సహాయం:లింకు
ఒక పేజీనుండి మరో పేజీకి పోవడానికి లింకులు ఉపయోగపడతాయి. లింకులను మీడియావికీ మూడు రకాలుగా వర్గీకరించింది.
వికీలింకు
[మార్చు]- "[[హైదరాబాదు]] లో" అని రాస్తే హైదరాబాదు లో అని కనిపిస్తుంది.
- "[[హైదరాబాదు|రాజధాని]] లోని" అని రాస్తే "రాజధాని లోని" అని కనిపిస్తుంది.
లింకు పేజీ పేరు, మనకు కనబడే పేరు వేరు వేరుగా ఉంటే సదరు లింకును "పైపు లింకు" అంటారు. పై ఉదాహరణల్లో రెండోది పైపు లింకు. లింకు "హైదరాబాదు" పేజీకి ఇచ్చినప్పటికీ, మనకు కనబడే పేరు మాత్రం "రాజధాని".
వికీలింకు గురి పెట్టిన పేజీ ఉందా లేదా అన్న సంగతిని మీడియావికీ ఆటోమాటిగ్గా గమనిస్తుంది. సదరు పేజీ లేకపోతే ఆ లింకు కొత్త పేజీ దిద్దుబాటు పేజీకి వెళ్తుంది. ఇలాంటి లింకులు డిఫాల్టు స్టైలుషీట్లో ఎర్రటి రంగులో కనిపిస్తాయి. అంచేత వీటిని ఎర్ర లింకులు అంటారు. ఓ పేజీ ఉందో లేదో తెలుసుకునేందుకు ఈ ఎర్రలింకులు ఉపయోగపడతాయి. ఈ ఎర్ర లింకులను నొక్కి కొత్త పేజీలను తయారు చెయ్యవచ్చు కూడా.
బొమ్మ, వర్గం, భాషాంతర లింకుల సిన్టాక్సు కూడా ఈ వికీలింకు సిన్టాక్సు లాగానే ఉంటాయి. మామూలుగా లింకు ఇచ్చే పక్షంలో బొమ్మ పేజీలో చేరడం, పేజీని వర్గానికి చేరడం, పేజీకి ఓ అంచున భాషాంతర లింకు ఏర్పడడం జరుగుతుంది. కానీ లింకుకు ముందు కోలను పెడితే అవి కనబడే విధానం మారిపోతుంది. ఉదాహరణకు, [[:en:Category:Help]]
, [[:fr:Help:Link]]
, and [[:బొమ్మ:Mediawiki.png]]
.
మొలక అంశం
[మార్చు]గమనిక: మొలక అంశం ప్రస్తుతం సచేతనంగా లేదు.
ఒక పేజీ ప్రధాన నేముస్పేసులో ఉండి, అది దారిమార్పు పేజీ కాకుండా ఉండి, ఆ పేజీలోని విషయం మొత్తం సభ్యుని అభిరుచులలో సూచించిన కనీస పరిమాణం కంటే తక్కువ ఉంటేనే... ఆ పేజీకి ఇచ్చే వికీలింకు మొలక తరగతి లోకి చేరుతుంది.
దీని వలన సభ్యులకు మొలక పేజీలను గుర్తించడం తేలిక అవుతుంది. అలాగే ఈ తమ అభిరుచుల్లో ఈ కనీస పరిమాణాన్ని బాగా ఎక్కువగా పెట్టుకుని కింది వాటిని చెయ్యవచ్చు:
- చాలా పెద్ద పేజీలను గుర్తించవచ్చు. అయితే, ఆ పేజీల్లో పాఠ్యం తక్కువగా ఉన్నప్పటికీ, వాటిలో చేర్చిన బొమ్మలు, మూసల కారణంగా పేజీ సైజు చాలా పెద్దది కావచ్చు.
- లింకు ప్రధాన నేముస్పేసులోని పేజీకి పోతోందా, లేదా అనేది ఒక్క చూపులో తెలిసిపోతుంది. అయితే, ప్రధాన నేముస్పేసులోని పేజీలకే వెళ్ళే దారిమార్పు లింకులను తెలుసుకోలేము.
- దారిమార్పులను తేలిగ్గా కనుక్కోవచ్చు.
అయితే, మొలక విభాగానికి లింకు ఇవ్వడం కుదరదు. ఇది పెద్ద విషయం కానప్పటికీ, అభిరుచుల్లో మరీ పెద్ద కనీస పరిమాణం పెట్టుకున్నవారికి ఇది సమస్య కాగలదు.
అంతర్వికీ లింకులు
[మార్చు]అంతర్వికీ లింకులు ఒక పేజీని వేరే వెబ్ సైటులోని వేరే పేజీకి లింకు చేస్తుంది. లక్ష్య సైటు వికీ అయిఉండాల్సిన అవసరం లేదు. ఇవి మామూలు వికీలింకుల్లానే ఉంటాయి గానీ, ఆదిపదంగా లక్ష్యం సైటు పేరు ఉంటుంది. ఉదాహరణకు, వికీమీడియా ప్రాజెక్టుల్లో [[వికీపీడియా:Main Page]]
అనే లింకు వికీపీడియా మొదటి పేజీకి వెళ్తుంది.
అదే ప్రాజెక్టుకు ఇచ్చే అంతర్వికీ లింకులు
[మార్చు]అంతర్వికీ లింకు ద్వారా ఒక వికీ నుండి అదే వికీకి లింకు ఇవ్వవచ్చు గానీ అది అంత అభిలషణీయం కాదు. అంతర్వికీ లింకు యొక్క లక్ష్యంపేజీ ఉందో లేదో మీడియావికీ చూసుకోదు. పైగా పేజీ దానికదే లింకు పెట్టుకుంటోందా అని కూడా మీడియావికీ చూడదు, పట్టించుకోదు. స్వీయ లింకు బొద్దుగా (సహాయం:లింకు -ఇలా) కనిపిస్తుంది. స్వీయ అంతర్వికీ లింకు మామూలుగానే కనిపిస్తుంది. (m:సహాయం:లింకు -ఇలా).
బయటి లింకులు
[మార్చు]ఏదైనా వెబ్ పేజీకి లింకు ఇచ్చేందుకు బయటి లింకులు పూర్తి URLను వాడతాయి.
లింకుపేరుగల ది [http://www.example.org లింకు పేరు]
ఇలా కనిపిస్తుంది: లింకు పేరు.
పేరుల్లేని లింకులకు వరుస సంఖ్యలు వచ్చి చేరతాయి:[http://www.example.org]
ఇలా కనిపిస్తుంది: [1].
స్క్వేరు బ్రాకెట్లు లేని లింకులు యథాతథంగా కనిపిస్తాయి: http://www.example.org
అంతర్గత లింకులా కాక, [http://www.example.org a] అనేది ఇలా కనిపిస్తుంది: a.
మరింత సమాచారం కోసం URLs in external links చూడండి.
ఒక సైటుకు లింకున్న అన్ని పేజీలను ప్రత్యేక:Linksearch ద్వారా చూడవచ్చు.
అదే ప్రాజెక్టుకు ఇచ్చే బయటి లింకులు
[మార్చు]లింకుల్లో ప్రత్యేక URL పారామీటర్లు ఇవ్వాలంటే బయటిలింకులు వాడతాము. ఒక పేజీ యొక్క దిద్దుబాటు చరితానికి, పేజీ దిద్దుబాటు దృశ్యానికి, రెండు కూర్పుల తేడాకు లింకులు ఈ విధంగా ఇవ్వవచ్చు. మార్గదర్శక చిత్రాన్ని చేసేందుకు కూడా ఈ పద్ధతిని వాడవచ్చు.
అయితే, అదే ప్రాజెక్టులోని మామూలు పేజీకి లింకు ఇచ్చేందుకు ఈ పద్ధతి వాడరాదు. వికీలింకుకు ఉండే ప్రయోజనాలేమీ ఈ లింకులకు ఉండావు. పైగా వేరే డోమెయినుకు ఎగుమతి చేసినపుడు లింకుల వలను తెగగొట్టవచ్చు కూడా.
బాణం గుర్తు
[మార్చు]మోనోబుక్ తొడుగులో ప్రతీ బయటి లింకుకు బాణం గుర్తు వస్తుంది. దీన్ని class="plainlinks": అని వాడి దీన్ని రాకుండా చెయ్యవచ్చు.
- <span class="plainlinks">http://a</span> అని రాస్తే http://a అని కనిపిస్తుంది.
- http://a అని రాస్తే http://a అని కనిపిస్తుంది.
విభాగానికి లింకు ఇవ్వడం
[మార్చు][[#లంగరు_పేరు]]
రూపంలో ఉండే లింకులు పేజీలోని "లంగరు_పేరు" అనే లంగరుకు వెళ్తాయి. ఈ లంగరు ఏదైనా కావచ్చు.. విభాగం కావచ్చు లేదా ఏ సూచిత స్థానమైనా కావచ్చు. [[#top]]
అనేది ఒక దాచి ఉంచిన పేరు; అది పేజీ పై భాగానికి పోతుంది. <span id="anchor_name"></span>
అనే HTML కోడు వాడి ఏదైనా ఓ లంగరు పేరును సృష్టించవచ్చు.
లంగరు లింకులను ఏ రకపు లింకుకైనా జత చెయ్యవచ్చు; మరింత సమాచారం కోసం సహాయము:విభాగం#విభాగాలను లింకు చెయ్యడం చూడండి.
దారిమార్పులు
[మార్చు]ఒక పేజీలోని విభాగానికి ఇచ్చిన దారిమార్పు ఆ విభాగానికి పోదు. అయితే, స్పష్టత కోసం అలా ఇవ్వవచ్చు. దారిమార్పు పేజీలోని లింకును నొక్కినపుడు ఆ విభాగానికి నేరుగా పోతుంది. However, links with a section to a redirect will lead to the section on the redirect's page.
ఉపపేజీ అంశం
[మార్చు]మీడియావికీలో ఉపపేజీ అనే అంశం ఉంది. ఉపపేజీ ఇలా ఉంటుంది.
పేజీపేర్లలో ఫార్వర్డు స్లాషు ("/")వాడి పేజీల వంశవృక్షాన్ని సృష్టించవచ్చు: క/గ అనే పేజీ క కి పిల్లపేజీ అవుతుంది. క తల్లిపేజీ అన్నమాట. అలాగే క/చ/జ అనేది క/చ పేజీకి పిల్లపేజీ. క/గ, క/చ, క/జ అనేవి సోదర పేజీలు.
ఉపపేజీకి పైభాగాన, వాటి పూర్వ పేజీల లింకులు కనిపిస్తాయి. తల్లిపేజీ లేకపోయినా, ఈ లింకులు కనిపిస్తాయి, కానీ పూర్వపేజీల వరుసలో ఏ పేజీ ఐనా లేకపోతే దాని ముందు పేజీ లింకు వరకే కనిపిస్తాయి.
ఇక్కడికి లింకున్న పేజీలు, సంబంధిత మార్పులు ఈ ఆటోమాటిక్ లింకులను పట్టించుకోవు.
రిలేటివ్ లింకులు
[మార్చు]ఉపపేజీ వంశవృక్షం లోపల కింద ఇచ్చిన రిలేటివ్ లింకులు వాడవచ్చు:
- [[../]] ఇలా రాస్తే ప్రస్తుత ఉపపేజీ యొక్క తల్లిపేజీకి లింకు ఏర్పడుతుంది. ఉదాహరణకు, క/గ పేజీలో ఇలా రాస్తే క కు, క/గ/చ పేజీలో ఇలా రాస్తే క/గ కు లింకు ఏర్పడుతుంది.
- [[../చ]] ప్రస్తుత ఉపపేజీ యొక్క సోదర పేజీకి ఇచ్చే లింకు, ఉదా.. క/గ నుండి క.చ కు ఇచ్చే లింకు ఇలా ఉంటుంది.
- [[/జ]] క అనే పేజీ యొక్క ఉపపేజీ. అంటే ఇది [[క/జ]] అని రాయడంతో సమానం అన్నమాట.
ఒక వృక్షం లోని తల్లిపేజీ పేరు మారినపుడు దిగువనున్న అన్నిపేజీల పేర్లు కూడా తదనుగుణంగా మారిస్తే రిలేటివ్ లింకులు పనిచేస్తాయి.
సభ్యుని స్థలం
[మార్చు]సభ్యుని పేజీ యొక్క ఉపపేజీలు ([[సభ్యుడు:సభ్యనామం/ఉపపేజీ]]
) ఆ సభ్యుని స్వస్థలంలోని పేజీలుగా భావిస్తాము. సభ్యుని స్వంత ఉపపేజీల్లో దిద్దుబాట్లపై నియమాలు అంత గట్టిగా లేనప్పటికీ, ఇతర సభ్యుల ఉపపేజీల్లో మాత్రం వాటిని గట్టిగా అమలు చేస్తాము.
అనుకోని ఉపపేజీలు
[మార్చు]మామూలుగా పేజీ పేరులో ఒక స్లాషు వస్తే అది ఆటోమాటిగ్గా ఉపపేజీ అయిపోతుంది. ఉదాహరణకు [[ఉపపేజీ ఉదాహరణ ఆర్థిక సంవత్సరం 2007/2008]]
అనే పేజీ [[ఉపపేజీ ఉదాహరణ ఆర్థిక సంవత్సరం 2007]]
పేజీకి ఉపపేజీగా అయిపోయినట్లే. అయితే ఈ పేజీ ఉనికిలో లేనంతవరకు, మొదటి దానిపై ఏ ప్రభావమూ ఉండదు. అయితే ఈ పేజీకి ఉపపేజీ తయారు చేస్తే ఆ పేజీలో పేజీ వృక్షం కనబడదు - అసలు పేజీ (తల్లిపేజీ యొక్క తల్లిపేజీ) లేదు కాబట్టి.
అవీ ఇవీ
[మార్చు]బొమ్మల ద్వారా పేజీలకు లింకులు ఇవ్వడం
[మార్చు]బొమ్మల ద్వారా ఇతర పేజీలకు లింకులు ఇవ్వవచ్చు. మరింత సమాచారం కోసం బొమ్మలతో లింకులు చూడండి.send fliocart and its rate on online shopping of cash on delery
లింకులపై "ఎగిరే పెట్టె"
[మార్చు]కొన్ని బ్రౌజర్లలో, లింకుపై కర్సరును ఉంచినపుడు ఆ లింకు యొక్క పేరు ఒక పెట్టెలో కనిపిస్తుంది. వికీలింకయితే లక్ష్యం పేజీ పేరు ఈ పెట్టెలో కనిపిస్తుంది. అంతర్వికీ లింకయితే ఆదిపదంతో సహా పేజీ పేరు, బయటి లింకయితే URL కనిపిస్తాయి.
వద్దనుకుంటే సభ్యుని అభిరుచులలో మార్చుకోడం ద్వారా, ఈ అంశాన్ని కనబడకుండా చేసుకోవచ్చు.
అనుమతి లేని కారెక్టర్లు
[మార్చు]సహాయము:పేజీ పేరు పేజీలో వివరించిన నియమాల ప్రకారం, వికీ, అంతర్వికీ లింకుల్లో ఆటోమాటిగ్గా నాన్-లిటరల్ కారెక్టర్లుగా మారతాయి. ఉదాహరణకు, "[[వికీపీడియా:పేజీ%20పేరు]]
" "వికీపీడియా:పేజీ పేరు" గా మారుతుంది. అయితే, బయటి లింకులకు దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది; లిటరల్ కారెక్టర్లు నాన్-లిటరల్ కారెక్టర్లుగా మారతాయి. ఉదాహరణకు చాలా బ్రౌజర్లు ".../wiki/!" ను ".../wiki/%21" గా మారుస్తాయి.
పైపు సింటాక్సు
[మార్చు]వికీ, అంతర్వికీ లింకుల్లో పైపు తర్వాత ఏమీ రాయకుండా వదిలేస్తే లింకులోని ఆదిపదాలు, బ్రాకెట్లను దాస్తుంది. ఉదాహరణకు, [[w:వడ్రంగి (గ్రామం)|]], వడ్రంగి గా మారుతుంది. వికీపీడియా:పైపు లింకు పేజీ చూడండి.
లింకుల ఇతర ప్రభావాలు
[మార్చు]- సంబంధిత మార్పులు
- ఇక్కడికి లింకున్న పేజీలు
- తేదీ ఫార్మాటు
- పైపు సింటాక్సు తరువాత ఖాళీ వదిలేస్తే, ([[మొదటి పేజీ| ]]), లింకు కాక, (" ") బ్రౌజరును బట్టి కేవలం ఒక్క ఖాళీ మాత్రమే చూపించవచ్చు.
ఓ పేజీ నుండి లింకులు
[మార్చు]పేజీపేరు పేజీ నుండి ఇతర పేజీలకున్న లింకులు, అక్షరానుసారంగా పేర్చి చూపించే లింకు ఇలా ఉంటుంది: {{SERVER}}{{SCRIPTPATH}}/query.php?what=links&titles=పేజీపేరు , ఉదాహరణకు.. //te.wikipedia.org/w/query.php?what=links&titles=సహాయం:లింకు .
పనిచేయని లింకులు
[మార్చు]పనిచేయని లింకుల {{dead link}} అని చేర్చితే అవిపనిచేయనట్లుగా లింకు పక్కన చూపబడుతుంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]- వికీపీడియా:పాఠం (వికీపీడియా లింకులు) - లింకులు ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్న విషయాలపై క్లుప్తంగా
- వికీపీడియా:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి#లింకులు, URLలు
- సహాయము:అంతర్వికీ లింకులు
- వికీపీడియా:పైపు లింకు
- వికీపీడియా:స్వీయ లింకు
- సహాయము:మూస#Restrictions (and the next section)
- సహాయము:ఇక్కడికి లింకున్న పేజీలు
- en:Help:URL
- m:Parser testing/replaceInternalLinks
- m:Parser testing/replaceExternalLinks
- m:Links table
- m:Brokenlinks table
- Hyperlink
- Wikipedia:Canonicalization
- Linkless
- Red Link