వికీపీడియా:వికీ సంప్రదాయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడ్డదారి:
WP:WQT

వికీపీడియా సంపాదకులు అనేక ప్రాంతాలకు, అనేక దేశాలకు చెందినవారు. ప్రతి ఒక్కరికీ విభిన్న ఆలోచనా ధోరణులు, భిన్న అభిప్రాయాలు, దృష్టికోణాలు ఉండవచ్చు. ఇతర సంపాదకులను, సభ్యులను గౌరవించడము, ఆదరించడం, కలసికట్టుగా సమన్వయముగా తెలుగులో ఇలాంటి మహోన్నత విజ్ఞాన సర్వస్వము రూపొందించుటకు ఒక కీలకాంశము.

ఈ పేజీలో కొన్ని వికీ మర్యాద యొక్క కీలకాంశాలు ఇవ్వబడినవి. వికీ మర్యాద (వికీపీడియాలో పనిచేసేటప్పుడు ఇతరులతో ఎలా వ్యవహరించాలో కొన్ని సూచనలు, సలహాలు) ఇంకా మౌలిక నిర్దేశాల కొరకు విధానాలు, మార్గదర్శకాలు పేజీ చూడండి.

మర్యాదకు మూలసూత్రాలు

[మార్చు]
 • అవతలివారిని విశ్వసించండి. స్వేచ్ఛగా దిద్దుబాటు చెయ్యడమనే సూత్రంపై ఆధారపడి వికీపీడియా పనిచేస్తూంది. ఎవరైనా ఇక్కడకు వచ్చి తమతమ విజ్ఞానాన్ని పంచవచ్చు.
 • ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలనుకుంటారో, మీరు వారితో అలాగే వ్యవహరించండి.
 • దయచేసి మర్యాదగా ఉండండి!
  • ప్రజలు మిమ్మల్ని చూడలేరు, మీ మూడ్ ఎలా ఉందో వారికి తెలియదు. కఠినమైన, పరుషమైన పదజాలం దురుసుగా అనిపిస్తాయి. మీరు ఎంచుకునే పదజాలం విషయంలో జాగ్రత్తగా ఉండండి — ఇతరులు అర్థం చేసుకునేది, మీరు చెప్పదలచుకున్నది కాకపోవచ్చు.
 • చర్చాపేజీల్లో సంతకం చెయ్యండి (వ్యాసాల్లో కాదు!).
 • ఓ అంగీకారానికి రావడం కోసం ప్రయత్నించండి.
 • విషయంపై వాదించండి, వ్యక్తులపై కాదు.
 • ప్రశ్నలను ఎదుర్కోండి, తప్పుకోకండి.
  • ఇతర సభ్యులు మీ దిద్దుబాటుతో అంగీకరించకపోతే, అది సరైనదని ఎందుకు అనుకుంటున్నారో సకారణంగా వివరించండి.
 • అవతలివారు చెప్పేది సరి అని అనిపిస్తే ఒప్పేసుకోండి; మీ వ్యతిరేకత మీ అభిరుచి ప్రకారమే అయితే అదే విషయాన్ని ఒప్పేసుకోండి.
  • మీరు చెప్పని విషయాలపై ప్రజలు చర్చించుకునేలా చెయ్యకండి.
 • మర్యాదగా ఉండండి.
 • చర్చ మంచి వేడిగా ఉన్నపుడు, అవతలి వారు మీరు ఆశించినంత మర్యాదగా ప్రవర్తించనపుడు, మీరు వారి కంటే ఎక్కువ మర్యాదగా ఉండండి. తక్కువ మర్యాదగా కాదు.
  • ఆ విధంగా ఘర్షణను సృష్టించిన పాపం మీకు చుట్టుకోదు. ఓ దెబ్బ తిన్నాక కూడా ఎదురుదాడి చెయ్యకుండా సంయమనంగా వ్యవహరించినట్లు. చూసేవాళ్ళంతా దీన్ని హర్షిస్తారు. (కనీసం హర్షించాలి).
  • అయితే, వారు మాట్లాడే విధానం మీకు నచ్చలేదని స్పష్టంగా చెప్పండి. లేకపోతే మీరు మరీ తోలుమందం కాబోలని మరింత రెచ్చిపోగలరు వాళ్ళు. మీకు తెలియకుండానే వాళ్ళను ప్రోత్సహించినట్టవుతుంది.
 • మీది తప్పైనపుడు మన్నించమని అడిగేందుకు వెనకాడకండి.
  • "అయ్యో అలా అనకుండా ఉండాల్సింది" అని తరువాత అనుకునే సందర్భాలు చర్చల్లో వస్తాయి. అలా అనిపించినపుడు అదేమాట చెప్పెయ్యండి.
 • మన్నించండి, మరచిపోండి.
 • మీకు ఆప్తమైన విషయాలను గమనింపులో పెట్టుకుని వాటి పట్ల పక్షపాతంగా వ్యవహరించకుండా జాగ్రత్తగా ఉండండి.
 • అభినందించాల్సినపుడు అభినందించండి. ప్రతివారూ మెప్పుదలను కోరుకుంటారు. సభ్యుని చర్చాపేజీలో మీ మెప్పుదలను వ్రాయండి.
 • మీరు సృష్టించిన వివాదాలు ముగిసాక, వాటిని తీసెయ్యండి.
 • వాదనలో పాల్గొన్న వారిలో మీరూ ఉంటే, కొన్నాళ్ళు తప్పుకోండి. మీరు మధ్యవర్తిత్వం చేస్తుంటే, తప్పుకొమ్మని వివాదగ్రస్తులకు చెప్పండి.
  • ఓ వారం తరువాత తిరిగి రండి. మధ్యవర్తి కావాలని మీకు అనిపిస్తే, అప్పటికింకా ఎవ్వరూ రంగంలో లేకపోతే, ఎవరో ఒకరిని అడగండి.
  • వివాదాస్పద వ్యాసం నుండి తప్పుకుని మరో వ్యాసంపై పనిచెయ్యండి. వికీపీడియాలో 96,149 వ్యాసాలున్నాయి!
 • ఏది వికీపీడియా కాదో గుర్తుకు తెచ్చుకోండి.
 • సాధ్యమైనంత వరకు పేజీని వెనక్కు తిప్పడాలు, తొలగింపులకు దూరంగా ఉండండి. 3RR నియమాన్ని మరువకండి.

పరోక్ష విమర్శలు మానుకోండి

[మార్చు]

మీరు సవరణ వ్యాఖ్యలు మరియు చర్చా పేజీలలో వ్రాస్తున్నప్పుడు వివరించలేని భయపెట్టే వచనాలు ఇంకా విమర్శించే ఇతర మార్గాలను ఉపయోగించడం లేదా పరోక్ష విమర్శలు చేయడం మానుకోండి. ఇతర సభ్యులు మీకు సులభంగా ప్రతిస్పందించడానికి వీలు కల్పించే విధంగా స్పష్టంగా, సంక్షిప్తంగా వ్రాయండి.

వ్యంగ్యాన్ని వ్రాతపూర్వకంగా సులభంగా తెలియజేయలేమని, ఇతరులు దానిని తప్పుగా అర్థం చేసుకోవచ్చని గుర్తుంచుకోండి. నిర్మాణాత్మక విమర్శలను వ్యక్తపరిచేటప్పుడు ద్వేషం తో కూడిన, వేరువేరు అర్ధాలని ఇచ్చే ద్వంద్వ పదాలను నివారించాలి.ఇది విమర్శలను స్వీకరించే వారికి మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి, మీ ఆందోళనలకు ప్రతిస్పందించడానికి సహాయపడుతుంది. వాస్తవానికి ఏ పద్ధతిలోనైనా మరియు ఏదైనా అంశానికి సంబంధించిన విమర్శ అయినా తప్పనిసరిగా నాగరికంగా ఉండాలి,అంతేకాక ఇతర వికీపీడియా విధానాలు మరియు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి.

చర్చాపేజీల్లో దుశ్చర్యను నివారించడం ఎలా?

[మార్చు]

తమ పని పట్ల, తమ దృక్కోణం పట్ల చాలామంది గర్వంగా ఉంటారు. దిద్దుబాట్లు జరిగినపుడు అహాలు దెబ్బతినే అవకాశం ఉంది. కానీ చర్చాపేజీలు ప్రతీకారం తీర్చుకునే వేదికలు కావు. దెబ్బతిన్న అహాలను సమాధాన పరచేందుకు చక్కటి స్థలాలవి. వ్యాసాల విషయంలో తలెత్తిన అభిప్రాయ భేదాల నిర్మూలనా స్థలం ఈ చర్చపేజీలు. ఇక్కడ వ్యాకరణపరంగా సరైన సంభాషణ చేయవలసిన అవసరం లేకపోయినా, మర్యాదపూర్వకంగా మరియు దయతో సంభాషణను కలిగి ఉండటం అవసరం, మీ దిద్దుబాటు తరువాత మీ సంతకం చేయండి. ఎవరైనా మీతో ఏకీభవించనట్లయితే, ఎందుకో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, చర్చా పేజీలలో మీ చర్చలో మీ మార్గం మంచిదని మీరు భావించడానికి తగిన కారణాలను అందించడానికి సమయాన్ని వెచ్చించండి. చర్చాపేజీ ని ఉపయోగకరంగా చేయడానికి సరైన బావంతో కూడిన పదాలను ఉపయోగించండి, "నేను అర్దంచేసుకొన్నట్లు" మరియు "నాకు తెలిసినంత వరకు" వంటివి మీ అభిప్రాయాన్ని తెలియజేయడంలో మీకు సహాయపడతాయి. మీరు ఎవరినైనా తప్పుగా ఎంచటానికి సిద్ధంగా ఉండకముందే, మీరు వారిని తప్పుగా అర్థం చేసుకున్నారని అంగీకరించండి.

ఇతరుల చర్చా వ్యాఖ్యలను సవరించవద్దువాడుకరి చర్చ లో విషయం చేర్చిన తరువాత అందులో అక్షరదోషం, వ్యాకరణాన్ని సరిచేసినప్పటికీ, మరొకరు చేర్చిన చేసిన చర్చా విషయాన్ని సవరించడం సాధారణంగా ఆమోదయోగ్యం కాదు.

చర్చా పేజీని తొలగించడం మంచిది కాదు. వీటివలన అదే వాదనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో అదే లేదా ఇలాంటి చర్చ జరిగినప్పుడు దానిని తొలగించకుండా వదిలేయడం ఉపయోగకరంగా ఉంటుంది. చర్చను సమీక్షించడం ద్వారా కథనంలో ఒక నిర్దిష్ట నిర్ణయం ఎందుకు తీసుకోబడిందో కూడా స్పష్టంగా తెలుస్తుంది.


మదిలో ఉంచుకోవాల్సిన కొన్ని విషయాలు

[మార్చు]
 • వికీపీడియా వ్యాసాలు అన్ని దృక్కోణాలను చూపించాలి. వివిధ దృక్కోణాల్లో ఏది సరైనది అనే విషయాన్ని చర్చించేందుకు చర్చాపేజీ వేదిక కాదు. ఆ పనికోసం Usenet, బ్లాగు ల వంటి అనేక ఇతర వేదికలున్నాయి. వ్యాసంలోని ఖచ్చితత్వం, తటస్థత మొదలైన విషయాల గురించి మాత్రమే చర్చాపేజీల్లో చర్చించాలి.
 • సూత్రప్రాయంగా, విషయాలను తొలగించడాన్ని నివారించండి. మీరు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు, ఇప్పటికే ఉన్న విషయంలో చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని కనుగొనే అవకాశం ఉండవచ్చు. ఎందుకంటే మీతో సహా ప్రతి ఒక్కరూ ఉపయోగకరమైన జ్ఞానాన్ని పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి విరుద్ధంగా, సవరణలు తొలగించడం వలన వ్యక్తులకు చికాకు కలుగుతుంది అంతేకాక వారు తమ సమయాన్ని వృధా చేసినట్లు వారికి అనిపిస్తుంది.
 • ఎవరైనా ఒక వ్యాసంపై ఆచరణాత్మక పద్దతులు లేకుండా వ్యాఖ్యానించినప్పుడు, వారిని ఒంటరిగా వదిలేయడమే ఉత్తమమైన పని. మీరు ఏది ఒప్పు లేదా తప్పు అని మీరు చెప్పాల్సిన అవసరం లేదు.
 • ఒకరి దృక్కోణాన్ని అవమానించే ముందు, అతను మీ అభిప్రాయాన్ని అవమానించడం ప్రారంభిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. గుర్తుంచుకోండి, వికీలో వ్రాసినది ఎల్లప్పుడూ కనిపించదు, కానీ అది శాశ్వతంగా సేవ్ చేయబడుతుంది.
 • మీతో ఎవరైనా విభేదిస్తే, దానర్థం (1) మీరంటే వారికిష్టం లేనట్లో, (2) వారు మిమ్మల్ని మూర్ఖుడిగా భావిస్తున్నట్లో, (3) వారు మూర్ఖులైనట్లో, (4) ఆ వ్యక్తి దుష్టుడనో, మరోటో కాదు. వ్యాసాలపై ప్రజలు వెలిబుచ్చిన అభిప్రాయాలను వ్యాసం వరకే పరిమితం చెయ్యండి.
 • వికీపీడియా మిమ్మల్ని చొరవగా దిద్దుబాట్లు చెయ్యమంటోంది. చర్చ మొదలుపెట్టే ముందు ఓ ప్రశ్న వేసుకోండి: దీన్ని చర్చించాల్సిన అవసరం ఉందా? ఓ దిద్దుబాటు సారాంశాన్ని రాసి, అవతలి వారి స్పందన కోసం ఎదురు చూడొచ్చా? నా చర్యలు నేను పరిగణించని పరిణామాలను కలిగి ఉండవచ్చా?
 • వ్యాసం పేజీలో చర్చించాల్సిన అవసరం లేనపుడు, ఈమెయిల్లోనో, మీ చర్చాపేజీ లోనో చర్చించవచ్చు.

మర్యాద పూర్వక చర్చపై మరిన్ని చిట్కాలు

[మార్చు]
 • మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో స్పష్టంగా చెప్పండి -మరీ ముఖ్యంగా చర్చలో గత వ్యాఖ్యకు సమాధాన మిచ్చేటపుడు
  • గత వ్యాఖ్యను ఉదహరిస్తే మంచిది. మీరా వ్యాఖ్యను ఎలా అర్థం చేసుకున్నారో రాస్తే మరింత మంచిది. అవతలి వారి అభిప్రాయం తప్పని రాసేటపుడు మీరు వారిని సరిగా అర్థం చేసుకోకపోయి ఉండొచ్చని ముందే రాయండి.
 • సభ్యులకు గానీ, వారి దిద్దుబాట్లకు గానీ పేర్లు పెట్టకండి. వారిపై వ్యక్తిగత దాడులు చెయ్యకండి.
  • "పిచ్చి రాతలు", "తప్పుడు రాతలు" వంటి మాటలు రాయకండి. అటువంటి మాటలు అవతలి వారిని బాధిస్తాయి. చర్చ సాఫీగా జరగదు.

మరిన్ని సలహాలు

[మార్చు]
 • ఇతరులను స్వాగతించండి (పాతవారిని కూడా; వారు మీకు నచ్చకున్నా సరే)
 • స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పండి
 • రెండో చెంప చూపించండి (దిద్దుబాటు యుద్ధాల్లో పాల్గొనకండి)
 • అభినందించండి, ముఖ్యంగా మీకు తెలియనివారిని (ఎక్కువ మంది అభినందనను కోరుకుంటారు)
 • క్షమించండి.
 • పక్షపాతాలను అర్థం చేసుకోండి - మనలో ఎవరూ పరిపూర్ణులు కాదు. మీకు కూడా ఏవైనా పక్షపాతాలు ఉంటే, వాటిని గుర్తించి వాటిని నియంత్రించండి.
 • నిర్దిష్ట వ్యక్తిని లక్ష్యంగా చేసుకోకండి. గుర్తుంచుకోండి, అతని పనితో మీకు విభేదాలు ఉండవచ్చు, కానీ అది వ్యక్తిగత శత్రుత్వం కాదు.
 • కొంటెచేష్టలు చేసేవారిని, విధ్వంసాలకు తెగబడేవారిని మరియు వికీ-అరాచకవాదులను దూరం పెట్టండి , వారిని అనుమతిస్తే, మీ సమయాన్ని వృధా చేసి, ఇక్కడ విషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తారు.