వికీపీడియా:వికీప్రాజెక్టు/పొరుగు తెలుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎన్నెన్నో ప్రాంతాల్లో ఉన్నారు. భాషాపరంగా మైనారిటీలుగా వేర్వేరు ప్రాంతాల్లో జీవిస్తున్న తెలుగువారిలో పురాతనమైన తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు సజీవంగా వున్నాయి. వీరిలో ప్రపంచప్రఖ్యాతి చెందిన వ్యక్తులు, విశ్వనాథన్ ఆనంద్, కార్తికేయన్(రేసర్), సర్వేపల్లి రాధాకృష్ణ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటివారెందరెందరో వున్నారు. ఆయా ప్రాంతాల్లోని తెలుగు తెగలు, కులాల గురించి, ఆ ప్రాంతాల్లో జన్మించి సుప్రసిద్ధులైన తెలుగువారి గురించి, వారికున్న సమస్యల గురించి, ఆయా సమస్యలపై పోరాడుతున్న, పోరాడిన భాషా యోధుల గురించి రకరకాల కోవల్లోకి చెందే వ్యాసాలు తయారయ్యే వీలుంది. వాటిని తయారుచేసి, ఇప్పటికే వున్నవాటిని మరింత సమగ్రం చేసేందుకు ఏర్పడిందే ఈ ప్రాజెక్టు.

నేపథ్యం[మార్చు]

తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవాలు సందర్బంగా తిరుపతిలో ఫిబ్రవరి 14న భాషాపోరాటయోధులు, రచయిత స.వెం.రమేశ్ గారిని ఆహ్వానించాము. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాల్లోనూ, పొరుగు దేశాల్లోనూ తెలుగు భాషను కాపాడుకుంటూ జీవిస్తున్న తెలుగువారు, వారిలోని ప్రఖ్యాతులను కూడా తెలుగు రాష్ట్రాల వారు గుర్తించకపోవడం, వారి వెతలు వంటివి వివరించారు. ఆ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు ఆవల వున్న సంచార తెలుగు తెగలు, జాతుల గురించి వివరాలు తెలుపి, తెలుగు గురించి పోరాడిన వీరుల గురించి వివరించి ఇవన్నీ అంతర్జాలంలో అందుబాటులో లేవని వాపోయారు. ఆ క్రమంలోనే కంప్యూటర్లో తాను ఈ సమాచారం అంతా పెట్టలేనని, వేరెవరైనా చేస్తే తనవంతుగా సహకరిస్తానని మాటయిచ్చారు. అదే సమావేశంలో రాజశేఖర్, పవన్ సంతోష్ లు తాము ఆ సమాచారంతో వికీలో ఓ ప్రాజెక్టు ప్రారంభిస్తామని ముందుకువచ్చారు. అనంతరం జరిగిన చర్చలో సంధానకర్తగా వ్యవహరిస్తానని తరుణ్ ముందుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఏర్పాటైనదే పొరుగు తెలుగు ప్రాజెక్టు.

లక్ష్యాలు[మార్చు]

పొరుగు తెలుగు ప్రాజెక్టులో కొన్ని లక్ష్యాలు ప్రాథమికంగా నిర్ణయించుకున్నాము. క్రమక్రమంగా వాటిని సాధించాకా, మరికొన్ని లక్ష్యాలు నిర్ణయించుకుని ముందుకు సాగుతాము.