వార్సీ బ్రదర్స్
వార్సీ బ్రదర్స్ | |
---|---|
జననం | నజీర్ అహ్మద్ ఖాన్ వార్సీ నసీర్ అహ్మద్ ఖాన్ వార్సీ |
వృత్తి | ఖవ్వాలి సంగీత బృందం |
పురస్కారాలు | సంగీత నాటక అకాడమీ అవార్డు (2014) |
వార్సీ బ్రదర్స్ అనేది తెలంగాణలోని హైదరాబాదుకు చెందిన ఖవ్వాలి సంగీత బృందం.[1][2] నజీర్ అహ్మద్ ఖాన్ వార్సీ, నసీర్ అహ్మద్ ఖాన్ వార్సీ సోదరుల సారథ్యంలోని ఈ బృందంలో ఎనిమిది మంది సంగీతకారులు ఉన్నారు.
కవ్వాలి కుటుంబం
[మార్చు]జహీర్ అహ్మద్ ఖాన్ వార్సీ కుమారులైన వార్సీ బ్రదర్స్ తమ వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. వార్సీ సోదరుల పూర్వీకుడు మహమ్మద్ సిద్దిక్ ఖాన్ మొఘల్ దర్బార్‌లో గాయకుడిగా ఉండేవాడు. 1857లో మొఘల్ సామ్రాజ్యం పతనమైనపుడు, అతను హైదరాబాదు వచ్చి, నిజాం ఆస్థాన గాయకుడిగా చేరాడు. మహమ్మద్ సిద్దిక్ ఖాన్ తనరస్ ఖాన్ మేనల్లుడు.[3][4]
సంగీతం
[మార్చు]ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేసి కచేరీలు ఇస్తున్న వార్సీ బ్రదర్స్, వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ పేరుపొందారు.[5] అమీర్ ఖుస్రో రాసిన కవ్వాలీలను తమ శాస్త్రీయ శైలీలో ప్రదర్శించారు. హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం ఆధారంగా వారి సాంప్రదాయ సుఫియానా కవ్వాలి, గజల్స్, తుమ్రీ, భజనలు వంటివి ప్రదర్శిస్తూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు.[5][4]
అవార్డులు, గుర్తింపు
[మార్చు]ఖవ్వాలిలో విశేష కృషిచేసిన వార్లీ బ్రదర్స్ కు 2014లో సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది.[6][7] 2017లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ ఆవిర్భావ పురస్కారం అందుకున్నారు.[8] నజీర్ అహ్మద్ ఖాన్ వార్సీ, నసీర్ అహ్మద్ ఖాన్ (వార్సీ బ్రదర్స్) భారతదేశంలోని అనేక నగరాలతో పాటు అనేక ఇతర దేశాలలో కూడా ఖవ్వాలి కచేరీలు చేసారు.[4]
వారు ప్రతి గురువారం అర్ధరాత్రి నుండి నాంపల్లిలోని సయ్యద్ షా యూసుఫుద్దీన్ దర్గాలో ఖవ్వాలి పాడుతుంటారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Jun 21, Papri Paul /; 2017; Ist, 06:00. "Warsi brothers: Wah! This Hyderabadi family has been carrying foward the legacy of qawwali for over 900 years | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-08-20.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Qawwali by Warsi Brothers in Hyderabad on Republic Day". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-01-24. Retrieved 2021-08-20.
- ↑ 3.0 3.1 Papri Paul (21 June 2017). "Wah! This Hyderabadi family has been carrying forward the legacy of qawwali for over 900 years". Times of India (newspaper). Retrieved 2021-08-20.
- ↑ 4.0 4.1 4.2 "Warsi Brothers". India Today (newspaper). 7 November 2014. Retrieved 2021-08-20.
- ↑ 5.0 5.1 K. Pradeep (27 November 2014). "Music of the mystics". The Hindu (newspaper). Retrieved 2021-08-20.
- ↑ "Profile of additional group members - Asad Khan Warsi and Amjad Khan Warsi". Sangeet Natak Akademi website. Archived from the original on 2020-08-10. Retrieved 2021-08-20.
- ↑ "Sangeet Natak Akademi - List of Awardees (scroll down to read year 2014)". Archived from the original on 2020-03-29. Retrieved 2021-08-20.
- ↑ సాక్షి, తెలంగాణ (31 May 2017). "ప్రముఖులకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు". Sakshi. Archived from the original on 6 August 2017. Retrieved 27 September 2021.