వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 19
స్వరూపం
- ప్రపంచ మానవతా దినోత్సవం
- 1839 : ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం
- 0014 : ఆగస్టస్, రోమన్ చక్రవర్తి మరణం (జ.63 బి.సి). ఇతని పేరున, ఆగష్టు నెల ఏర్పడింది.
- 1918 : భారతదేశ తొమ్మిదవ రాష్ట్రపతి శంకర దయాళ్ శర్మ జననం (మ.1999).(చిత్రంలో)
- 1919 : ఆఫ్ఘనిస్తాన్ పూర్వ బ్రిటిష్ ప్రభుత్వం నుండి స్వాతంత్ర్యం పొందినది.
- 1925 : తెలుగు సినిమా నిర్మాత, నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య జననం (మ.2012).
- 1946 : అమెరికా 42వ అధ్యక్షుడు బిల్ క్లింటన్ జననం.
- 1950 : భారతీయ సంఘ సేవకురాలు, రచయిత్రి పద్మ భూషణ్ సుధామూర్తి జననం.
- 1991 : సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయింది. సెలవులో ఉన్న సోవియెట్ ప్రెసిడెంట్ మిఖాయిల్ గోర్బచేవ్ ను గృహ నిర్బంధంలో ఉంచారు.
- 2016 : రియో ఒలింపిక్స్ నందు ఒలింపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా పి.వి. సింధు రికార్డు సృష్టించింది.