వికీపీడియా:తెవికీ వార్త/2010-12-03/తెవికీ ప్రచారం, 1-2, నవంబర్, 2010,గుంటూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రచయిత:అర్జునరావు
తెవికీ అకాడమీ[1] నాలుగవ మరియ ఐదవ అవగాహనా సదస్సులను , నవంబరు 1,2 తేదీలలో గుంటూరులోని జెకెసి కళాశాల, చౌదరిపేట [2] మరియు విజ్ఞాన్ డిగ్రీ కళాశాల, పెదపలకలూరు లో నిర్వహించాను.

జెకెసి లో వికీ అకాడమీ ప్రారంభ సమావేశం
జెకెసి లో వికీ అకాడమీ ప్రయోగశాల లో పోటీలు

ఈ సారి వికీమీడియా వీడియోల[3]లో, నైస్ పీపుల్, గ్రేట్ ఫీలింగ్ అనే వీడియోలు, మెరుగుపరచిన సమర్పణ లు వాడటం జరిగింది. ప్రయోగశాలలో వ్యాస రచన పోటీలు నిర్వహించి వాటిలో లోటు పాట్లు వివరించడం జరిగింది. ప్రశ్నలకు సరియైన సమాధానాలు చెప్పినవారికి, 10 నిముషాలలో చక్కని వ్యాసాల మొలకలను రాసిన వారికి ప్రోత్సాహక బహమతులు ( 5 స్టార్ బార్ చాకొలేట్లు) ఇవ్వడం జరిగింది. దాదాపు 150 మంది విద్యార్థులు తెలుగు వాడకం గురించి, వికీపీడియా గురించి ప్రయోగ పూర్వకంగా తెలుసుకున్నారు.

జెకెసి కళాశాలలో ఈ సదస్సు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవము రోజు జరపటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన తెలుగు శాఖాధిపతి శ్రీమతి లక్ష్మీ ప్రసన్నం తెలుగు భాష ఔన్నత్యాన్ని వివరించి, తెలుగు భాష ఆధునికీకరణకు సాంకేతిక విద్యార్థులు తోడ్పడాలని కోరారు. కంప్యూటర్ లో తెలుగు ని ప్రత్యక్షంగా ఉబుంటు 10.10 తెలుగు ముఖాంతరంగా ప్రదర్శించాను. విద్యార్థులకు ఇది ఆసక్తికరంగా అనిపించడంతో, చాలా ఉత్సాహంతో తెలుగు టైపింగు పద్ధతులు, వికీపీడియా గురించి తెలుసుకున్నారు. ఇవేకాక తెలుగు వికీపీడియాకు ఆధారమైన మీడియా వికీ సాఫ్ట్ వేర్, స్వేచ్ఛా మూలల సాఫ్ట్ వేర్ తో విద్యార్థులు తమ నైపుణ్యాలను ఏ విధంగా మెరుగు పరచుకోవచ్చో వివరించడం జరిగింది. ఈ మెయిల్ ని కనీసం వారానికొకసారైనా వాడి , ఇతర ప్రాంతాలతో జరుగుతున్న బార్ క్యాంప్ లాంటి సదస్సులు, పోటీలలో పాల్గొనమని సలహా ఇవ్వడం జరిగింది. జెకెసి లో జరిగిన కార్యక్రమాన్ని ఈనాడు గుంటూరు జిల్లా సంచికలో నవంబరు 2, ఈమెయిలును వారానికోసారైనా వినియోగించాలి అన్న శీర్షికతో వార్తగా[4] వచ్చింది.

విజ్ఞాన్ డిగ్రీ కళాశాలలో తెవికీ అకాడమి ప్రయోగాలు

ఈ అకాడమీల నిర్వహణలో ప్రతి సారి కొన్ని కొన్ని మార్పులు చేయడం, అందువలన సమర్పణలను, కరపత్రాలలో మెరుగు పరచవలసిన అంశాలు అవగతమయ్యాయి. వాటిలో ముఖ్యమైనవి ఇన్‌స్క్రిప్టు, వికీపీడియా టైపింగు ఉదాహరణలను కరపత్రంలో చేర్చడం మరియు వీడియోలకు తెలుగు ఉపశీర్షికలు చేర్చడం.

వీటిని నిర్వహించటంలో నాకు అన్ని విధాల తోడ్పడిన నా బాల్య మిత్రుడు శ్రీ కొలసాని వీరయ్య చౌదరి, నా బంధువు జి జగన్నాధం,మరియు కళాశాల యాజమాన్యాలకు ముఖ్యంగా జెకెసి తరపున శ్రీ సురేష్, శ్రీమతి టి అనూరాధ మరియు విజ్ఞాన్ తరపున డా కోటేశ్వర రావు, శ్రీ మల్లికార్జునరావు, శ్రీమతి జ్యోతి గార్లకు నా అభినందనలు.

మూలాలు