వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 16
Jump to navigation
Jump to search
- 1765 : బక్సర్ యుద్ధం తరువాత అలహాబాద్ ఒప్పందం మొఘల్ చక్రవర్తి షా ఆలం,
ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన రాబర్ట్ క్లైవ్ మధ్య సంతకం చేయబడింది. - 1886 : ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస మరణం (జ.1836). (చిత్రంలో)
- 1909 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సర్దార్ బిరుదాంకితుడు గౌతు లచ్చన్న జననం (మ.2006).
- 1919 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 7వ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య జననం (మ.1986).
- 1920 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి జననం (మ.2001).
- 1946 : భారతదేశం నుండి బ్రిటిష్ నిష్క్రమణ తర్వాత ప్రత్యేక ముస్లిం మాతృభూమి కోసం ప్రత్యక్ష కార్యాచరణ దినంగా పేర్కొంటూ
ఆల్-ఇండియా ముస్లిం లీగ్ సార్వత్రిక సమ్మె ( హర్తాళ్) ప్రకటించింది. - 1958 : అమెరికన్ నటి, పాటగత్తె, పాటల రచయిత్రి మడోన్నా జననం.
- 1981 : బాలీవుడ్ చలనచిత్ర నటుడు ఉపేన్ పటేల్ జననం.
- 1996 : వేద పండితుడు, గాంధేయవాది, ప్రాచీన గ్రంథాల అనువాదకుడు చర్ల గణపతిశాస్త్రి మరణం (జ.1909).
- 2010 : ప్రసిద్ధ ప్లాస్టిక్ సర్జన్ డా. ఫ్రాంక్ ర్యాన్ కారు ప్రమాదంలో మరణించాడు.
- 2018 : భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి మరణం. (జ.1924)