వికీపీడియా:AWB ఖాతా అనుమతి విధానం
స్వరూపం
తెలుగు వికీపీడియా లోని నిర్వాహకులకు ఆటోమాటిగ్గా AWB వాడే అనుమతి లభిస్తుంది. ఇతరులు దీన్ని ప్రత్యేకించి పొందాల్సి ఉంటుంది. ఆటోవికీబ్రౌజరును వాడేందుకు ఎనుమతి ఎలా పొందాలనే విధానాన్ని ఈ పేజీ ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనకు మూలం రచ్చబండలో జరిగిన ఈ చర్చ. ఆ చర్చలో వచ్చిన సూచనల ప్రకారం ఈ ప్రతిపాదనను తయారు చేసాను. కొన్ని కొత్త అంశాలను కూడా చేర్చాను. దీనిపై చర్చాపేజీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుందాం. ఆ తరువాత దీన్ని విధానంగా ప్రకటిద్దాం.
AWB వాడుకరి అనుమతి పొందేందుకు ఉండాల్సిన కనీస అర్హతలు
[మార్చు]AWB వాడుకరిగా అనుమతి పొందాలంటే, వాడుకరులకు కింది కనీసార్హతలు ఉండాలి.
- తెలుగు వికీపీడియాలో ఏ పేరుబరిలో నైనా కనీసం 500 దిద్దుబాట్లు చేసి ఉండాలి.
- సదరు వాడుకరికి వికీవిధానాలపై తగు పరిజ్ఞానం ఉందని నిర్వాహకులు భావించాలి. లేదని ఎవరైనా భావిస్తే తగు ఉదాహరణలు చూపించాలి. వారికి ఉన్న పరిజ్ఞానాన్ని నిర్ధారించుకునేందుకు వాడుకరులు ఆ వాడుకరిని ప్రశ్నలు అడగవచ్చు. దానికి వచ్చిన సమాధానాలను బట్టి నిర్ణయం తీసుకోవచ్చు
- నిర్వాహకులకు ఆటోమాటిగ్గా AWB అనుమతి ఉన్నప్పటికీ వారు ఆ అనుమతులను నిర్వాహక పనులకు తప్పించి ఇతర పనులకు వాడరాదు. మామూలు దిద్దుబాటు పనులు చెయ్యాలంటే నిర్వహకులు కూడా వేరే వాడుకరిని సృష్టించుకుని దానికి అనుమతి కోరాలి.
అనుమతి కోరడం
[మార్చు]AWB అనుమతి కోరదలచిన వాడుకరి కింది పద్ధతిని పాటించాలి.
- అనుమతి కోరే వాడుకరి ముందుగా అందుకోసం ఒక కొత్త వాడుకరిఖాతాను సృష్టించుకోవాలి. ఆ వాడుకరిపేరులో చివర AWB అని ఉంటే బాగుంటుంది.
- వికీపీడియా చర్చ:AutoWikiBrowser/CheckPage అనే పేజీలో తన అభ్యర్ధనను కింది విధంగా నమోదు చెయ్యాలి.
- "వాడుకరి నమోదు అభ్యర్ధనలు" అనే విభాగం లోని "వాడుకరులు" అనే ఉప విభాగంలో
*{{AWBUserTewiki|మీ ప్రస్తుత వాడుకరిపేరు|మీరు కావాలనుకుంటున్న AWB వాడుకరిపేరు}}
అని రాసి సంతకం చెయ్యాలి. దాంతో మీ అభ్యర్ధన పూర్తైనట్లే.
- "వాడుకరి నమోదు అభ్యర్ధనలు" అనే విభాగం లోని "వాడుకరులు" అనే ఉప విభాగంలో
అభ్యర్ధనను పరిశీలించడం
[మార్చు]నిర్వాహకులు అభ్యర్ధనలను కింది విధంగా పరిశీలించవచ్చు.
- తెవికీలో కనీసం 500 మార్పుచేర్పులున్నాయా?
- వేరే వాడుకరి ఖాతాను సృష్టించుకున్నారా?
- ఇప్పటి వరకూ ఈ వాడుకరి చేసిన మార్పుచేర్పులను గమనిస్తే, వారు ఈ అనుమతికి అర్హులేనా? [అర్హులే/అంతటి నైపుణ్యం లేదు/తెలియదు]
- నైపుణ్యం ఉందని మీరు భావిస్తే ఆ సంగతి రాయండి. కారణాలను కూడా రాస్తే మంచిది.
- నైపుణ్యం లేదని మీరు భావిస్తే కారణాలను వివరిస్తూ రాయండి. మీ అభిప్రాయాన్ని నిరూపించే ప్రశ్నలు అడగండి. దానికి ఆ వాడుకరి ఇచ్చే సమాధానాలను బట్టి ఇతర నిర్వాహకులకు కూడా ఆ వాడుకరి నైపుణ్యం పట్ల అంచనా ఏర్పడుతుంది.
- తెలియక పోతే, తెలుసుకునేందుకు ఉపయోగపడే ప్రశ్నలు అడగండి.
- ఒక వారం తరువాత నిర్ణయం వెలువరించాలి.
- అనుమతులు ఇవ్వకూడదని ఎవరైనా అభిప్రాయపడి ఉంటే, ఆ చర్చపై నిర్ణయం తటస్థ నిర్వాహకులు వెలువరించాలి.
- అభ్యర్ధనకు వ్యతిరేకంగా ఎవ్వరూ లేకపోతే, నిర్ణయం ఎవరైనా వెలువరించవచ్చు.
- నిర్ణయం
- అభ్యర్ధనను తిరస్కరిస్తే ఆ విషయాన్ని వాడుకరికి తెలియజెయ్యాలి.
- అభ్యర్ధనను ఆమోదిస్తే కింది విభాగంలో చూపిన పనులు చెయ్యాలి
అనుమతులు ఇచ్చే పద్ధతి
[మార్చు]అభ్యర్ధనను నిర్వాహకులు ఆమోదించినపుడు కింది చర్యలు తీసుకోవాలి.
- వికీపీడియా:AutoWikiBrowser/CheckPage పేజీలో, Approved users అనే విభాగంలో (ఈ విభాగం పేరు ఇలాగే ఉండాలి, మార్చరాదు, అనువదించరాదు) అనుమతించిన వాడుకరిపేరును (AWB వాడుకరిపేరు) చేర్చండి. వాడుకరిపేరు ఏ తప్పూ లేకుండా, ఎలా ఉందో ఖచ్చితంగా అలాగే రాయాలి.
- అనుమతి కోరిన వాడుకరికి ఈ సంగతి తెలియజేస్తూ ఆ వాడుకరి చర్చా పేజీలో రాయండి. అనుమతి కేవలం 50 మార్పులకే ఇచ్చామని, 50 మార్పుల తరువాత మళ్ళీ మరి దిద్దుబాట్లేమీ చెయ్యకుండా ఆ మార్పుల పరిశీలన కొరకు మిమ్మల్ని అభ్యర్ధించాలనీ రాయండి.
- 50 మార్పులు తరువాత ఆ వాడుకరి తెలియజేసినపుడు ఆ మార్పులను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకోవాలి
- ఆ మార్పులు సంతృప్తికరంగా ఉంటే, ఇక కొనసాగించమని ఆ వాడుకరికి చెప్పాలి
- మరింత అనుభవం అవసరమని భావిస్తే, కారణాలతో సహా ఆ సంగతి తెలియజేసి మరొ 50 మార్పులకు అవకాశం ఇవ్వాలి.
- అసలు AWB వాడేందుకు అనుమతించే అవకాశం ఆ వాడుకరికి ఇవ్వలేమని మీరు భావిస్తే ఆ విషయాన్నే తెలియజేసి, వికీపీడియా:AutoWikiBrowser/CheckPage పేజీలో, Approved users అనే విభాగంలో చేర్చిన ఆ వాడుకరిపేరును తీసెయ్యాలి.
అనుమతులు రద్దు చేసే విధానం
[మార్చు]- ఏ వాడుకరి యైనా AWB ఖాతాను దురుపయోగం చేస్తున్నారని గాని, వాడడం సరిగ్గా తెలియక తప్పులు చేస్తున్నారని గానీ వాడుకరులెవరైనా ససాక్ష్యంగా ఫిర్యాదు చెయ్యవచ్చు. ఫిర్యాదును వికీపీడియా:నిర్వాహకుల నోటీసుబోర్డు లో చెయ్యాలి. దానిపై నిర్వాహకులు దర్యాప్తు చేసి, చర్చించి తగు నిర్ణయం తీసుకుంటారు.
- నిర్ణయం అనుమతి కొనసాగింపు అయితే చేసేది ఏమీ లేదు.
- నిర్ణయం అనుమతి రద్దు అయితే: వికీపీడియా:AutoWikiBrowser/CheckPage పేజీలో, Approved users అనే విభాగంలో చేర్చిన ఆ వాడుకరిపేరును తీసెయ్యాలి.