వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పాగనిజం
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఉంచెయ్యాలి
- తొలగింపుకు వ్యతిరేకం
ఇప్పటికి వ్రాసిన విషయం (పరిచయంగా ఉంది) పెద్దగా అభ్యంతరకరంగా నాకు ఏమీ కనిపించడంలేదు. కనుక తొలగించవలసిన అవుసరం లేదనుకొంటాను. "ఇతర మతాలను కించపరచే విధంగా" అనేది సాపేక్షమైన వాదన (relative assessment). కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ తొలగించవలసిన అవసరం నాకు కనిపించడంలేదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:33, 6 నవంబర్ 2008 (UTC)
- కొందరి అభిప్రాయాలకు అనుగుణంగా లేదని ఒక వ్యాసాన్ని తొలగించలేము. అలాగైతే నాస్తికుల అభిప్రాయాలను కించపరిచే విధంగా ఉందని దైవసంబంధ వ్యాసాలన్ని తొలగించాల్సి వస్తుంది --వైజాసత్య 17:56, 27 నవంబర్ 2008 (UTC)
- "నాస్తికుల అభిప్రాయాలను కించపరిచే విధంగా ఉందని దైవసంబంధ వ్యాసాలన్ని తొలగించాల్సి వస్తుంది" అని రాయడం హాస్యాస్పదంగా ఉంది. అలాగైతే ఏ వ్యాసాన్ని రాయలేము. ఎదుటి వారిపై విమర్శలు చేయకుండా వ్యాసాలు రాయడం సరైన పద్దతి. ఒక మతం గురించి రాస్తే మరో మతానికి కించపరిచే విధంగా ఎలా ఉటుంది? ఒక పార్టీ గురించి రాస్తే మరో పార్టీకి కించపర్చే విధంగా ఉంటుందా? దైవ సంబంధ వ్యాసాలు నాస్తికులకు కించపరిచే విధంగా ఉంటాయనుకోవడం భ్రమ. నాస్తికుల గురించి ఎన్నో వ్యాసాలు ఉన్నాయి. వాటన్నిటినీ తొలిగించాలని ఎవరూ చెప్పలేదు. మతాలపై విమర్శలు చేసిన వ్యాసాలనే తొలిగించాలనే ప్రతిపాదన ఉంది. కొందరి అభిప్రాయాలకు అనుగుణంగా లేని వ్యాసాలంటున్నారు మరి ఒకరికి నచ్చిన చెత్త వ్యాసాలు ఉండవచ్చా. -- C.Chandra Kanth Rao(చర్చ) 18:30, 28 నవంబర్ 2008 (UTC)
- చంద్రకాంతరావు గారూ, నా వ్యాఖ్య వ్యక్తిగత విమర్శగా అనిపించి ఉంటే క్షమించండి. నేనా ఉద్దేశ్యంతో అనలేదు. మీకీ వ్యాసం ఎందుకు అభ్యంతరకరంగా ఉందో నాకు ముందునుండి సరిగా అర్ధంకాలేదు. ఇంకెక్కడైనా మీరు చర్చించి ఉంటే దాని లింకు ఇవ్వండి. మతాలపై విమర్శలు ఉన్న వ్యాసాలు ఎందుకు తొలగించాలో అర్ధం కాలేదు. వివిధ మతాల్ని విమర్శించటం అనాదిగా వస్తున్నదే. కానీ ఈ సదరు వ్యక్తి మతం మీద తన వ్యక్తిగత అభిప్రాయాలు వెలిబుచ్చిఉంటే తొలగించాలని ఇంతకు ముందు కూడా అన్నాను. ఒక మతం గురించి వ్రాస్తే మరో మతం గురించి కించపరచినట్టు కాదు కానీ ప్రతి మతాన్నీ, ప్రతి విషయాన్ని, ప్రతి పార్టీని విమర్శించే వాళ్ళుంటారు. విమర్శలకు కూడా ఎంతోకొంత చోటివ్వాలి కదా. --వైజాసత్య 20:32, 28 నవంబర్ 2008 (UTC)
- "నాస్తికుల అభిప్రాయాలను కించపరిచే విధంగా ఉందని దైవసంబంధ వ్యాసాలన్ని తొలగించాల్సి వస్తుంది" అని రాయడం హాస్యాస్పదంగా ఉంది. అలాగైతే ఏ వ్యాసాన్ని రాయలేము. ఎదుటి వారిపై విమర్శలు చేయకుండా వ్యాసాలు రాయడం సరైన పద్దతి. ఒక మతం గురించి రాస్తే మరో మతానికి కించపరిచే విధంగా ఎలా ఉటుంది? ఒక పార్టీ గురించి రాస్తే మరో పార్టీకి కించపర్చే విధంగా ఉంటుందా? దైవ సంబంధ వ్యాసాలు నాస్తికులకు కించపరిచే విధంగా ఉంటాయనుకోవడం భ్రమ. నాస్తికుల గురించి ఎన్నో వ్యాసాలు ఉన్నాయి. వాటన్నిటినీ తొలిగించాలని ఎవరూ చెప్పలేదు. మతాలపై విమర్శలు చేసిన వ్యాసాలనే తొలిగించాలనే ప్రతిపాదన ఉంది. కొందరి అభిప్రాయాలకు అనుగుణంగా లేని వ్యాసాలంటున్నారు మరి ఒకరికి నచ్చిన చెత్త వ్యాసాలు ఉండవచ్చా. -- C.Chandra Kanth Rao(చర్చ) 18:30, 28 నవంబర్ 2008 (UTC)
గమనిక: అమలైపోయిన నిర్ణయాన్ని ప్రకటించి చర్చను ముగిస్తున్నాను__చదువరి (చర్చ • రచనలు) 04:39, 3 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.