వికీపీడియా:సమిష్టి వ్యాసం/2007 28వ వారం
Appearance
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎ.పి.యస్.ఆర్.టి.సి), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ ప్రపంచంలోనే ప్రభుత్వ రంగంలో నడుస్తున్న అతి పెద్ద రోడ్డు రవాణా సంస్థగా గిన్నిస్ బుక్ 1999లో నమోదైనది. 1932లో 27 బస్సులతో ప్రారంభమైన ఈ రవాణా సంస్థ ఇప్పుడు 19,000 బస్సులతో ప్రతి రోజు 1.2 కోట్లమందిని, 1 లక్షా 17 వేలమంది సిబ్బంది సహాయముతో రవాణా చేస్తుంది.
రాష్ట్రములోని జిల్లాలు, పట్టణాలు, గ్రామాలను అనుసంధానించడమే కాక పెద్ద నగరములలో సిటీ బస్సు సేవలను మరియు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఒరిస్సా, చత్తీస్‌ఘడ్, గోవా, కర్ణాటక, తమిళనాడు మరియు పాండిచ్చేరిలకు కూడా బస్సులు నడుపుతున్నది.