వాడుకరి చర్చ:Arundubba
- వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాల గురించి చదవండి.
- వికీపీడియా గురించి తెలుసుకునేందుకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి.
- ప్రయోగశాలలో ప్రయోగాలు చెయ్యండి.
- వికీపీడియా కు సంబంధించిన సందేహాలుంటే సహాయ కేంద్రం లో అడగండి. మిగిలిన ప్రశ్న లకి రచ్చబండ లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
- వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే ఇటీవలి మార్పులు చూడండి.
- నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య (చర్చ, రచనలు)
అనువాదము
[మార్చు]నమస్కారములు, నా పేరు అరుణ్. నేను వికిపీడియా లొ ఇటీవలనే ఖాతా తెరిచాను. నేను ఆంగ్లము లోని పేజీలను తెలుగు లోనికి అనువాదము చెయ్యదలిచాను. దయచేసి నేను ఏమి చెయ్యవలెనో తెలుపగలరు
అరుణ్ గారు, మీరు ఆంగ్ల వ్యాసములు తెలుగులోకి అనువదించాలనుకొంటున్నదుకు చాలా సంతోషం. ఇదివరకట నాలాంటి వాళ్లు ఆలోచించకుండా ఆంగ్ల వ్యాసములను నేరుగా తెలుగు వికిలో అతికించడము జరిగింది. అవి ఇప్పటికి కూడా అనువాదము కోసము వేచిఉన్నాయి. వాటి జాబితా కొరకు అనువాదము కోరబడిన పేజీలు చూడండి. కొత్తవి అనువదించాలనుకుంటే మీరు ఒక సొంత ఇసుకపెట్టె పేజీ తయారు చేసుకొని అందులో అనువదించి తరువాత వ్యాసముతో పేజీ సృష్టించవచ్చు --వైఙాసత్య 15:38, 14 మార్చి 2006 (UTC)
కొత్త పేజీ సృష్టించడం
[మార్చు]నేను పొరబాటున కమ్యునిజం(communism), కమ్యునిజం అను పేర్లతో రెండు వ్యాసాలు సృష్టించాను. రెండిటి పాఠము ఒక్కటే. మరియు నేను సృష్టించిన పేజీలు సెర్చ్ బాక్స్ లో టైప్ చేసి "వెళ్ళు" క్లిక్ చేస్తే కనబడుట లేదు. కొత్త వ్యాసాలను ఎలా సృష్టించాలో తెలుపగలరు. --arun
- అరుణ్ గారూ, పొరపాటున అలా తప్పు పేరుతో పేజీ సృష్టించినప్పుడు మీరు రెండు పనులు చేయవచ్చు. మొదటిది మీరు దానిని సరైన పేజీకి తరలించవచ్చు. లేదా కొత్తపేజీలో పాత సమాచారము అతికించవచ్చు. కానీ మొదటి విధానమే సరి అయినది ఎందుకంటే రెండవ విధానములో పేజీ చరిత్ర కోల్పోతాము. వెళ్ళు నొక్కితే ఆ పేరుతో పేజీ ఉంటేనే అక్కడికి నేరుగా వెలుతుంది. అన్వేషణ నొక్కితే అన్ని పేజీలలో ఆ పదాన్ని వెతికి చూపిస్తుంది. కొత్త పేజి సృష్టించడానికి ఈ వ్యాసము చదవండి Wikipedia:కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి. ఇతర ప్రశ్నలకు Help:Contents చూడండి --వైఙాసత్య 15:01, 15 మార్చి 2006 (UTC)
తమిళ భాష అనువాదం
[మార్చు]Arundubbaగారు, మీరు మార్చి 29 2006న తమిళ భాష అనే వ్యాసాన్ని కొంత అనువాదించారు. ఇంకొంచెం శ్రమ తీసుకుని మిగతా వ్యాసాన్ని కూడా అనువదించండి. వికీపిడియాలో ప్రస్తుతం పేరుకు పోయిన అనువాదాలన్నిటి పూర్తిచేసేయాలని అనుకుంటున్నారు, తద్వారా ఇకపై తెలుగు వికీపీడియాలో వ్యాసాలన్నీ తెలుగులోనే ఉంటాయి. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 09:29, 13 డిసెంబర్ 2006 (UTC)