వికీపీడియా:నాణ్యతా మూల్యాంకనం
Jump to navigation
Jump to search
JVRKPRASAD గారి ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్తూ ఈ ఆలోచనలు.
మూల్యాంకన ప్రాతిపదిక
[మార్చు]వ్యాసాల విలువను కింది విధంగా లెక్కించాలి.
ప్రధాన పేరుబరిలోని వ్యాసాలకు
[మార్చు]వ్యాసం కొత్తదైనా, పాత వ్యాసాన్ని కింది ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసినా ఈ మార్కులు వస్తాయి.
- భాషాదోషాలు (అక్షర/వ్యాకరణ దోషాలు) లేకుండా ఉంటే: దీనికి గరిష్ఠంగా 10 మార్కులు. అక్షరదోషం గానీ వ్యాకరణ దోషం గానీ ఒక్కటి కూడా ఉండకూడదు. అలాంటి వ్యాసాలకు కిందివిధంగా మార్కులు వస్తాయి. ఒకటి నుండి ఐదు వరకు దోషాలుంటే ఈ మార్కుల్లో సగం వస్తాయి. ఆపైన తప్పులుంటే, సున్నా మార్కులు.
- వ్యాస పరిమాణం 2 కెబి - 4 కెబి: 4 మార్కులు
- వ్యాస పరిమాణం 4 కెబి - 6 కెబి: 6 మార్కులు
- వ్యాస పరిమాణం 6 కెబి - 8 కెబి: 8 మార్కులు
- వ్యాస పరిమాణం 8 కెబి పైన: 10 మార్కులు
- అనాథ, అగాధ వ్యాసాల సంస్కరణ (కనీసం 3 ఔట్‌గోయింగు లింకులు, కనీసం 1 ఇన్‌కమింగు లింకు): 5 మార్కులు.
- మూలాల జోడింపు: దీనికి 10 మార్కులు
- పరిమాణం: కనీసం 2 కెబి ఉండాలి - ఫైళ్ళు, సమాచారపెట్టెలు కాకుండా. ఒక్కో వ్యాసానికీ గరిష్ఠంగా 10 మార్కులు, కింది విధంగా ఇవ్వవచ్చు.
- 2 కెబి - 4 కెబి: 2 మార్కులు
- 4 కెబి - 5 కెబి: 4 మార్కులు
- 5 కెబి - 6 కెబి: 6 మార్కులు
- 6 కెబి - 8 కెబి: 8 మార్కులు
- 8 కెబి పైన: 10 మార్కులు
- వాడుకరి చేర్చిన మొత్తం పాఠ్యం పరిమాణాన్ని పరిగణిస్తారు.
- వర్గాలు: సంబంధించిన వర్గాలన్నిటిలోకీ చేరిస్తే 5 మార్కులు.
- ఇతర భాషల లింకులు: 5 మార్కులు
- వికీడేటాలో లేబులు, వివరణ చేర్చితే: 5 మార్కులు
- ఫోటోల చేర్పు: వ్యాసానికి సంబంధించిన ఫోటోలను చేర్చితే 5 మార్కులు. వ్యాసంలో ఎన్ని ఫోటోలను చేర్చినా ఇవే మార్కులు
ఇతర పేరుబరులలోని మార్పుచేర్పులు
[మార్చు]- కొత్తగా ఎక్కించిన ఒక్కో ఫొటోకు: 5 మార్కులు.
- కొత్త మూసకు (దిగుమతి చేసుకున్న మూసలకు ఉండదు): 10 మార్కులు
- విలీనం చేసినందుకు: 15 మార్కులు
- తొలగింపు మూస పెట్టి, ఆ ప్రతిపాదన నెగ్గితే: 15 మార్కులు
- తరలింపులు: 3 మార్కులు
నిబంధనలు
[మార్చు]- ఏ వ్యాసానికైనా ఒక్క ఇన్‌కమింగు లింకూ లేకపోతే, ఆ వ్యాసాన్ని అసలు పరిగణన లోకి తీసుకోరు.
- వ్యాసం నుండి బయటికి పోయే లింకులు ఒక్కటీ లేకపోయినా ఆ వ్యాసాన్ని అసలు పరిగణన లోకి తీసుకోరు.
- 2 కెబి లోపు వ్యాసాన్ని పరిగణన లోకి తీసుకోరు.
- వ్యాస విషయం ఏది ఉండాలనే విషయమై నిబంధనేమీ లేదు. వ్యాసం అనువాదమైనా కావచ్చు, స్వంతంగా తయారు చేసినదైనా కావచ్చు.
- వాడుకరులు తాము చేసిన మార్పులను మూల్యాంకన పేజీలో సమర్పించాలి. నిర్ణేతల బృందం వాటిని పరిశీలించి మూల్యాంకన చేస్తుంది.
- వాడుకరి తాను సృష్టించిన వ్యాసాల్లో మాత్రమే కాక, తాను పనిచేసిన ప్రతీ వ్యాసంలోనూ మార్కులు పొందవచ్చు.
నిర్ణేతలు
[మార్చు]వ్యాసాలను నాణ్యత పరంగా మూల్యాంకన చేసేందుకు ముగ్గురు సభ్యుల నిర్ణేతల బృందం ఉంటుంది. కిందివారు ఈ బృందంలో సభ్యులు కావచ్చు:
- కనీసం ఒకరు నిర్వాహకులు, ఒకరు మామూలు వాడుకరీ అయి ఉండాలి.
- కనీసం పది కొత్త వ్యాసాలు (మొలకలు కానివి) రాసి ఉండాలి.
- తన మొత్తం దిద్దుబాట్లలో, కనీసం 15% ప్రధానేతర పేరుబరుల్లో చేసి ఉండాలి.
- నిర్ణేతలు కూడా పోటీలో పాల్గొనవచ్చు.
పురస్కారాలు
[మార్చు]మార్కులు | పురస్కారం |
0 - 500 | |
500 - 750 | |
750 - 1000 | |
1000 కి పైన |
సమర్పణలు
[మార్చు]ప్రధాన పేరుబరిలోని వ్యాసాల సమర్పణ పట్టిక నమూనా
క్ర.సం. | వాడుకరి (సంతకం), తేది | వ్యాసం పేరు | పాత/కొత్త | పరిమాణం | మూలాలు | ఔట్‌గోయింగ్
లింకులు |
ఇన్‌కమింగ్
లింకులు |
వ్యాకరణ
దోషాలు |
అక్షర
దోషాలు |
వర్గాలు | భాష లింకులు | మొత్తం మార్కులు |
ఇలాగే ఇతర పేరుబరులలోని సమర్పణ కోసం తయారు చేసుకోవచ్చు.
లెక్కింపు చెయ్యడం ఎలా
[మార్చు]లెకింపు పూర్తిగా బాటు ద్వారానే చెయ్యాలి. బాటుకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్లు: లెక్కింపు కాలం (ఎప్పటి నుండి ఎప్పటి వరకు) బాటు చెయ్యాల్సిన పనులు:
- ఇచ్చిన కాలంలో జరిగిన మొత్తం దిద్దుబాట్లను, పేరుబరి వారీగా సేకరించాలి. ప్రధాన పేరుబరి లోని మార్పులలో కింది పనులు చెయ్యాఅలి.
అభిప్రాయాలు
[మార్చు]- చదువరి గారి ప్రతిపాదన బాగా ఉంది. ప్రస్తుతం తెలుగులో క్రియాశీల వాడుకరులు 368 మంది ఉన్నారు. వీరిలో నెలలో 10 క్రొత్త వ్యాసాలను వ్రాసే వారిని వడపోస్తే వారి సంఖ్య గణనీయంగా తక్కువగానే కనిపిస్తుంది. ఆ నెలలో చేసిన దిద్దుబాట్లలో 15% ప్రధానేతర పేరుబరుల్లో చేసి ఉండాలి అనే నిబంధనను పరిగణిస్తే ఆ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి సభ్యులు ఎవరికి వారు స్వీయప్రతిపాదన చేసుకోవడం కాకుండా నిర్ణేతల బృందమే అర్హులైన సభ్యుల పేర్లను పురస్కారానికి పరిశీలించి పైన పేర్కొన్న విధంగా మూల్యాంకనం చేసి నెలనెలా పురస్కారాలను ప్రకటిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.--స్వరలాసిక (చర్చ) 14:57, 14 సెప్టెంబరు 2017 (UTC)
- చదువరి గారూ, మీ ప్రతిపాదన బావుందండీ. ఐతే అవార్డు అన్న పదం కన్నా, ఈ నెల తెలుగు వికీపీడియన్ లాంటిదైతే బావుంటుంది. ఇప్పటికే మన సామాజిక మాధ్యమాల వ్యూహంలో దీన్ని భాగంగా తీసుకున్నాం. కాబట్టి ఈ నెల వికీపీడియన్ ఎవరు అన్నదానికి ఈ కార్యప్రణాళిక దన్నుగా ఉంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 16:01, 14 సెప్టెంబరు 2017 (UTC)
- ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో పాలసీ చర్చల అనంతరం పాలసీలు చెదురుమదురుగా ఎక్కడెక్కడో ఉన్నాయి. పాలసీ పేజీల్లో అందుబాటులో ఉంటే బావుంటుంది. దీన్ని సాధించేందుకు గాను పాత పాలసీని వెతికి పట్టుకుని పాలసీ పేజీలో క్రోడీకరించి రాస్తే దానికి కొన్ని మార్కులు ఇవ్వగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 16:20, 14 సెప్టెంబరు 2017 (UTC)