వాల్‌రస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


వాల్‌రస్
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Suborder:
Superfamily:
Family:
Odobenidae

Allen, 1880
Genus:
Odobenus

Brisson, 1762
Species:
O. rosmarus
Binomial name
Odobenus rosmarus
Subspecies

O. rosmarus rosmarus
O. rosmarus divergens

వాల్‌రస్
వాల్‌రస్ ఉండే ప్రాంతాలు

వాల్‌రస్ ఆర్కెటిక్ ధృవములో ఉండే ఒక భారీ శరీరము కలిగిన జంతువు. ఏనుగు దంతాల వలే బయటకు వచ్చిన కొమ్ములు, ఎర్రటి కళ్ళతో వాల‌రస్ లు ఆకర్షణీయమైన ఆర్కిటిక్ జంతువులలో ఒకటి. ఇది భూమ్మిద, నీళ్ళలోను బ్రతకగలిగే క్షీరదము. వాల్‌రస్ ను ఎలిఫెంట్ సీల్తో కన్ఫ్యూజ్ అవడము జరుగుతుంది. పసిఫిక్ మగ వాల్‌రస్ సుమారుగా 1900 కె.జీ. లు, అట్లాంటిక్ వాల్‌రస్ సుమారుగా 1600 కె.జీలు ఉండి సుమారు ఒక చిన్న కారు పరిమాణములో ఉంటాయి.

జీవన విధానము

[మార్చు]

సగము జీవితము నీళ్ళలో మిగతా సగము బీచ్ లో, మంచులో గడిపే వాల్‌రస్‌లు పెద్ద పెద్ద గుంపులుగా గుమి గూడతాయి. ఇవి ఒక సారి రోజుల తరబడి సముద్రములో గాని ఒడ్డున గాని ఉంటాయి. తెడ్ల వంటి పెక్టోరల్ (ఛాతీ దగ్గర) ఫ్లిప్పర్ల సహకారముతో నడుస్తాయి. చేపలు, ఆల్చిప్పలు, పీతలు, ఇతర మొలస్క్లు (అంటే జెల్లీ ఫిష్ వంటివి) వంటే సుమారు 60 రకాల సముద్ర జీవరాశులను భోజనము చేస్తాయి. పెద్ద మగ వాల్‌రస్ లు ఇంక ఏవీ దొరకనప్పుడు సీల్ జంతువులతో పోరాడతాయి.

వాల్‌రస్ కు రెండు సహజ శత్రువులు ఉన్నాయి. ఓర్కా, ధృవపు ఎలుగుబంటి (పోలార్ బేర్).

ఆధారములు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వాల్‌రస్&oldid=2889912" నుండి వెలికితీశారు