వికీపీడియా:మంచివ్యాసం ప్రమాణాలు/ప్రమాణాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 చక్కగా రాసినదై ఉండాలి
1అ వ్యాసంలోని వచనంలో అక్షరదోషాలు, వ్యాకరణదోషాలు ఉండకూడదు.
1ఆ అది శైలి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి.
2 మౌలిక పరిశోధన లేకుండా నిర్ధారించదగి ఉండాలి
2అ దానిలో అన్ని మూలాల జాబితా, వ్యాసం లేఅవుట్‌కి అనుగుణంగా ఉండాలి
2ఆ వ్యాసంలో వాక్యం పక్కనే ఇచ్చే మూలాలు వికీపీడియా:నమ్మదగ్గ మూలాల నుంచి ఉండాలి. నేరుగా ప్రస్తావిస్తున్న కొటేషన్లు, ప్రచురితమైన అభిప్రాయాలు, సహజ విరుద్ధమైన అంశాలు, వివాదాస్పదమైన వాక్యాలు వంటి ప్రశ్నించదగ్గ, సందేహించదగ్గ అంశాలు, జీవించి ఉన్న వ్యక్తులకు సంబంధించిన వివాదాస్పదమైన సమాచారం మరీ ముఖ్యంగా ఈ నమ్మదగ్గ మూలాలతో సమర్థించాలి.
2ఇ దానిలో మౌలిక పరిశోధనలు లేకుండా ఉండాలి
2ఈ కాపీహక్కుల ఉల్లంఘనలు గాని, గ్రంథచౌర్యం గానీ ఉండకూడదు.
3 విస్తృత పరిధి కలిగి ఉండాలి
3అ వ్యాస విషయానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను పరామర్శించాలి
3ఆ అనవసరమైన అంశాల జోలికి పోకుండా వ్యాస విషయంపైననే దృష్టిని నిలిపి ఉంచాలి (en) (వికీపీడియా:సారాంశం శైలి (en) చూడండి)
4 తటస్థం: నిష్పాక్షికంగా ఉంటూ, వివిధ దృక్కోణాలకు తగు విలువను ఇస్తూ చూపించాలి.
5 స్థిరత్వం: దిద్దుబాటు యుద్ధాల వలన గాని, పాఠ్య సంబంధ వివాదాల వలన గానీ వ్యాసంలో అనునిత్యం మార్పుచేర్పులు జరుగుతూ ఉండరాదు.
6 సచిత్రం: వీలైనంతవరకు బొమ్మలు, వీడియో (en), ఆడియో (en) వంటివి వాడాలి.
6అ మీడియాకు వాటి కాపీహక్కుల స్థితికి సంబంధించిన వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా ఉండాలి. అలాగే, స్వేచ్ఛగా అందుబాటులో లేని (en) మీడియాకు సముచిత వినియోగపు హేతుబద్ధతను (en) సూచించాలి.
6ఆ మీడియా, విషయానికి సంబంధించినవై (en) ఉండాలి. వాటికి సముచితమైన వ్యాఖ్యలు (en) ఉండాలి