వికీపీడియా:రచ్చబండ (అనువాదాలు)/పాత అనువాదాలు 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేం స్పేసు అనువాదాలు[మార్చు]

నేం స్పేసు అనువాదాలాల్లో "సభ్యునిపై చర్చ"ను "సభ్యుని చర్చ" గాను, "Wikipedia" ను "వికీపీడియా" గాను, "Wikipedia చర్చ" ను "వికీపీడియా చర్చ" గాను మార్చాలని ప్రతిపాదన. అలాగే, లింగతటస్థత ను దృష్టిలో ఉంచుకుని "సభ్యుడు" ను "సభ్యులు"గా మారిస్తే ఎలా ఉంటుందో సభ్యులు ఆలోచించాలి. __చదువరి (చర్చ, రచనలు) 03:28, 10 సెప్టెంబర్ 2006 (UTC)


lEdaMDI, naaku gurtu unnaMta varakU nEM spEsulanu anuvaadaM cEstE vikI saafT^vErunaMdu EdO samasya unnaTTu gurtu. manamu nEM spEsulanu anuvaadamu ceyyakUDadanukuMTaanu. koddigaa anuBavamu unnavaarini kanukkoni maarcaDamu maMcidi . user:chavakiran
అనువాదాలు మనమే చేద్దామని నా ఉద్దేశ్యం కాదు. అసలు మనం చెయ్యలేం కూడా! సాఫ్టువేరులోనే మార్చాలి. ఇప్పటికే అన్నిటినీ మార్చేసారు చూసారా? ఇక మిగిలింది Wikipedia, Wikipedia చర్చ - ఈ రెండే!__చదువరి (చర్చ, రచనలు) 09:53, 10 సెప్టెంబర్ 2006 (UTC)
ఈ విషయమే ఇప్పటికి రెండుసార్లు బగ్‌జిల్లాలో మొరపెట్టుకున్నాను. ఎవరూ పట్టించుకోవట్లేదు. ఏం చెయ్యాలో?

మనము ఒక మద్దతు పత్రము తయారు చేసి అందరము సంతకం చెయ్యాలేమో --వైఙాసత్య 15:53, 11 అక్టోబర్ 2006 (UTC)

నిష్క్రమణ[మార్చు]

పేజీకి కుడివైపు పైన ఉన్న "నిష్క్రమణ" అనేది "నిష్క్రమించు అని ఉండాలి. ఎందుకంటే, దాని ఆంగ్ల సమవుజ్జీ "log out" క్రియాపదబధం కాబట్టి. దీన్ని ఎక్కడ మార్చాలో (ఇక్కడా లేక ఇక్కడా?)

ఇది ఎలా ఉన్నా ర-వత్తు కనిపించట్లేదు కదా. వేరేదైనా పదంకోసం ప్రయత్నిద్దామా?--వీవెన్ 15:43, 11 అక్టోబర్ 2006 (UTC)

రెండిట్లో దేనిలో మార్పు చేయాలో తెలియట్లేదు. ఒకసారి ప్రయత్నించి చూడండి. నిష్క్రమించు బాగానే ఉంది. దీనికి ప్రత్యామ్నాయాలు ఎవరికైనా తోస్తున్నాయా? బయటికి దారి (కానీ ఇలా బయటికి దారి చూపించడాలు మన తెలుగు సాంప్రదాయము కాదని నా అభిప్రాయము)--వైఙాసత్య 15:58, 11 అక్టోబర్ 2006 (UTC)
అక్కడ క్రియా పదం ఉండకపోయినా పరవాలేదనుకుంటాను. దాని పక్కన ఉన్న మిగతా లింకులను గమనించండి. __చదువరి (చర్చ, రచనలు) 16:21, 11 అక్టోబర్ 2006 (UTC)
 ####   ఆ పదమె బాగు0ది. ఆ పదాన్ని మార్చవద్దని నా మనవి.  {[ సభ్యుడు : వె0కట ఫణి.దెవళరాజు ]}
  • "నిష్క్రమణ" అనే పదమే బావుందనే నా అభిప్రాయం.- శ్రీనివాస్ రెడ్డీ

మొదటి పుట, ఖాతా[మార్చు]

మళ్లీ ఈ విషయము చర్చకు వచ్చినందువలన. సభ్యులు తమ అభిప్రాయాలు మద్దతి తెలియజేయాలని కోరుతున్నాను.

మొదటి పేజీ
  • నా మద్దతు దీనికే పుట అన్న పదము ఇప్పుడు అంత ఉపయోగములో లేదు. సజీవ భాష అంటే పీనుగులను లేపడముకాదన్నది నా అభిప్రాయము.--వైఙాసత్య 15:55, 6 డిసెంబర్ 2006 (UTC)
  • నా మద్దతు కూడా దీనికే. వాడుకలో పుటకంటే కూడా పేజీని ఎక్కువగా వాడుతున్నారు, అందుకనే. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 16:10, 6 డిసెంబర్ 2006 (UTC)
  • నా ఓటూ దీనికే!--వీవెన్ 17:15, 6 డిసెంబర్ 2006 (UTC)
నా వోటూ పేజీకే Chavakiran 08:10, 7 డిసెంబర్ 2006 (UTC)
మొదటి పుట
  • వాడుకతో సంబంధం ఎం ఉంది? పేజి తెలుగు పదము కాదు. ఇలా వాడుకలో ఉన్న పదాలని ఇతర భాషా పదాలన్ని తెలుగులో చేర్చుకుపోతే తెలుగుకు ఉన్న ప్రత్యేకత పొతుంది. అప్పుడు తెలుగే వాడుకలో ఉండదెమో. ఉదాహరణకు మరాఠి భాషాని తీసుకుంటే, మరాఠి కాని పదాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. దయ చేసి ఈ విషయంయై పునరాలోచించవలసిందిగా కోరుతున్నాను. పుట కూడ సరియైన పదం కాదు అని నేను అనుకుంటున్నా.
అయితే మీరుకొన్ని ప్రతిపాదించండి. సభ్యులలో చాలామంది అమోదయోగ్యమైన దానికి మారుద్దాం ఏమంటారు? (నా తరఫున గుమ్మం, చావిడి, వాకిలి) --వైజాసత్య 01:59, 6 ఆగష్టు 2007 (UTC)
నిఘంటువును ఆశ్రయించగా [[1]] తెలియవచ్చింది ఎంటటే పేజికి సరియైన అనువాదం పుట. పుటకు పర్యాయ పదం పొరట అని కూడా తెలుస్తుంది. మొదటి పుట అంత ఇంపుగా లేనందున ముఖపుటని ప్రతిపాదిస్తున్నా.
నాకిందులో తర్కమేమిటో అర్ధం కాలేదు. మొదటి పేజీలో పేజీ తెలుగు పదము కాదన్నారని అచ్చతెలుగు పదాలు గుమ్మం వాకిలి అనేవి ప్రతిపాదిస్తే మీరిప్పుడు ముఖపుట అంటున్నారు (ముఖ అనేది కూడా తెలుగు పదము కాదనుకుంటా. మొదటి పుట ఇంపుగా లేదని అచ్చతెలుగు పదాన్ని తోసిరాజన్నప్పుడు శుభ్రంగా "ముఖపత్రము" అంటే పోలా? (కనీసం దుష్టసమాసమైనా జరగకుండా శుద్ధ సంస్కృతంలో ఉంటుంది). --వైజాసత్య 15:14, 6 ఆగష్టు 2007 (UTC)
ముఖద్వారం అని నేను ప్రతిపాదిస్తున్నాను, కాని మెదటిపేజి ప్రజలకు బాగాలవాటు అయిపోయిందని అనిపిస్తున్నది. ఉత్తిగా ముఖద్వారం అని పిలిచే బదులు తెవికీ ముఖద్వారం అంటే చాలా బాగుంటుంది.--మాటలబాబు 15:23, 6 ఆగష్టు 2007 (UTC)
అకౌంటు
ఖాతా
  • తినగ తినగ వేము తియ్యగనుండు. మొదట నాకిది రుచించక పోయినా ఇప్పుడు పర్వాలేదనిపిస్తుంది. ఇది తెలుగు పదమన్న వాదం అసంబద్దం. ఖాతా ఎంత తెలుగో అకౌంటు అంతే తెలుగు.--వైఙాసత్య 15:55, 6 డిసెంబర్ 2006 (UTC)
  • అకౌంటు పేజీలాగా మరీ అంతగా వాడుకలో లేదు, ఖాతాను దానితో సమానంగా వాడుతున్నారని నా అభిప్రాయం, అందుకని ఖాతాకే నా వోటు. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 16:10, 6 డిసెంబర్ 2006 (UTC)
  • నేను ప్రదీప్ గారితో ఏకీభవిస్తాను. మనం బ్యాంక్ విషయం తీసుకుంటే ఖాతాదారుడు అంటారు గాని అకౌంటుదారుడు అనరు కదా ఉదాహరణకి "ఖాతాదారులకి మా శుభాకాంక్షలు" అని వింటూనే వుంటాం.--పాపిశెట్టి
  • నేను కొంచెం తటపటాయిస్తూనే దీనికి ఓటేస్తున్నాను.--వీవెన్ 17:15, 6 డిసెంబర్ 2006 (UTC)
నా వోటూ ఖాతాకే Chavakiran 08:11, 7 డిసెంబర్ 2006 (UTC)

లంకెలు, లింకులు[మార్చు]

అన్ని పేజీలలో ఒకే పదాన్ని ఉంచటానికి వీటిమీద కూడా మనము చర్చించాలి.

లంకెలు
లింకులు
  • ఇక్కడ కూడా లంకెలు అనే పదం నాకు చాలా కొత్త పదంలాగా అనిపిస్తుంది. లింకు అనే దానిని నేను విని వినీ ఉండటం వలన, ఇది నాకు తెలుగు పదంలాగానే కనిపిస్తుంది. పైగా చాలా పేజీలలో లింకులు అనే ఉపయోగిస్తున్నారు. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 16:10, 6 డిసెంబర్ 2006 (UTC)
  • లింకులు సరళమైన పదము. బాహ్య సంపర్కాలు, బాహ్య లింకులు, బాహ్య లంకెలు, బయటి లంకెలు వీటన్నటిని నేను ఒకసారి బాటు ఉపయోగించి బయటి లింకులుకి మార్చా.--వైఙాసత్య 17:12, 6 డిసెంబర్ 2006 (UTC)
  • లింకులకి నా ఓటు.--వీవెన్ 17:21, 6 డిసెంబర్ 2006 (UTC)
లంకెలు కూడా బాగానే ఉన్నది Chavakiran 08:11, 7 డిసెంబర్ 2006 (UTC)
  • నేను మొదట్లో లంకెలు వాడాను. తరువాతి రోజుల్లో లింకులు వాట్టం మొదలు పెట్టాను, కారణం తెలియదు. ప్రస్తుతం నా మొగ్గు లింకులు కే! __చదువరి (చర్చ, రచనలు) 03:01, 8 డిసెంబర్ 2006 (UTC)
లింకులు సబబుగానూ, కంప్యూటరు వాడేవారికి సుపరిచితంగానూ ఉన్నది. కాని లంకెలు పదం కాస్త వెరైటీగా ఉన్నది. కనుక ఈ విషయం వ్యాసం రాసేవారికి వదలకూడదా? రెండు పదాలు వాడుకలో ఉంటే ఇబ్బంది లేదనుకొంటాను. కాసుబాబు 17:33, 8 డిసెంబర్ 2006 (UTC)
లంకె అన్నది తెలుగు మాట (లంకెల బిందెలు).
లింకు అన్నది ఇంగ్లీషు లింక్‌ లోంచి పుట్టింది.
ఇప్పుడు లంకె ని లింకు చేస్తే 'వాడు లంకించుకున్నాడు' అనవలసి వచ్చినప్పుడల్లా 'వాడు లింకించుకున్నాడు' అనాలి, మరి.
విరేచనం అన్న తెలుగు మాట మరీ నాటుగా ఉందని నా శ్రీమతి 'బవెల్‌ మూవ్‌మెంట్' అంటుంది.
'లమ్ కిన్ఛుకున్నాడు' అన్నది కేవలమ్ పరుగెత్తడమ్ లామ్ టి క్రియల్లొవాడతామ్ కదా అమ్ దుకని 'లిన్కు' పదమే నయమ్ - సిరివరన్గల్

అయోమయ నివృత్తి[మార్చు]

దీనికేదైనా మరింత సరళమైన పదం దొరుకుతుందా?--వీవెన్ 14:49, 4 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

  1. తికమక తొలగింపు
  2. తికమక నివారణ
  3. సందిగ్ధ నివారణ
కానీ ఇప్పుడు మార్చాలంటే...!!?__చదువరి (చర్చ, రచనలు) 02:17, 5 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అయోమయ నివృత్తి అలావాటయి పోయి బానేఉంది.--వీవెన్ 03:49, 24 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

Documentationకు తెలుగు పదం[మార్చు]

ఈ పాదానికి అర్ధం "ఏదయినా విషయం గురించి పూర్తిగా వివరించి, దానిని ఎలా అభివృద్ది చేయొచ్చో, లేదా దానిని ఎలా ఉపయోగించవచ్చో చెప్పుకుంటూ పోవటమే..."; ఒకటి రెండు పదాలతో దీనికి తెలుగు సమానార్దం ఏదయినా ఉందా? __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 20:35, 23 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బ్రౌణ్యంలో కూడా దొరకలేదు. మనమే ఓ పదం సృష్టించాలి.--వీవెన్ 03:59, 24 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రదీపు గారు మీరు కొంచెం వివరంగా ప్రశ్న వేస్తె మా లాంటివారికి కూడా అర్థం అవుతుంది. నాకు ఒక అనుమానం మీరు documentation కు అర్థం ఇది "ఏదయినా విషయం గురించి పూర్తిగా వివరించి, దానిని ఎలా అభివృద్ది చేయొచ్చో, లేదా దానిని ఎలా ఉపయోగించవచ్చో చెప్పుకుంటూ పోవటమే... " అని మీరు అంటున్నరా లేక ఆ పదానికి సమాన తెలుగు పదాన్ని అడుగు తున్నారా? వివరంగా వ్రాయండీ!!!!!!--S172142230149 22:27, 23 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

S172142230149, అర్థం ఇదని చెప్పి, దానికి సమాన తెలుగుపదం అడుగుతున్నారు.--వీవెన్ 03:59, 24 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
"రచన" అంటే ఎలా ఉంటుంది?   -- వెము 23:05, 5 ఫిబ్రవరి 2008
Documentationకు తెలుగు పదం ఏదైనా చెప్పగలరా? నేను అనువదిస్తున్న కొన్ని వ్యాసాలలో ఈ పదం వుంది.

ప్రపంచ దేశాల వ్యాసాలు అనువాదం -ప్రతిపాదన[మార్చు]

తెలుగు వికీలో అన్ని ప్రపంచ దేశాలకూ ఒక్కో వ్యాసమైనా ఉండాలన్న ఆకాంక్షతో అనువాద కార్యక్రమం మొదలు పెడుతున్నాను. షుమారు 250 దేశాలకు 250 వ్యాసాలు కావాలి. సభ్యులు వీలును బట్టి పాల్గొనవలసినదని కోరుతున్నాను. ఒక్కో విడత ఐదేసి దేశాలు ఆంగ్లంనుంచి కాపీ చేసి అనువదించాలి. అనువాదానికి సమయం ఉన్న సభ్యులు తమ సంసిద్ధతను నా చర్చాపేజీలో వ్రాస్తే ఒక్కొక్కరికి ఐదేసి వ్యాసాలు అంటగడతాను. అయితే ఆంగ్ల వికీలో ఇవి బాగా పెద్ద వ్యాసాలు.

  • నిదానంగా ఒక్కొక్క వ్యాసం పూర్తిగా అనువదించాలా? ఎంత సమయం తీసుకున్నా సరే. ఇలాగయితే పని చాలా కాలం పట్టవచ్చు.
  • లేకపోతే వ్యాసాలను ఒకటి రెండు పేజీలకు కుదించాలా? ఇలాగయితే అవి సమగ్ర వ్యాసాలుగా ఉండవు. ఇప్పుడు వదిలేసిన విషయం ఇకముందు ఎవరూ చేర్చకపోవచ్చును.

అభిప్రాయాలను కోరుతున్నాను. --కాసుబాబు 09:28, 24 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అనువాదం చేస్తే పూర్తి వ్యాసాన్ని యథాతథంగా చేస్తేనే బాగుంటుంది, కుదించరాదు. ఓ రెండు నెలల దాకా నేను పాల్గొనలేను. __చదువరి (చర్చ, రచనలు) 09:32, 24 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

రివర్ట్ కు తెలుగుమాట[మార్చు]

రివర్ట్ (revert) కు తెలుగుమాట అవసరం. వెనక్కు తీసుకుపోవడం అని వాడుతున్నాం గానీ అంతకంటే మంచి మాట ఉంటే బాగుంటుంది. తిరుగుసేత అని అనొచ్చా? (తెలుగులోకి అనువదించడాన్ని తెలుగుసేత అంటారు.) __చదువరి (చర్చరచనలు) 08:08, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అనువాదకుడిని తెలుగుసేత అంటారనుకుంటున్నాను. —వీవెన్ 10:52, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
తిరుగుసేత విన్నూతంగా ఉంది. ఇంకో పదం మరలింత --వైఙాసత్య 08:37, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
క్రియాపదం కావాలనుకుంటా. కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తున్నా, నాకు తట్టింది తిరగ్గొట్టువీవెన్ 10:51, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
తిరగ్గొట్టు బాగుంది. ఫలానా మార్పులను తిరగొట్టండి అనొచ్చా? --నవీన్ 10:57, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
తిరగ్గొట్టు అంటే కాఫీ తిరగ్గొట్టి ఇవ్వు (ఒక కప్పు నుండి ఇంకో కప్పుకు వెంటవెంటనే) అన్నట్టు మిక్స్ చేయడం కాదా --వైఙాసత్య 13:20, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

డాక్యుమెంటేషన్ కి తెలుగు మాట[మార్చు]

Documentation కి తెలుగు మాట కావాలని మే నెలలో కాసుబాబు గారు అడిగేరు. పని వత్తిడి వల్ల ఈ మధ్య వికీపీడియా జోలికే రాలేదు. Document, n. ని తెలుగులో పత్రం, దాస్తు, దస్తావేజు, దస్తరం, లిఖిత పత్రం, లేఖ్యం (రాసినది) అని అనొచ్చు.

ఊదాహరణకి - Petition document = అర్జీదాస్తు Memorandum document = యాదాస్తు = యాద్ + దాస్తు (హిందీ నుండి)

Warranty document = కరారునామా, కరారు పత్రం

కనుక - Documentation అన్న మాటని నామవాచకంగా వాడదలుచుకుంటే,పై మాటలని బహువచనంగా మార్చి వాడుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఈ మాటకి తెలుగు మాట లేదు. కనుక అవసరానికి మనమే ఏదో ఒకటి తయారుచేసుకోవాలి. ఉదాహరణకి - పత్రపుంజం, లేఖ్యపుంజం, దస్తరం

ఆలోచించి చూడండి.

డాక్యుమెంట్ కి పత్రం బాగానే ఉంది కానీ డాక్యుమెంటేషన్ కి అక్షరబద్ధం లేదా అక్షరీకరణ అంటే బాగుంటుందేమో Anil 07:46, 7 ఫిబ్రవరి 2008 (UTC)

డాక్యుమెంట్ కి సమానార్ధం వివరణాత్మక పుటలు ఎలా ఉంటుంది -భావి

సైన్సు కి సంబందించిననువాదాలు[మార్చు]

సైన్సు కి సంబంధించి, వైద్య శాస్త్రానికి సంబంధించి చాలా అనువాదాలు జరుగుతున్నాయి. చాలా మంచి పరిణామము. తెవికీ లొ వివిధ అంశాలలొ రచనలు జరగడం చాలా శుభ సూచకం. కాని ఆంగ్ల ములొ ఉన్న కొన్ని పదాలకు సరైన తెలుగు పదం దొరక పోవచ్చు. అప్పుడు ఆ పదాన్ని అదేతదంగా తెలుగులిపి లొ వ్రాసి, బ్రాకెట్టు లొ ఆంగ్లం లొ రాస్తే చదివేవారికి అనుకూలం గా ఉంటుందని అనిపిస్తోంది. ఉదాహరణకు ఎడినోకార్సినోమా ఆఫ్ బ్రెస్ట్ ని యదతదంగా రాసి బ్రకెట్టు లొ (adenocarcinoma of breast) అని వ్రాస్తే బాగుంటుందని అనుకొంటున్నాను.--మాటలబాబు 13:19, 30 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అక్కడక్కడ ఆంగ్ల పదాలు పర్వాలేదు. కానీ విధానము తెలుగు వికీకి గానీ తెలుగు అభివృద్ధికి గానీ అంత దోహదం చెయ్యదు (నా అభిప్రాయం మాత్రమే). పూర్వము వచ్చిన పేపరు విజ్ఞాన సర్వస్వములలో ఇలా చేసే వారు. ఎందుకంటే ఇక్కడ వికీలాగా హైపర్ లింకులు ఉండవు కదా అందుకని. ఒక వేళ ఎడినోకార్సినోమా ఏంటి అనే సందేహం వస్తే ఎలాగూ అక్కడే దాని లింకుకు వెళ్లి తెలుసుకుంటారు కదా! తెలుగులో అనువాదం కొంచెం అపరిచితమనిపిస్తే బ్రాకెట్లలో ఆంగ్లాన్ని తెలుగు లిపిలో రాయటం ఉత్తమం ఉదాహరణకు: సాపేక్ష ఆర్ద్రత (రిలేటివ్ హ్యుమిడిటీ). ఇక అచ్చం ఆంగ్లము వీలైనంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిది. వికీలో కొత్త పదాలు సృష్టించికూడదు. ఇదివరకు ప్రయోగించిన పదాలనే వాడాలి (మౌళిక పరిశోధన నియమం) --వైజాసత్య 14:50, 30 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

పెరిగిపోతున్న అనువాదాలు[మార్చు]

అనువదించవలసిన వ్యాసాలు 150కి చేరుతున్నాయి. మునుపెన్నడు లేనన్ని అనువాదాలు పేరుకొని పోయాయి. అందువలన ఇంక కొన్ని రోజులు (ఒక నెల?) కొత్తవి ఇతర భాషలనుండి ఇక్కడ అతికించకుండా ప్రస్తుతం పేరుకుపోయిన అనువాదాల పనిపడదామా? ఏమంటారు? (నా మటుకు నేను మాత్రం ఇంకో నెలరోజులు కొత్త వ్యాసాలేమీ సృష్టించకూడదని నిర్ణయించుకున్నా..ఇది మీ ఇష్టం కానీ అనువాదాలు మాత్రం తేవద్దని నా అభ్యర్ధన) --వైజాసత్య 09:48, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అవును ఇతర వికీపీడియాల నుండి ఇక్కడికి తేవటం ఆపేయాలి. దానికి బదులుగా చర్చా పేజీలో ఇలాంటి లింకులు ఇచ్చుకుంటే ఆ వేరే వికీపీడియాలలో సమాచారం మారపోతూ ఉంటుందనే సమస్య కూడా ఉండదు. నేను గమనించిందేమిటంటే, అనువాదానికని వేరే వికీపీడియాల నుండీ తెచ్చేటప్పుడున్న ఉత్సాహం, వాటిని అనువదించేటప్పుడు తగ్గిపోతూ ఉంటుంది, క్రమేణా మాయమయ్యిపోతుంది. ఇకనుండీ, వేరే వికీపీడియాల నుండి ఎవరయినా అనువదించకుండా ఇక్కడ సమాచారాన్ని చేరిస్తే అలాంటి సమాచారాన్ని/వ్యాసాన్ని వెంటనే తొలగించేసే పద్దతి ఒకటి పెట్టుకుంటే ఎలా ఉంటుంది. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 10:04, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఇలా చేయగిలిగితే ఉత్తమం.. కానీ, కొందరు ఇక్కడికే తెచ్చుకుంటే ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క వాక్యం చొప్పున, వంతులలో అనువదించవచ్చు అని అనుకుంటారు. అందునా అతికించినప్పుడు మిగిలిన సభ్యులకు కూడా అనువాద ప్రగతి తెలిసే అవకాశముంటుంది. మరియు ఇతర సభ్యులు అతికించిన సభ్యుడు ఒక వాక్యాన్ని అనువదించటానికి కుస్తీ పడుతున్నాడనిపిస్తే సాయం చెయ్యటానికి అవకాశముంటుంది. ఇది అనువాదానికి కొత్తవాళ్లకు కొంత మంచి పద్ధతే..కానీ మనకున్న వనరుల పరిమితివలన కాస్త నియత్రించాలి. అనువాదానికి పెద్దగా సహాయం అవసరంలేని వాళ్లకు ఈ లింకు పద్ధతి బాగా సరిపోతుంది.
కొంత ఆటవిడుపు పద్ధతిగా,ఇప్పట్నించి ఇలా అతికించిన వ్యాసాలకు ఒక టైంస్టాంపుతో కూడిన మూస తగిలిద్దాం. ఓ 10 రోజుల తర్వాత ఆ వ్యాసం ఇంకా అనువాదం కాకపోతే తొలగించేద్దాం. ఏ పక్షములోనూ ఒక నెల మాత్రం ఆగుదాం --వైజాసత్య 10:20, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే చేద్దాం __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 11:12, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఏప్పట్నించో వ్యాసంలో ఒక్క ముక్క కూడా అనువాదంకాని వ్యాసాలన్నీ తొలగించా. రెండు వాక్యాలైనా అనువదించిన వ్యాసాలన్నీ అలాగే ఉంచేశా..తత్ఫలితంగా >10 కేబీ వ్యాసాల్లో పన్నెండు తగ్గిపోయాయి. --వైజాసత్య 11:48, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నేను అనువాదానికి తెచ్చిన వ్యాసాలు త్వరలోనే పూర్తి చేయగలనని ఆశిస్తున్నాను--మాటలబాబు 07:24, 7 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కన్నడ అనువాదం[మార్చు]

షిమోగ ను కన్నడలొ శివమోగ్గ అని పిలుస్తారు, మన్కేమో షిమోగ అని అలవాటు ఏది సరి, షిమోగ అంటే కన్నడ వారికి అర్థం అవుతుంది, తెలుగు, మిగతా వారికి అర్థం అవుతుంది, కాని శివమోగ్గ అమ్టే ఉత్తి కన్నడ వారికి మాత్రమే అర్థం అవుతుంది, విజయనగర కూడా ఆకోవ క్రందకే వస్తుంది--మాటలబాబు 07:24, 7 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక దారిమార్పు పెడితే పొయ్యేదేమీ లేదు.(ఇవి చాలా చీపు కేవలం ఒక 100 బైట్లు మాత్రమే ఆక్రమిస్తాయి) మీరలా భావిస్తే శివమొగ్గను షిమోగా కు తరలించండి శివమొగ్గ దారిమార్పుగా మిగిలిపోతుంది. --వైజాసత్య 07:42, 7 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
దారిమార్పు పేజీలు ఎన్ని ఎక్కువ ఉంటే విహరణలు, వెత్తుకోవటానికి చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఇంకో విషయమేమిటంటే దాదాపు అన్ని భారతీయ వికీపీడియాలలో మనకంటే ఎక్కువ దారిమార్పు పేజీలు ఉన్నాయి. బెంగాలీ, మరాఠీ లాంటి వికీపీడియాలలో జిల్లాలు, తాలూకాల ఆంగ్ల పేర్ల నుండి కూడా దారి మార్పు పేజీలను ఏర్పాటు చేసారు. బెంగాలీ వికీపీడియాలో దారి మార్పు పేజీలే సుమారు 14000 ఉన్నాయి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 08:01, 7 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అవును దారిమార్పులు, అయోమయ నివృత్తి పేజీలు వికీ శోధనా సౌలభ్యానికి చాలా అవసరం. మనం ఈ విషయంలో తెవికీని మెరుగుపరచాలి. కానీ ఆంగ్ల పేర్లతో దారిమార్పులు మాత్రం వద్దు. వాటికి అలవాటుపడితే ఇక తెలుగులో శోధించటం అలవాటు చేసుకోరు. దానివళ్ళ మెదటికే మోసమొస్తుంది..బెంగాళీ వికీలో అన్నింటికంటే ఎక్కువ శాతం ఆంగ్లం ఉండటం అందువల్లేనేమో!! ఇంతకు ముందు కొత్త సభ్యులు రాగానే పేజీల్లో ఆంగ్లము రాసేవాళ్లు ఇప్పుడు లిప్యాంతరీకరణ స్క్రిప్టు ఉండటం వలన తెలుగులో రాయటానికి ప్రయత్నిస్తున్నారు. శోధన పెట్టెలో కూడా తెలుగు వస్తుండటం వలన తెలుగులోనే శోధిస్తారు..అది ఇంటర్నెట్టులో తెలుగు అభివృద్ధికి ఎంతో ముఖ్యం కూడా :-) --వైజాసత్య 08:17, 7 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మీడియావికీ అనువాదం[మార్చు]

వికీమీడియా ఆధ్వర్యంలో నడిచే అన్ని వికీపీడియాలకూ ఈ సాఫ్టువేరే మూలాధారం. తెలుగు వికీపీడియాలో ఉన్న "మీడియావికీ" నేంస్పేసు ద్వారా ఇన్ని రోజులూ ఈ సాఫ్టువేరుని అనువదిస్తూ వచ్చాం. అయితే కొన్ని భద్రతా కారణాల వలన మీడియావికీ నేంస్పేసులో నిర్వాహకులు మాత్రమే మార్పులు చేర్పులూ చేయగలుగుతారు. ఈ అనువాద ప్రక్రియను వేగవంతం చేయడానికి, మరింత సులభంగా చేయడానికీ, మరియూ ఎవరయినా పాలుపంచుకునే విధంగా చేయడానికి, మీడియావికీ డెవలపర్లే, బీటావికీ అనే ఒక వెబ్సైటను తయారు చేసారు. అక్కడ ప్రస్తుతం మీడియావికీని దాని అనుభంద ప్రోగ్రాములను ప్రపంచంలో ఉన్న అన్ని భాషలలోకి అనువదించే ప్రక్రియ మొదలైయ్యింది. తెలుగులో కూడా ఈ అనువాదప్రక్రియ ఊపందుకోవడం మొదలైయింది. మీకు తెవికీని 100% తెలుగులో చూడాలని ఉంటే, ఈ ప్రయత్నంలో మీరు కూడా పాలుపంచుకోవచ్చు. అనువదించటం మాత్రమే కాకుండా ఇప్పటికే ఉన్న అనువాదాలను పరిశీలించి వాటిలో ఉన్న తప్పులను సరిదిద్దవచ్చు. ప్రస్తుతం తెవికీలో వాడే వ్యాక్యాలు 75% దాకా అనువదింపబడ్డాయి. తెవికీలో వాడనివి, వేరే వికీలలో వాడగలెగే వాక్యాలను 20-25% మాత్రమే అనువదించాము. పైన ఇచ్చిన లింకులోనే బీటావికీలో అనువాదాలు ఎలా మొదలు పెట్టాలో వివరించబడి ఉంది. పూర్తి సమాచారం కోసం tewiki-maiku గూగుల్ గుంపులోని ఈ వ్యాసాన్ని చూడండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 12:35, 30 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Photos for Chidambaram essay?[మార్చు]

అందరికీ నమస్కారం. శ్రీ గణేశం చెప్పుకుని చిదంబరం వ్యాసాన్ని అనువదించటం మొదలుపెట్టి ఇవ్వాళే పూర్తి చేశాను. కానీ రెండో, మూడో ఫోటోల లింకులు ఉండి పోయినై. అవి ఎవరైనా తెచ్చి అతికించగలరా? ఆ పని చేస్తే ఈ వ్యాసాన్ని అనువాదాల మూస నుంచి తొలగించొచ్చు.

Vedas in Telugu[మార్చు]

తెలుగులొ వేదాలు :

నాలుగు వేదాలు కలిగిన ఏకైక ప్రాంతీయ భాష తెలుగు అని వికిపీదియా లొ వ్రాయడం జరిగింది. అవి ఎప్పుడు, ఎవరి చేత అనే వివరణ దయచేసి ఎవరయినా ఇవ్వగలరా?

అలా ఎక్కడ వ్రాయబడి ఉందో ఆ వ్యాసంలోని చర్చా పేజిలోనే వ్రాయవలసినది. నాకు తెలిసి రంగాచార్యులు వేదాలు నాలుగింటినీ వచనంలోకి అనువదించారు. అంతకు ముందెవరన్నా అనువదించారేమో నాకు తెలీదు. Chavakiran 02:33, 21 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అవును దాసరధి రంగాచార్యులు గారు వేదాలు నాలుగింటినీ తెలుగు లోనికి అనువదించారు.

Typical కు తెలుగు పదం[మార్చు]

మనందరికి typical అంటే ఏమిటొ తెలుసు కాని దానికి తెలుగులో ఒక మంచి పదం కావలి. బ్రౌన్ నిఘంటువులో సరైన అనువాదం లేదు. నాకైతె ఏమీ తట్టడం లేదు మరి మీకేమైనా వస్తుందేమో చూడండి.--ఉదయ్ కాంత్ 18:52, 14 జూన్ 2008 (UTC) విలక్షణమైన..అనే పదము వాడ వచ్చు అని నా అభిప్రాయము--శ్రీధర్ భరద్వాజ్[ప్రత్యుత్తరం]

సందర్భాన్ని బట్టి, ఏ అర్ధంలో వాడుతున్నారో దాన్ని బట్టి తెలుగు పదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఉదహారణకి : Typically it rains in november అంటే సాధారణంగా నవంబర్లో వర్షం కురుస్తుంది అని అనువదించాలి. --వైజాసత్య 07:49, 9 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

క్రైస్తవ్యం ఒక మతం కాదు. అది ఒక మంచి మార్గం.[మార్చు]

క్రైస్తవ్యం ఒక మతం కాదు. అది ఒక మంచి మార్గం. నిజమే. మతం అనేది అనేక కఠినమైన ఆచార వ్యవహారాలతో కూడినది. ఎవరైనా క్రైస్తవ్యాన్ని ఒక మతంగా తీసుకుంటే వారికి ఆ మతం వలన ఏ ప్రయోజనమూ కలుగదు. అయితే యేసు క్రీస్తు జీవితాన్ని, ఆయన బోధలను జాగ్రత్తగా అనుసరిస్తూ క్రైస్తవ మార్గాన్ని వెంబడించేవారికి గొప్ప శాంతి సమాధానాలు కలుగుతాయి. వారి జీవితం సార్ధకం అవుతుంది. వారికి ఈ లోకంలోనే పరలోక రాజ్య వాతావరణాన్ని రుచి చూచే భాగ్యం కలుగుతుంది.(ఇంకా ఉంది)- రెవ. షాలేమ్ ఇశ్రాయేల్ 09393767615

ఈ పైన వ్రాసినది ఏదో మత ప్రచారంలో భాగంగా వ్రాసినట్టున్నదికాని, వికిపీడియా చర్చలో భాగం కాదనిపిస్తున్నది.ఇటువంటి వాఖ్యలు ఉంచాలా తీసేయాల అన్న విషయం నిర్వాహకులు ఒక్క సారి చూడాలి.--SIVA 17:31, 23 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఎవరైనా ఉత్సాహంగా ఇది వ్రాసి ఉండవచ్చును. వారికి వికీపీడియా గురించి అవగాహన లేకపోవచ్చు కూడాను. వేరే వ్యాసం గురించి వ్యాఖ్యను చర్చా పేజీలో బదులు (తెలియక) ఇక్కడ వ్రాసి ఉండవచ్చుము. అభ్యంతరకరమైన, అసభ్యకరమైన సంగతులు లేకపోతే ఇలాంటి వ్రాతలను ignore చేయడమే మంచిది. తొలగించివనసరం లేదనుకొంటాను. రెవ.షాలెమ్ గారూ! దయచేసి మీరు వికీపీడియాలో ఉన్న ఇతర వ్యాసాలను, సమాచారాన్ని చూడండి. దీనిని మరింతగా అభివృద్ధి చేయడానికి సహకరించండి. అని కోరుతున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:30, 23 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీడియావికీ అనువాదాలు - తెవికీలోని స్థానిక అనువాదాలు[మార్చు]

మీడియావికీ యొక్క స్థానికీకరణ ట్రాన్స్‌లేట్‌వికీ.నెట్ అన్న సైటులో జరుగుతుంది. అక్కడి అనువాదాలని తతిమా వికీపీడియాలలో తరచూ తాజాకరిస్తూ ఉంటారు. అయితే, మనం తెవికీలో చేసిన అనువాదాలు ఉన్నప్పుడు, వీటికే ప్రాధాన్యత ఉంటుంది. కనుక కొన్ని సార్లు, ఆ మార్పులు ఇక్కడ ప్రతిబింబించవు. ఇందుకు గానూ, మనం ఇక్కడ చేసిన అనువాదాలని తొలగించబోతున్నాను. (మరిన్ని వివరాలు)

వికీపీడియాని వాడుతున్నప్పుడు మీకేమైనా అర్థంకాని అనువాదాలు తాసరపడితే, తెలియజేయండి. వాటిని ఎలా మెరుగుపరచాలో చూద్దాం.

అలానే, ఔత్సాహికులని ట్రాన్స్‌లేట్‌వికీ.నెట్ సైటులో అనువాదాలలో పాలుపంచుకోమని కోరుతున్నాను.

వీవెన్ 02:06, 8 అక్టోబర్ 2009 (UTC)

వీకీ పీడియా తెలుగు నిర్వాహకులారా... మీకు రోషం ఉందా...[మార్చు]

వీకీపీడియా తెలుగు నిర్వాహకులారా.. మీక రోషం ఉందా అని ప్రశ్నిస్తున్నాను. మీరు వీకీపీడియా తెలుగు నిర్వాహకులు కావడానికి మీకున్న అర్హతల గురించి నేను ప్రశ్నిస్తున్నాను. రోజూ వీకీపీడియాలోకి ప్రవేశించడమా...??? లేక.. రోజువారీగా పనీపాట లేని ఉబుసుపోక చర్చల్లో మరింత చురుగ్గా పాల్గనడమా..????? అన్నాను అని కాదు... ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. తరతరాలకు ఉండేవిధంగా చక్కటి తెలుగు విజ్ఞానబాండాగరంగా వీకీపీడియాను తీర్చిదిద్దాలని.. మా ఆశ( కచ్చితంగా మీ ఆశ మాత్రం కాదు.. ) సంఖ్యాపరంగా పరిగెడుతున్నాం.. అని మీరు బాగా చంకలు కొట్టుకుంటున్నారు. తప్ప... ఒక్కసారి కళ్లు తెరిచి చూడండి ఒకడు.. బూతు భొమ్మలతో ఆర్టికల్స్‌ మీద ఇంగ్లిష్‌ టెక్ట్స్‌ ఆర్టికల్స్‌ మన మీదకు డంప్‌ చేస్తాడు. మరొకడు.. రోజూ మరే పనిలేనందంటూ తిథి పేర్లతో వందల సంఖ్యలో ఏకవాక్య ఆర్టికల్స్‌ సృష్టిస్తాడు. ఇక సినిమా విభాగానికి చెందిన కొంతమంది ప్రముఖలు ఇదే వర్గం కిందకు వస్తారు. సినిమా పేరు, నటీనటుల పేర్లతో ఆర్టికల్‌ పూర్తవుతుంది.

ఇక గూగుల్‌ వారి సంగతి చెప్పనక్కరలేదు. స్వకార్యం, స్వామి కార్యం రెండూ నెరవేరినట్లు.. ఛారిటీ పేరిట.. గూగుల్‌ వికీపీడియా తెనుగీకరణ అంటూ.. అమెరికా సామాజ్య్రవాద భావజాలాన్ని భారతదేశం దశదిశలా వ్యాప్తి చెందేలా.. యాంత్రిక అనువాదాలు జరుపుకుంటే... గౌరవనీయులైన తెలుగు వీకీపీడియా నిర్వాహకులారా... గూగుల్‌ తెలుగు సంస్కతిపై సాగుతున్న దండయాత్ర కనపడలేదా...???? ఇక గూగుల్‌ గోల ఒక్కటైతే.. యాంత్రిక అనువాదాలు చేసేవారి గోల మరొకటి. అస్సలు అది తెలుగేనా...???? మీరు ఒప్పుకుంటారో లేదో.. కానీ.. పట్టుమని పదోక్లాసు పాసుకాని వ్యక్తి కూడా.. అది తెలుగు కాదు.. తెలుగుకు పట్టిన తెగులు అని ఢంకా భజాయించి మరీ చెబుతాడు. ఈ విధంగా అప్రతిహాతంగా వీకీపీడియా తెలుగు తల్లిని దినమొక పరి వివస్త్రను చేస్తుంటే.. అవేమీ మీకు పట్టవు. గంధం తోటలో కలుపు మొక్క ఉండవచ్చు.. కానీ కలుపు తోటలో గంధం చెట్టు ఉందంటే కృతకంగా ఉంటుంది. చేవలుడిన వారుమాత్రమే తమ తోటలో కలుపును దట్టంగా పెరగనిస్తారు. మన తెలుగు వీకీపీడియా పరిస్థితి అలానే ఉంది. తెలుగు వీకీపీడియా ఇప్పుడు ఒక పెద్ద కలుపుతోట. ఏం. తెలుగువారిమైన మనకు బెంగాలీలకు ఉన్న పౌరుషం లేదా.. తమిళలకున్న రోషం లేదా...? మనమేమైనా అర్థనారీశ్వరులమా... ? మనభాషను మనం కాపాడుకోలేమా..?? మన సంస్కృతిని మనం కాపాడుకోమాలేమా..???? కాపాడుకోగలం.. ఎందుకంటే మనం అర్థనారీశ్వరులమో.. మరొకటో కాదు...

తమ భాషపై జరుగుతున్న దాడిని బెంగాలీ వీకీపీడియన్లు ఎంతో సమర్థంగా ఎదుర్కొన్నారు. అసలకు తమ భాష స్థాయికి లేవంటూ.. బెంగాలీ వీకీపీడియా నిర్వాహకులు గూగుల్‌ వారు అనువదించిన వార్తలను మొత్తాన్ని పీకిపారేశారు. వారు మొనగాళ్లు.. వారిని అభినందించవలసిందే. మన పొరుగున ఉండే తమిళ సోదరులు సైతం.. గూగుల్‌ మెడలు వంచారు. ఏమంటారు.. మనం బెంగాలీల బాట ఒక్క వారం రోజులు పడితే చాలు.. యాంత్రిక అనువాదాల పేరిట వచ్చే కథనాలను డిలీట్‌ చేస్తే.. అప్పుడు గూగుల్‌వారికి బుద్ధి వస్తుంది. అలాగే సింగిల్‌ లైన్‌ వార్తలనూ డిలీట్‌ చేస్తాం అని చెప్పి.. నాలుగు రోజులు సమయం ఇవ్వండి. మూసలు పోస్తాం. లంకెలు పెడతాం... అనే పనులకు కాస్త విరామం ఇవ్వండి. ప్రపంచంలో ఎక్కడా లేని షోడశ కన్యల గురించి, జలసూత్రం వారి వంశవృక్షం గురించి.. మరో చెత్త గురించో ప్రతిపాదనలు ఆపండి.. లేదు మీరంతా బిజీగా ఉన్నామని చెబితే.. మాకు తోచిన విధంగా తెలుగువీకీపీడియాను సంస్కరిస్తాం..


-- ఏదో తమిళ వికీపీడియన్లు చేశారు, బెంగాలీ వికీపీడియన్లు చేశారని చేయడం కాకుండా, తప్పులు ఉంటే వాటిని ఎత్తి చూపి, మీ ప్రతిపాదనకు బలం చేకూరిస్తే బావుంటుందని నా అభిప్రాయం. భాష గురించి మాట్లాడుతూ, మీరు ఉపయోగించిన ఆంగ్ల పదాలు "డిలీట్", "సింగిల్ లైన్"లను చూస్తుంటే, నాకు ఆశ్చర్యం కలుగుతుంది. మీరు భాషను సంస్కరించాలనుకుంటే తెలుగు అనువాదాలు ఏ విధంగా చేస్తే ప్రభావవంతంగా ఉంటాయో తెలియజేయండి. అంతే కాని వాళ్లు చేశారు, వీళ్లు చేశారు అని చెబుతూ, మనం కూడా చేయాలని చెప్పడం సబబు కాదేమో అని నా అభిప్రాయం. మీరు చెప్పిన వారు అంతా వారి భాషలోకి అనువదించబడిన పలు కథనాల్లో తప్పులను ఎత్తి చూపి, అవి తొలగించబడేలా చేశారు. కనుక, మీరు గూగుల్ చేయించిన అనువాద కథనాల్లోని తప్పులను ఎత్తి చూపి, మీ వాదనకు బలం చేకూర్చాలని నా అభిప్రాయం.

జలసూత్రం వారి వంశవృక్షం[మార్చు]

  • ఇది నా ఇంటి పేరు.
  • ఈ పై విషయము గూర్చి చర్చలు ఏమయ్యాయి ?
  • తిరిగి దీని గురించి చర్చించాలా ?
  • ఇంటి పేరు నేనే తీసివేసాను. తిరిగి నంబరు: 112.110.20.147 మనిషి కలపటము జరిగింది. అంత అవసరమా ?

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 12:22, 11 డిసెంబర్ 2010 (UTC)

సొది కబుర్లు[మార్చు]

జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారు మీ సొది కబుర్లు బ్యాచ్ ఈ మధ్య కనపడుట లేదు. ఏమి జరిగినది.


అడ్రస్సు లేని అర్భకుడులా........... ఏమిటీ........... ఈ అడగటము మిత్రమా........? జె.వి.ఆర్.కె.ప్రసాద్ 14:04, 23 మే 2011 (UTC)[ప్రత్యుత్తరం]

పైన అజ్ఞాత రచయితకు, దయచేసి వికిపీడియాకు సంబంధం లేని చర్చలు ఇక్కడ చేయవద్దని మనవి. --రవిచంద్ర (చర్చ) 17:00, 23 మే 2011 (UTC)[ప్రత్యుత్తరం]