వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 21వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2009 21వ వారం
గంగిరెద్దుల ఆట సంక్రాంతి సమయంలో కనుపించే ఒక గ్రామీణ సాంస్కృతిక కళారూపం మరియు వినోదం. అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. "అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు" అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తూ ధాన్యం, ధనం వంటి బహుమతులు తీసుకొంటుంటారు.
ఫోటో సౌజన్యం: చంద్రకాంతరావు