వికీపీడియా:కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం-2014

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొమర్రాజు లక్ష్మణరావు

తెలుగు వికీపీడియా ప్రారంభించి 2014 డిసెంబరుకు పదకొండు సంవత్సరాలయింది. వందలకొలదీ సభ్యుల కృషి ఫలితమే తెలుగు వికీపీడియా, మరి ఇతర తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల ప్రస్తుత రూపం. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మనం ఈ 10 సంవత్సరాలలో విశేషకృషి చేసిన సభ్యులలో 10 మందిని సన్మానించుకున్నాము. ఈ సంవత్సరం కూడా తెవికీ పురోగతికి కారణమైన సభ్యులను గుర్తించి పురస్కారం అందచేయడం సముచితమని తెవికీ 11వ వార్షికోత్సవాల కార్యనిర్వాహక కమిటీ భావించింది. ఈ పురస్కారానికి తెలుగులో విజ్ఞాన సర్వస్వానికి నాందిపలికిన కొమర్రాజు లక్ష్మణరావు పేరునే కొనసాగించాలని నిర్ణయించిది. 2014 ఈపురస్కారానికి 11వ వార్షికోత్సవాల బడ్జెట్ లో రూ.50,000 మొత్తం కేటాయించబడింది. ప్రతి పురస్కార గ్రహీతకు ప్రశంసాపత్రం మరియు రూ.10,000 చొప్పున గరిష్టంగా ఐదు మందికి పురస్కారాలు అందజేయవచ్చు. ఈ పురస్కార విధానమునకు వికీ భారత సమావేశం 2011 లో ఇవ్వబడిన విశిష్ట వికీమీడియన్ గుర్తింపు (NWR2011) ప్రేరణ.

లక్ష్యాలు

[మార్చు]

దీని లక్ష్యమేమిటంటే తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధికి కృషిచేసిన వ్యక్తులను గుర్తించి సన్మానించటం, తద్వారా సభ్యులకు ప్రోత్సాహాన్ని పునరుత్తేజాన్నీ కల్పించడం, తద్వారా మరింత వికీ అభివృద్ధికి అ‌వకాశం కల్పించండం.

పురస్కారానికి అర్హులు

[మార్చు]
  • ప్రతిపాదిత సభ్యుని తెలుగు వికీపీడియా/వికీసోర్స్/విక్షనరీ ప్రాజెక్టులలోని రచనలను, 2014 జనవరి నుండి డిసెంబరు వరకు, వారు చేసిన కృషి పరిగణించబడుతుంది.
  • సభ్యుని రచనలు స్వచ్ఛందంగా చేసినవై వుండాలి. దీనికై ఏ సంస్థనుండైనా పురస్కారం కానిరూపంలో ప్రతిఫలం పొందివుండకూడదు. పరిగణిస్తున్న కాలంలో కొంతకాలం ప్రతిఫలం పొందినట్లైతే ఆ కాలాన్ని పేర్కొని ఆ కాలంలో సభ్యుని రచనలను అభ్యర్ధనలో అదనపు సమాచారంలో వివరించాలి. ఎంపికమండలి ఆ కృషిని తప్పించి మిగతా కృషిని పరిగణించుతుంది.
  • గత సంవత్సరం నగదు పురస్కార గ్రహీతలను ఈ సంవత్సరం పరిగణనలోకి తీసుకొనరు. వారు తరువాతి సంవత్సరంలో అర్హత సాధిస్తారు

కొలబద్ద

[మార్చు]

కొలబద్ద ప్రామాణికంగా వుంటే ఎంపిక మెరుగుగా వుంటుంది. ప్రతిపాదనలో గల పది విభాగాలకు 1 నుండి 10 కొలబద్దపై సభ్యుని కృషి మరియు ప్రాజెక్టుపై దాని ప్రభావాన్ని అంచనా వేయాలి. ఏదేని విభాగంలో ఎంపిక మండలి సభ్యునికి అంత అవగాహన లేకపోతే ఆ విభాగానికి మార్కులు (అన్ని ప్రతిపాదనలకు కూడా) ఇవ్వకూడదు. 1 స్థాయి, 10 స్థాయి ని నిర్వచించాలి. ఈ నిర్వచనం సాధారణ పదాలతో వుండాలి. ఎ వ్యక్తి రచనలను వుటంకించకూడదు. కనిష్ట స్థాయికి, గరిష్టస్థాయి కి గణాంకాలు నిర్వచించేటప్పుడు సాధారణ వికీసభ్యుడు రెండు మూడు సంవత్సరాలలో ఖాళీ సమయాల్లో ఎంత కృషి చేయగలడు అన్నది ప్రాతిపదికగా సభ్యుల అనుభవాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అదే సమయంలో ఈ పురస్కారానికి విలువ తగ్గకుండా కృషి వుండాలనే అంశంకూడా పరిగణించడం జరిగింది.

బహుమతి ప్రదానం

[మార్చు]


ఇవి కూడా చూడండి

[మార్చు]