వికీపీడియా:ఇంటర్‌ఫేసు నిర్వాహకులు
ఇంటర్‌ఫేసు నిర్వాహకులు (interface-admins) అంటే తెవికీలో జావాస్క్రిప్టు (JS) పేజీలు, సియెస్‌యెస్ (CSS) స్టైల్‌షీటు పేజీలు, జావాస్క్రిప్టు ఆబ్జెక్ట్ నొటేషన్ (JSON) పేజీలు అన్నిటిలో దిద్దుబాట్లు చెయ్యగలిగే అనుమతులున్న వాడుకరులు.[1] వీళ్ళు మీడియావికీ పేరుబరిలో ఉన్న పేజీలలో కూడా దిద్దుబాట్లు చెయ్యగలరు. JS/CSS పేజీలన్నిటినీ దిద్దుబాటు చెయ్యగలిగే అనుమతులున్న ఏకైక స్థానిక వాడుకరుల సమూహం ఇది.[2] ఈ పేజీలను వికీని సందర్శిస్తున్న వాడుకరులు, పాఠకుల బ్రౌజర్లు ఎక్జిక్యూటూ చేస్తాయి. తద్వారా పేజీ కంటెంటును చూపించే విధానాన్ని, పేజీ ప్రవర్తననూ మార్చడం చెయ్యవచ్చు. అలాగే,దిద్దుబాట్లు చేసేందుకు ఉపయోగపడే సంక్లిష్టమైన పరికరాలను కూడా తయారుచెయ్యవచ్చు.
ప్రస్తుతం తెవికీలో 0 ఇంటెర్‌ఫేసు నిర్వాహకులు ఉన్నారు. ఎవరైనా ఇంటెర్‌ఫేసు నిర్వాహకులను మీరు సంప్రదించదలిస్తే నిర్వాహకుల నోటీసుబోర్డులో రాయవచ్చు.
మూలాలు
[మార్చు]- ↑ Sitewide pages, such as MediaWiki:Common.js or MediaWiki:Vector.css, or the gadget pages listed on Special:Gadgets, and the JS, CSS, and JSON subpages of other accounts.
- ↑ నిర్వాహకులు మీడియావికీ పేరుబరిలో ఉన్న ఇతర పేజీలను, అన్ని JSON పేజీలను దిద్దుబాటు చెయ్యగలరు. నమోదైన వాడుకరులందరూ తమ స్వంత JS/CSS/JSON పేజీలలో దిద్దుబాట్లు చెయ్యగలరు (వాడుకరి స్క్రిప్టుల వంటి వాటిని).