వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 07వ వారం
అల్ఫ్రెడ్ టెన్నిసన్ (ఆగస్ట్ 6, 1809 - అక్టోబర్ 6, 1892) బ్రిటన్‌కు చెందిన అత్యంత ప్రసిద్ధి చెందిన ఆంగ్ల కవి. టెన్నిసన్ లింకన్‌షైర్ (Lincolnshire) నందలి సోమర్స్‌బై లో (Somersby) ఒక రెక్టర్ (ఓ విధమైన మతాధికారి) 12 మంది సంతానంలో నాల్గవ కుమారునిగా జన్మించినాడు. టెన్నిసన్ మొదట లౌత్ గ్రామర్ స్కూల్ (లౌత్ వ్యాకరణ పాఠశాల) నందు నాలుగు సంవత్సరాలు చదివినాడు (1816 - 1820). ఆ తరువాత స్కైట్‌క్లిఫ్ పాఠశాల(Scaitcliffe School), ఎంగిల్‌ఫీల్డ్ గ్రీన్ (Englefield Green) మరియు లౌత్ నందలి ఆరవ ఎడ్వర్డ్ రాజు వ్యాకరణ పాఠశాల నందు చదివినాడు. 1828న కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కళాశాలలో ప్రవేశించినాడు. ఇక్కడ ఉండగా కేంబ్రిడ్జ్ అపోస్తలులు అను రహస్య సంస్థనందు చేరినాడు.
టెన్నిసన్ పలు విధాలయిన విషయాలపై కవితలు వ్రాసినారు. మధ్య యుగపు గాథల నుండి మొదలుకొని పౌరాణిక కథల వరకూ, ప్రాంతీయ స్థితిగతుల నుండి ప్రకృతి విషయాల వఱకూ!, ఇతని బాల్యానికి ముందు, బాల్యంలోనూ ప్రచురించిన జాన్ కీట్స్, మరియు ఇతర సరస కవుల ప్రభావం ఇతనిపై బహుమెండు. ఇతని కవితల్లోని భావావేశము, సాహిత్యంలోని చిక్కదనము ఈ విషయాన్ని దృవపరుస్తున్నాయి. ఇతను లయ (rythm)మీద కూడా చక్కని పట్టు సాధించినాడు. ఉదాహరణకు Break, Break, Break అని ఒకే పదాన్ని పలుమార్లు లయబద్ధంగా వాడి చెప్పదలచుకున్న విషయంలోని విషాదాన్ని, అందులోని తీవ్రతను పాఠకులకు అందేలా చేయడంలో టెన్నిసన్ దిట్ట.
....పూర్తివ్యాసం: పాతవి