వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి/నమూనా వ్యాసాలు/సిహెచ్. మోహన్ రావు
సిహెచ్. మోహన్ రావు | |
---|---|
జననం | హుజూరాబాద్, కరీంనగర్ జిల్లా, తెలంగాణ | 1954 జనవరి 19
జాతీయత | భారతీయుడు |
రంగములు | పరమాణు జీవశాస్త్రవేత్త |
వృత్తిసంస్థలు | సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ |
చదువుకున్న సంస్థలు | నేషనల్ ఐ ఇన్సిట్యూట్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం కాకతీయ యూనివర్సిటీ |
సిహెచ్. మోహన్ రావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన పరమాణు జీవశాస్త్రవేత్త.[1] హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి రసాయన శాస్త్రంలో పిహెచ్.డి. చేశాడు. 1990-1992 మధ్యకాలంలో యుఎస్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో విజిటింగ్ అసోసియేట్‌గా, 1996లో జపాన్‌లోని టోక్యో సైన్స్ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. 1999లో మెడికల్ సైన్సెస్ విభాగంలో భారతదేశంలో అత్యున్నత సైన్స్ అవార్డు అయిన సైన్స్ అండ్ టెక్నాలజీకి శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతిని అందుకున్నాడు.[2]
జననం, విద్య
[మార్చు]మోహన్ రావు 1954, జనవరి 19న తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ లో జన్మించాడు. 1975లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, రసాయన శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. 1977లో వరంగల్లులోని కాకతీయ యూనివర్సిటీ (ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెంటర్ వరంగల్) నుండి కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. 1984లో హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి ఫోటోకాస్టిక్ స్పెక్ట్రోస్కోపీ ఆఫ్ కెమికల్ అండ్ బయోలాజికల్ సిస్టమ్స్ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరల్ పట్టా అందుకున్నాడు.
ఇతర వివరాలు
[మార్చు]కొంతకాలం హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి డైరెక్టర్‌గా పనిచేశాడు. సిఎస్ఐఆర్-విశిష్ట శాస్త్రవేత్త, సిసిఎంబిలో సర్ జెసి బోస్ నేషనల్ ఫెలో.[3]
అవార్డులు, పదవులు
[మార్చు]కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం "విశిష్ట పూర్వ విద్యార్ధి" అవార్డును ప్రదానం చేసింది. అనేక ప్రధాన జాతీయ అవార్డులను అందుకున్నాడు. వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ (ఇండియా), ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కి ఎన్నికైన ఫెలో. సొసైటీ ఆఫ్ బయోలాజికల్ కెమిస్ట్స్ (ఇండియా), ఇండియన్ బయోఫిజికల్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్స్, తెలంగాణ సైన్స్ అకాడమీలకు అధ్యక్షుడిగా ఉన్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Andhra Pradesh / Hyderabad News : Mohan Rao is new CCMB director". The Hindu. 2009-11-13. Archived from the original on 2009-11-17. Retrieved 2022-02-27.
- ↑ "Dr. Ch. Mohan Rao" (PDF). ccmb.res.in. January 2011. Archived from the original (PDF) on 2 June 2012. Retrieved 2022-02-27.
- ↑ "Dr. Ch. Mohan Rao" (PDF). bioasia.in. 2010. Archived from the original (PDF) on 22 December 2015. Retrieved 2022-02-27.