస్పద వ్యాసాలు రాయడం మాని, మంచి విజ్ఞానదాయకమైన వ్యాసాలు రాసేందుకు ప్రయత్నించండి. అసలే తెలుగు వికీలో చురుగ్గా ఉన్న సభ్యుల సంఖ్య తక్కువ. వారిని వివాదాల్లోకి లాగి సమయం వృధా చేయకండి. మీరు రాయాలంటే బోలెడన్ని విషయాలున్నాయి. రవిచంద్ర(చర్చ) 05:15, 5 డిసెంబర్ 2008 (UTC)

ఇందులో వివాదానికి దిగడానికి ఏముంది? గొప్ప దేశ భక్తుడైన సద్దాం హుస్సేన్ ని పొగడడం తప్పా? దాన్ని ఎడిట్ చెయ్యడం ఎందుకు? మన రాజకీయ నాయకులు అమెరికా దగ్గర అప్పులు అడుక్కునే స్థితిలో ఉంటే వాళ్ళని అసహ్యించుకుని మనం సద్దాం హుస్సేన్ లాగ అమెరికా సామ్రాజ్యవాదుల్ని ఎదిరించిన ధైర్యశాలీలని ఆదర్శంగా తీసుకోవాలి. అశోకుడు పుట్టిన దేశంలో పుట్టి మనం ఇంకా దేశ భక్తిని నేర్చుకోనందుకు సిగ్గు పడాలి.

పొగటం, తెగడటం రెండూ అనవసరం. అది మీ బ్లాగులో వ్రాసుకోండి --వైజాసత్య 05:57, 5 డిసెంబర్ 2008 (UTC)

మూలాలు[మార్చు]

అయ్యా, మీరు చాలా విమర్శలున్న వ్యాసాలు వ్రాస్తున్నారు. వాటికి తగిన మూలాలు చూపించాలి. అలా చేయకపోతే ఈ రోజు కాకపోతే ఇంకో నెల తర్వాతో, ఏడాది తర్వాతో ఆ వ్యాసాన్ని తొలగిస్తారు. అనవసరంగా మీ సమయం వృధా అవుతుంది. --వైజాసత్య 12:10, 18 డిసెంబర్ 2008 (UTC)


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]