Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 45వ వారం

వికీపీడియా నుండి
జిబ్రాల్టర్ జలసంధి

జిబ్రాల్టర్ జలసంధి, అట్లాంటిక్ మహాసముద్రాన్ని మధ్యధరా సముద్రానికి కలిపే ఒక సన్నని జలసంధి. ఐరోపా లోని ఐబీరియన్ ద్వీపకల్పాన్ని ఆఫ్రికాలోని మొరాకో నుండి ఇది వేరు చేస్తుంది. స్పెయిన్‌ లోని పాయింట్ మారోక్వి, మొరాకోలోని పాయింట్ సైర్స్ మధ్య, 13 కి.మీ. వెడల్పున్న ఈ జలసంధి రెండు ఖండాలనూ వేరు చేస్తోంది. పడవలు ఈ జలసంధిని దాటడానికి 35 నిమిషాలు పడుతుంది. జలసంధి లోతు 300 నుండి 900 మీటర్ల వరకు ఉంటుంది. దీనికి చారిత్రకంగా కూడా మంది ప్రాధాన్యత ఉంది. అనేక సంస్కృతులు, నాగరికతలు ఈ మార్గం గుండా వ్యాప్తి చెందాయి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీకి చెందిన సైనిక పడవలు ప్రవాహ వేగాన్ని ఊతంగా చేసుకుని ఇంజన్లు ఆపేసి శత్రువులకు తెలియకుండా నిశ్శబ్దంగా ప్రయాణించేవి.

ఈ జలసంధి మొరాకో, స్పెయిన్, బ్రిటిష్ విదేశీ భూభాగమైన జిబ్రాల్టర్ ల ప్రాదేశిక జలాలలో ఉంది. అక్కడక్కడ స్పెయిన్, మొరాకో, బ్రిటన్ దేశాల సార్వభౌమాధికారం కొంత వివాదాస్పదం అయినప్పటికీ సముద్ర చట్టంపై ఐరాస ఒప్పందం (యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ) ప్రకారం, విదేశీ నౌకలు, విమానాలు ఈ జిబ్రాల్టర్ జలసంధిని స్వేచ్ఛగా దాటవచ్చు. 1980 నుండి ఈ జలసంధి కింద సముద్ర గర్భంలో స్పెయిన్, మొరాకోల మధ్య రైల్వే లైను గురించి చర్చలు మొదలయ్యాయి కానీ అవి నేటికీ రూపు దాల్చలేదు.
(ఇంకా…)