వికీపీడియా:వాడుకరులకు సూచనలు/కొత్త పేజీలో ఉండాల్సిన హంగులు
Appearance
కొత్త పేజీలో ఏమేం ఉండాలి
[మార్చు]ఇది కొత్త పేజీ సృష్టించేటపుడు అందులో ఏయే అంశాలు ఉండాలో చెప్పే అంశాల పాక్షిక జాబితా. అసలు వ్యాసాన్ని సృష్టించడం ఎలాగో తెలుసుకునేందుకు వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ చూడండి. కొత్త పేజీని సృష్టించినపుడు దానిలో సమాచారాన్ని చేర్చడం, దానికి సముచితమైన మూలాలివ్వడంతో పాటు, వికీపేజీకి ఉండాల్సిన హంగులు కొన్ని ఉన్నాయి. సాధారణంగా ఉండాల్సిన ఆ హంగులు ఉంటే ఆ పేజీకి మరింత విలువ చేకూరుతుంది. ఆయా హంగులను చేర్చడాన్ని పేజీ సృష్టిలో భాగంగానే భావించాలి. అలాంటి కొన్ని పనులు కింద ఉన్నాయి. ఇది పూర్తి జాబితా కాదు, కొన్ని ముఖ్యమైన అంశాల జాబితా మాత్రమే.
- మీ కొత్త పేజీని అనాథ కానీయకండి. ఈ పేజీకి వేరే పేజీల నుండి లింకులు (ఇన్‌కమింగు లింకులు) ఏమీ లేకపోతే అది అనాథ వ్యాసమౌతుంది. మీరు ఈ పేజీని సృష్టించకముందే దీనికి వేరే పేజీలనుండి ఎర్ర లింకులు ఉండే అవకాశం ఉంది. మీరు ఈ పేజీని సృష్టించగానే అవి నీలం రంగు లోకి మారిపోతాయి. నేవిగేషను పట్టీలో ఉన్న "ఇక్కడికి లింకున్న పేజీలు" అనే లింకును నొక్కితే ఏయే పేజీల నుండి ఇక్కడికి లింకులున్నాయో తెలుస్తుంది. ఒకవేళ ఈ పేజీ అనాథ అయితే, దీనికి సంబంధిత పేజీలలో ఈ కొత్త పేజీకి లింకు ఇవ్వండి. ఈ పని ఎలా చెయ్యాలో తెలుసుకునేందుకు వికీపీడియా:వికీప్రాజెక్టు/అనాథాశ్రమం పేజీ చూడండి.
- మీ కొత్త పేజీని అగాధ పేజీ కానీయకండి. ఈ పేజీ నుండి ఇతర పేజీలకు కనీసం మూడైనా వికీలింకులు ఇవ్వండి.
- మీ కొత్త పేజీని కనీసం ఒక్కటైనా వర్గం లోకి చేర్చండి.
- వ్యక్తుల పేజీలకు జనన, మరణ వర్గాలు ప్రత్యేకం. అవి ఉన్నాయా లేదా చూడండి. అలాగే ఆయా సంవత్సరాలు, తేదీల పేజీల్లో వారి జనన, మరణాలను నమోదు చెయ్యండి. మరిన్ని వివరాలకు వికీపీడియా:వికీప్రాజెక్టు/జనన మరణాల నమోదు ప్రాజెక్టు చూడండి.
- వ్యక్తుల పేజీలను వారి జననం, జీవించిన ప్రాంతాలను బట్టి భౌగోళిక వర్గాలుంటాయి. అలాగే వారి వృత్తి ప్రవృత్తులను బట్టి కూడా వర్గాలుంటాయి. వారి జాతిని బట్టి కూడా వర్గాలుంటాయి. వారి నివాసస్థితిని బట్టి కూడా వర్గాలుంటాయి. మీరు సృష్టించిన పేజీని సముచితమైన వర్గాల్లోకి చేర్చండి. ఈ విషయమై కొంత సమాచారం కోసం వికీపీడియా:వికీప్రాజెక్టు/వ్యక్తుల వర్గాల క్రమబద్ధీకరణ ప్రాజెక్టును చూడవచ్చు.
- అంతర్వికీ లింకులివ్వండి. నేవిగేషను పట్టీలో "ఇతర భాషలు" కింద వికీపీడియాల లింకులు ఇవ్వాలి. లింకు ఎలా ఇవ్వాలో తెలుసుకునేందుకు అంతర్వికీ లింకులు చూడండి.
- సమాచార పెట్టె పెట్టండి. చాలా వికీ పేజీలకు పైన కుడివైపున సమాచారపెట్టె ఉంటుంది. అది ఉండాలన్న రూలేమీ లేదు. కానీ చాలావాటికి ఉంటుంది. అది లేకపోతే సముచితమైన సమాచారపెట్టెను చేర్చండి. అందులో చేర్చాల్సిన సమాచారం వ్యాసం లోనే ఉంటుంది.
- వ్యాసంలో సంబంధించిన బొమ్మ చేర్చండి. వ్యాసంలో బొమ్మ లేకపోతే, సముచితమైన బొమ్మ కోసం తెవికీ లోను, కామన్స్ లోనూ వెతికి దాన్ని చేర్చండి. లేకపోతే మీరే సముచితమైన బొమ్మను ఎక్కించి, దాన్ని వ్యాసంలో చేర్చండి.
- {{Authority control}} అనే మూసను చేర్చండి. వ్యక్తులు, సంస్థలు, పుస్తకాలు, ప్రదేశాలు వంటి చాలా వ్యాసాల్లో ఈ మూసను చేర్చే ఆస్కారం ఉంది. ఈ మూసను పేజీలో అడుగున చేర్చాలి. ఈ మూసను పేజీలో చేరిస్తే ఎలా కనబడుతుందో తెలుసుకునేందుకు ఉదాహరణగా టి. ఎన్. శేషన్ పేజీలో అడుగున చూడవచ్చు. ఆ వ్యక్తికి అలాంటి ఐడెంటిటీలు లేకపోతే, ఈ మూసను చేర్చినప్పటికీ ఏమీ కనబడదు. మూస పేరును చేర్చితే చాలు, పరామితులేమీ ఇవ్వనక్కర్లేదు. అయితే నేవిగేషను పట్టీ లోని "వికీడేటా అంశం" లింకు తప్పనిసరిగా ఉండాలి. ఈ లింకు లేని పక్షంలో ఈ మూసకు పరామితులు ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇవేమీ లేకపోయినా ఉత్తమూసను పేజీలో చేర్చినప్పటికీ నష్టమేమీ లేదు. భవిష్యత్తులో వికీడేటా లింకు ఏర్పడినప్పుడు, అక్కడి పేజీలో ఐడెంటిటీ లక్షణాలను చేర్సితే ఇక్కడ ఈ మూస ఆటోమాటిగ్గా ఆ ఐడెంటిటీ లింకులను చూపిస్తుంది.
- మీకు ఆటోవికీబ్రౌజరు (AWB) వాడుకరి అనుమతి ఉంటే, అది తెరిచి, Pagelist లో ఈ పేజీని చేర్చి, options ట్యాబులో Regex typo fixing అనే అంశాన్ని ఎంచుకుని ఈ పేజీలో దిద్దుబాటు చెయ్యండి. అలా చేస్తే, వికీపీడియా:AutoWikiBrowser/Typos అనే పేజీలో చూపించిన భాష, శైలి, వ్యాకరణ, తదితర దోషాలు ఈ పేజీలో ఉంటే AWB వాటిని సవరిస్తుంది.
- పేజీ చదవండి. భాషాదోషాలు, శైలీ దోషాలు ఏమైనా ఉంటే సవరించండి.