వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 22
స్వరూపం
- 1666: మొఘల్ చక్రవర్తి షాజహాన్ మరణం (జ.1592).
- 1882: భారత స్వాతంత్ర్య సమర యోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు జననం (మ.1962).
- 1885: ఆంధ్ర పితామహ గా పేరుగాంచిన మాడపాటి హనుమంతరావు జననం (మ.1970). (చిత్రంలో)
- 1900: అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్త, సంగీత కారుడు డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్ మరణం (జ.1831).
- 1901: అరవైమూడేళ్లపాటు యునైటెడ్ కింగ్డమ్ ను ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన విక్టోరియా మహారాణి మరణం (జ.1819).
- 1940: తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి మరణం (జ.1863).
- 1965: మానవతావాది మలిశెట్టి వెంకటరమణ జననం.
- 1972: స్వామి రామానంద తీర్థ మరణం (జ.1903).
- 2014: తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరణం (జ.1923).