వికీపీడియా:2020 సమీక్ష
Jump to navigation
Jump to search
వికీపీడియా:సమావేశం/తెవికీ_జన్మదిన_వేడుక_2019/తెలుగు_వికీపీడియా_పరిస్థితిపై_వాడుకరుల_అభిప్రాయాలు-2019 నుండి తీసుకున్నది
2020 జనవరి 17 నాటి పరిస్థితి
[మార్చు]- అయోమయ నివృత్తి పేజీల కున్న లింకులను సవరించేందుకు వికీపీడియా:వికీప్రాజెక్టు/అయోమయ నివృత్తి అనే ప్రాజెక్టును ప్రారంభించాం. AWB వాడి ఈ పని చెయ్యడం కొంత త్వరగా అవుతుంది. అయితే AWB ని వాడడంలో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఎవరెవరికి AWB అనుమతి ఇవ్వాలనే విషయమై చర్చ మొదలైంది.
- వాడుకరులు చర్చల్లో పాల్గొనడంలో కొంత మెరుగైనట్లు కనిపించినా, పెద్దగా పురోగతి ఏం లేదు.
- భాషా దోషాలకు సంబంధించి ఇంకా ఏకోన్ముఖ, సాముదాయిక కృషి మొదలవలేదు. అయితే ఇద్దరు ముగ్గురు వాడుకరులు చురుగ్గా వ్యవహరిస్తూ, యాంత్రికానువాదాలపై దృష్టి పెట్టి, సరిచెయ్యడం, తొలగించడం చేస్తూ ఉన్నారు. ఇప్పటికి 50 వ్యాసాల వరకూ వీరి చర్యలకు గురయ్యాయి. ఇతర వాడుకరులు కూడా ఈ విషయంపై మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
- మొలక వ్యాసాల పట్ల ఒక్కసారిగా చర్యలు పెరిగాయి. వికీపీడియా:క్రియాశీల వాడుకరులు సృష్టించిన మొలక వ్యాసాల గణాంకాలు అనే పేజీలోని గణాంకాలను అనుసరించి వాడుకరులు మొలకలను అభివృద్ధి చెయ్యడం మొదలైంది. __చదువరి (చర్చ • రచనలు) 04:23, 17 జనవరి 2020 (UTC)
2020 ఏప్రిల్ 7 నాటి పరిస్థితి
[మార్చు]- యాంత్రికానువాద వ్యాసాలను తొలగించారు (సుమారు 2000 వ్యాసాలు). ఆ వ్యాసాలను ఒక జాబితాగా వేసి ఉంచారు. వాడుకరులు ఆ పేజీలను తిరిగి సృష్టించే పని చేస్తున్నారు.
- "మరియు" పదం ఉన్న పేజిల్లో ఆ పదాన్ని తీసేసారు.
- యాంత్రికానువాదం ద్వారా సృష్టించే పేజిల విషయంలో రెండు నియంత్రణలను అమల్లో పెట్టారు
- యాంత్రికానువాదం 70% కంటే ఎక్కువ ఉంటే ఆ పేజీని ప్రచురించదు
- యాంతికానువాదంలో "మరియు" పదం ఉంటే ప్రచురించదు
- మొలక వ్యాసాలను అభివృద్ధి చెయ్యడం జరుగుతోంది
2020 డిసెంబరు 9 నాటి పరిస్థితి
[మార్చు]- 2020 జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మొలకల విస్తరణ కోసం ఒక వికీప్రాజెక్టును పెట్టుకుని 2800 పైచిలుకు మొలకలను విస్తరించారు. మొత్తం మొలకల్లో ఇది 43% పైమాటే.