వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి/నమూనా వ్యాసాలు/సంజయ్ గోవింద్ దండె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంజయ్ గోవింద్ దండె
జననం14 ఫిబ్రవరి 1948
విద్యమేజర్ మెకానికల్ ఇంజనీరింగ్ లో బి.ఈ., డాక్టరేట్
విద్యాసంస్థకాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పూణే
వృత్తిఐ.ఐ.టి కాన్పూర్ డైరెక్టర్
పురస్కారాలుపద్మశ్రీ తో

సంజయ్ గోవింద్ ధండే భారతీయ మెకానికల్ ఇంజనీర్, విద్యావేత్త.[1] ఇతను కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పూణే లో విద్యాభ్యాసం పూర్తి చేసాడు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ కు డైరెక్టర్ పదవిలో ఉన్నాడు[2]. 2016 సంవత్సరం నుంచి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్, గ్వాలియర్ కు తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

జీవిత చరిత్ర

[మార్చు]

ఇతను 14 ఫిబ్రవరి 1948 న జన్మించాడు. 1969లో కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ పూణే నుండి మేజర్ మెకానికల్ ఇంజనీరింగ్ లో బి.ఈ. పూర్తి చేసాడు. 1974 లో ఐ.ఐ.టి. కాన్పూర్ నుండి మేజర్ మెకానికల్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్ పూర్తి చేసాడు.[3]

వృత్తి జీవితం

[మార్చు]

ప్రొఫెసర్ దండె 1963 లో భారత ప్రభుత్వం ద్వారా స్థాపించబడిన ముంబై లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్(ఎన్.ఐ.టి.ఐ.ఇ,) యొక్క బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్ పదవిలో ఉన్నాడు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (ఎన్ ఐటి ఢిల్లీ) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇతను జబల్ పూర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ లో వ్యవస్థాపక అధ్యక్షుడి పదవి నిర్వహిస్తున్నాడు. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాలో పార్ట్ టైమ్ సభ్యుడిగా పనిచేశాడు. భారత ప్రధానికి సైంటిఫిక్ అడ్వైజరీ కౌన్సిల్ లో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, రాపిడ్ ప్రోటోటైపింగ్, రాపిడ్ టూలింగ్ మరియు రివర్స్ ఇంజినీరింగ్ రంగంలో ధండే పనిచేశాడు. ఆటోలే అనే సృజనాత్మక క్యాడ్ ఈ సాంకేతికతని ఇండియన్ ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ కొరకు అభివృద్ధి చేశాడు, దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఎయిర్ క్రాఫ్ట్ తయారీదారులు వాడుతున్నారు. భారతదేశంలో లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ల నిర్మాణానికి ఈ సాంకేతికతననే ఉపయోగిస్తున్నారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్, జబల్ పూర్ విభాగం భారత, జపాన్ ప్రధానమంత్రులు సంతకం చేసిన ప్రోటోకాల్ లో ఒక లబ్ధిదారుగా ఉన్నది. ఈ ప్రాంతంలో అందుబాటులో ఉన్న సంప్రదాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి భారత వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కాన్పూర్ సమీపంలోని బాంథర్ లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ శాడిల్రీ టెక్నాలజీ అండ్ ఎక్స్ పోర్ట్ మేనేజ్ మెంట్ (ఐఐఎస్ టిఎఎమ్) అనే మరో నూతన సంస్థను ధండే ఏర్పాటు చేసాడు. పూణే మరియు కోల్ కతాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) కోసం విజన్ డాక్యుమెంట్లు మరియు చార్టర్లను తయారు చేయడం ద్వారా ధండే భారత ప్రభుత్వానికి తన సహకారం అందిస్తున్నాడు. 2013లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించబడ్డాడు[4]. ప్రొఫెసర్ ధండే హైదరాబాద్ లోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మహీంద్రా ఎకోల్ సెంట్రల్ ను 2014లో స్థాపించి, 2015లో కళాశాలను విడిచిపెట్టారు.

ప్రచురణలు

[మార్చు]

డాక్టరల్ డిసెర్టేషన్

[మార్చు]

ఆగస్టు 1974లో "ద్విమితీయ మరియు త్రిమితీయ క్యామ్ యంత్రాంగాల జ్యామితీయ సంశ్లేషణ", కాన్పూర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెకానికల్ ఎంజిజి విభాగానికి సమర్పించబడింది.

రచించిన పుస్తకాలు

[మార్చు]

సంజయ్ గోవింద్ ధండే మరియు జె చక్రవర్తి కలిసి రాసిన "కైనెమాటిక్స్ అండ్ జ్యామితి ఆఫ్ ప్లానర్ అండ్ స్పేషియల్ క్యామ్ మెకానిజం" పుస్తకాన్ని 1977లో న్యూఢిల్లీలోని విలే ఈస్టర్న్ లిమిటెడ్ ప్రచురించింది. న్యూయార్క్ నగరంలోని విలే ఇంటర్నేషనల్ ఇంక్ ద్వారా ఈ పుస్తకం మార్కెట్ చేయబడుతోంది.

సంజయ్ జి ధండే మరియు ఎస్ సంపత్ సంపాదకులుగా "కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ " పుస్తకం ప్రచురించబడింది. ఈ పుస్తకాన్ని సింగపూర్ కి చెందిన అభివృద్ధి చెందుతున్న దేశాలలో సైన్స్ అండ్ టెక్నాలజీ కమిటీ (కోస్టెడ్) ప్రచురించింది. ఈ పుస్తకం 1986 సెప్టెంబరులో మద్రాస్ లోని కోస్టెడ్ లో జరిగిన "క్యాడ్ /క్యామ్ - ఆసియాలో అభివృద్ధికి చిక్కులు" అనే అంతర్జాతీయ సెమినార్ కార్యకలాపాల ఆధారంగా రూపొందించబడింది.

సంజయ్ గోవింద్ ధండే మరొక రచన "కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అండ్ డిజైన్", పుస్తకం వ్రాతప్రతి తయారీలో ఉంది. ఈ పుస్తకం ప్రచురణ కోసం విలే ఈస్టర్న్ పబ్లిషర్స్ లిమిటెడ్, న్యూఢిల్లీతో ఒప్పందం సంతకం చేయబడింది ఈ పుస్తకం అతి త్వరలో ప్రచురితమవుతుంది.

అవార్డులు మరియు గౌరవాలు

[మార్చు]
క్రమ సంఖ్య సంవత్సరం అవార్డు /గౌరవం ప్రకటించిన సంస్థ
1 1963 ఉత్తమ విద్యార్ధి 63 మోడరన్ ఉన్నత పాఠశాల, పూణె
2 1967 శ్రీ డి.పి. జోషి మరియు శ్రీమతి జె.డి. జోషి స్కాలర్ షిప్ పూనా విశ్వవిద్యాలయం
3 1968 ఎ.వి.హెచ్. పియర్స్ స్కాలర్ షిప్ పూనా విశ్వవిద్యాలయం
4 1968 డి.పి. జోషి మరియు శ్రీమతి జె.డి. జోషి స్కాలర్ షిప్ పూనా విశ్వవిద్యాలయం
5 1968 కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ స్కాలర్ షిప్ పూనా విశ్వవిద్యాలయం
6 1968 ఉత్తమ విద్యార్థి పురస్కారం రోటరీ క్లబ్, పూనా.
7 1969 ప్రిన్సిపాల్ జి.కె. ఒగాలే స్మారక బహుమతి పూనా విశ్వవిద్యాలయం
8 1969 బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ లో

అత్యుత్తమ ప్రతిభ కనబరిచానందుకు స్వర్ణ పతకం

ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా)
9 1987 విశిష్ట లెక్చరర్ కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా
10 1987 క్యాడ్ మరియు గ్రాఫిక్స్ పై టిసి 5.2 వర్కింగ్ గ్రూపు సభ్యుడిగా ఎంపిక ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ (ఐఎఫ్ ఐపి)", జ్యూరిచ్, స్విట్జర్లాండ్
11 1990 విశిష్ట బోధకుడు ఎం.ఎం. 5984, 89-90 / II , వర్జీనియా టెక్
12 1992 ప్రాక్టర్ & గాంబుల్ బెస్ట్ పేపర్ అవార్డు

(పాల్ టిడ్వెల్ , చార్లెస్ రీన్ హోల్ట్జ్ తో సంయుక్తంగా).

ఎ.ఎస్.ఎం.ఇ కాన్ఫరెన్స్.
13 1996 విశిష్ట బోధకుడు టి.ఏ 101, 95-96 / II , ఐ.ఐ.టి. కాన్పూర్
14 1996 విశిష్ట ఉపాధ్యాయుడు టి.ఏ 101, 95-96 / I & 95-96 /II , ఐ.ఐ.టి. కాన్పూర్
15 1997 విశిష్ట పూర్వ విద్యార్థి అవార్డు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, పూనా విశ్వవిద్యాలయం.
16 2001 ఫెలోగా ఎన్నిక మహారాష్ట్ర అకాడమీ ఆఫ్ సైన్సెస్.
17 2002 ఫెలోగా ఎన్నిక ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్, న్యూఢిల్లీ
18 2003 ఫెలోగా ఎన్నిక ఐఈటీఈ, ఇండియా.
19 2006 ఫెలోగా ఎన్నిక ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా).

మూలాలు

[మార్చు]


  1. http://timesofindia.indiatimes.com/city/mumbai/Online-bank-fraud-victim-awarded-Rs-18L/articleshow/28909046.cms
  2. https://www.deccanherald.com/content/61294/its-time-end-three-hour.html
  3. https://nitdelhi.ac.in/?page_id=13316
  4. http://www.dashboard-padmaawards.gov.in/?Award=Padma%20Shri&Year=2013-2013