వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీపీడియా గ్రంథాలయం
స్వరూపం
వికీపీడియా అభివృద్ధికి మూలాల అవసరం ఉండడం అందరికీ తెలిసిందే. వికీపీడియన్లకు విలువైన ఆకరాలను, మూలాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మరింత సమాచారాన్ని తెవికీలోకి చేర్చడమే కాక, తెవికీ వ్యాసాల నాణ్యతను, విశ్వసనీయతను అభివృద్ధి చేయవచ్చు. ఈ నేపథ్యంలో జరిగిన కృషికి కొనసాగింపుగా తెలుగు వికీపీడియన్లకు భౌతిక గ్రంథాలను, ఇ-పుస్తకాలను, మేగజైన్లను, ఇతర ప్రామాణిక, సాధికార మూలాలను మరింతగా అందుబాటులోకి తీసుకువచ్చే కృషిని సమన్వయం చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం.
అవకాశాలు
[మార్చు]- తమ గ్రంథాలను వికీపీడియన్లకు అందుబాటులోకి ఉంచడానికి ఆసక్తి చూపుతున్న వికీపీడియన్లు (ప్రస్తుతానికి వ్యక్తిగతంగా రాజశేఖర్, రహ్మానుద్దీన్, పవన్ సంతోష్ గార్లు ఇందుకు ముందుకు వచ్చారు)
- తెలంగాణా సాంస్కృతిక శాఖ అందిస్తుందని ఆశిస్తున్న గ్రాంటుతో కొనే పుస్తకాలు
- అదే గ్రాంటుతో కొనదలుచుకున్న జెస్టర్ వంటి ఆన్లైన్ ప్రామాణిక మూలాల యాక్సెస్
- అందుబాటులో ఉన్న స్కాన్డ్ కాపీలు
- వికీసోర్సులోని మూలాలు
చేయాల్సిన కార్యకలాపాలు
[మార్చు]అవకాశాల వారీగా
[మార్చు]- వికీపీడియన్లు అందుబాటులో ఉంచదలిచినవీ, వికీపీడియాకు పనికొచ్చేవీ అయిన వారి పుస్తకాలను తెవికీలో కాటలాగ్ చేయడం