వికీపీడియా:మంచి వ్యాసం ప్రతిపాదనలు/మార్గదర్శకాలు
మంచి వ్యాసం ప్రమాణాలకు అనుగుణంగా ఉందా అని అంచనా కట్టేందుకు ఎంచుకున్న వ్యాసమే మంచి వ్యాసం ప్రతిపాదన (మవ్యాప్ర). అలా ప్రతిపాదించిన వ్యాసాల జాబితా కింద ఉంది. క్లుప్తంగా గణాంకాలు ఇవి:
వ్యాసాన్ని ఎవరైనా ప్రతిపాదించవచ్చు. వ్యాసాన్ని రూపుదిద్దడంలో పాలుపంచుకోని, వికీపీడియా మౌలిక విధానాల గురించి అవగాహన ఉన్న వాడుకరి ఎవరైనా సమీక్షించవచ్చు. ప్రతిపాదకుడు, సమీక్షకుడూ కలిసి సుమారు 7 రోజుల్లో సమీక్షను పూర్తిచెయ్యవచ్చు. సమీక్షకుడు చేసే నిర్మాణాత్మక విమర్శకు ప్రతిపాదకుడు సానుకూలంగా స్పందించి, అవసరమైన మార్పుచేర్పులు చేసి వ్యాసాన్ని మంచి వ్యాసపు స్థాయికి తీసుకు పోవచ్చు. వ్యాసం మంచి వ్యాసం స్థాయికి చేరుకుంటే ఆ పేజీలో పైన కుడి వైపున ఒక ప్లస్ గుర్తు చేరుతుంది (). ప్రతిపాదన, సమీక్ష ఎలా చెయ్యాలో పైనున్న సూచనలు ట్యాబులో చూడవచ్చు. ఏదైనా మంచి వ్యాసాన్ని ఆ హోదా నుంచి తొలగించాలని మీరు అనుకుంటే పైనున్న పునస్సమీక్ష ట్యాబులో ప్రతిపాదించండి. |